TG: హైదరాబాద్లోని మేడ్చల్లో దారుణం జరిగింది. నెమ్మదిగా మాట్లాడమన్నందుకు వ్యక్తిని హత్య చేశాడు. ఈ ఘటన నేరేడ్మెట్ వినాయకనగర్ చౌరస్తా చోటుచేసుకుంది. రాముల అనే వ్యక్తి పాన్ కొట్టుండగా మరో వ్యక్తి గట్టిగా అరుస్తుండటంతో నెమ్మదిగా మాట్లాడాలని సూచించాడు. దాంతో ఇద్దరి మధ్య మటామాట పెరిగి రాములను దుండగుడు రాయితో కొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.