ప్రకాశం: హైదరాబాద్ నుంచి ట్రాన్స్ ఫార్మర్ లోడుతో చెన్నై వెళ్తున్న లారీ ఆదివారం 8 గంటల సమయంలో మద్దిపాడు మండలం కొస్టాలు సెంటర్ వద్ద అదుపుతప్పింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండగా లారీ అదుపుతప్పి సర్వీస్ రోడ్ ఫెన్సింగ్లోకి దూసుకెళ్లినట్లు స్థానికుల సమాచారం. ఈ ప్రమాదంలో ఎవరికి ఏటువంటి గాయాలు కాలేదు. హైవే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.