AKP: గొలుగొండ ఎస్సీ కాలనీలో సోమవారం జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఇంఛార్జ్ ఎంపీడీవో బాబురావు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి స్వయంగా వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.