TPT: పట్టణంలోని రుయా ఆసుపత్రి సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ శవం లభించినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. వెస్ట్ పోలీస్ ప్రసాద్ గుర్తించి మీడియాకు సమాచారం ఇచ్చారు. ఆమె వయసు సుమారు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండొచ్చని, వివరాలు తెలిసిన వారు తమకు సమాచారం అందించాలన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.