PPM: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు తప్పనిసరిగా లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి అందజేయాలని డీఆర్డీఏ పీడీ ఏం. సుధారాణి పేర్కున్నారు. ఇవాళ సీతానగరం మండలం లక్ష్మీపురం గ్రామంలో పింఛన్లు పంపిణీను పరిశీలించారు. లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పింఛన్ పంపిణీ చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రజలను పింఛన్ మొత్తం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు.