JN: తాటికొండ గ్రామానికి చెందిన మారపాక విజయ్(36)అనే ఆటో డ్రైవర్ కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ జి.వేణు తెలిపారు. గత కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్న విజయ్ ఆదివారం ఉదయం నొప్పి ఎక్కువవడంతో భరించలేక ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకున్నాడని, మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.