TG: మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కంటైనర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. అడ్డాకుల మండలం కాటవరం దగ్గర ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుంచి బస్సు ప్రొద్దుటూరు వెళ్తుంది. కాగా ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.