PDPL: ఓదెల మండలం పోత్కపల్లి రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ నుంచి కాగజ్నగర్ వెళుతున్న భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలు నుంచి బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు ఓ యువకుడు కింద పడ్డాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని క్షతగాత్రుడిని 108లో ఆస్పత్రికి తరలించారు. కాగా, అతడి రెండు కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. మంచిర్యాల జిల్లా వాసిగా గుర్తించారు.