W.G: ఏలూరు 2వ పట్టణ పరిధిలోని పెన్షన్ లైన్ ప్రాంతానికి చెందిన చార్లీ విలియమ్స్ స్థానికంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతని క్రెడిట్ కార్డు నుంచి రూ. 29,000 అతను ఏ విధమైన లావాదేవీలు చేయకుండా అపహరణకు గురయ్యాయి. దీంతో సైబర్ నేరగాళ్లు తన ఖాతా నుంచి డబ్బులు దొంగిలించారని గుర్తించిన బాధితుడు 2 టౌన్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశాడు.