AP: పలాస పట్టణ టీడీపీ నేత హత్యకేసులో పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు బీహార్ గ్యాంగ్. మిగిలిన 10 మంది వైసీపీ నేతలు కాగా.. పరారీలో ఉన్నారని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. వారి దగ్గర నుంచి రెండు తుపాకులు, ఒక తపంచా, 40 బుల్లెట్లు, మూడు బైక్‌లు, కారు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. టీడీపీ నేత హత్యకు బీహార్ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు వెల్లడించారు.