NDL: బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలో రైతు పొలంలో ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఎస్సై జగన్మోహన్ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పెద్ద సుబ్బారాయుడు అప్పుల బాధ తట్టుకోలేక పొలంలో ఉరి వేసుకొని మృతి చెందాడని పేర్కొన్నారు. భార్య బాల వీరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.