VZM: తమను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అనసూయ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాలో జరిగిన యూనియన్ జిల్లా మహాసభలలో అనసూయ మాట్లాడుతూ.. పిల్లలకు ప్రాథమిక విద్యను అందిస్తున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం చూపటం సరికాదని అంగన్వాడీల సమస్యల పరిష్కరించలని అన్నారు.