NLR: మర్రిపాడులోని నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై HP పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. యూ-టర్న్ తీసుకుంటున్న బైక్ను మరో బైక్ ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులలో ఒకరు భారత్ పెట్రోల్ బంక్ యజమాని మధుబాబుకాగా మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. వారిని ఆస్పత్రికి తరలించారు.