»Priyanka Jain Say To Nagarjuna On The 50 Lakh Prize Money
Priyanka: నాన్నకు ప్రాపర్టీ, షాపులు లేవు, అమ్మ పేరు మీద ఆస్తులు లేవు
బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే రూ.50 లక్షలతో అమ్మ నాన్నకు చక్కని ఇల్లు కొనిస్తానని ప్రియాంక జైన్ చెప్పారు. నాన్నకు ఇల్లు లేదని, షాపు కూడా లేదన్నారు. అలాగే అమ్మ పేరు మీద కూడా ఆస్తులు లేవని స్పష్టంచేశారు.
Priyanka Jain Say To Nagarjuna On The 50 Lakh Prize Money
Priyanka: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా హాట్ హాట్‌గా సాగుతోంది. రియాల్టీ షో ఫైనల్‌కు చేరుకుంది. మరో రెండు వారాల్లో ఫైనలిస్ట్ ఎవరో తెలియనుంది. టాప్-5లో అర్జున్ అంబటి చోటు దక్కించుకున్నాడు. నిన్న గౌతమ్ ఎలిమినేట్ కాగా.. మరో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో అర్జున్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకోగా.. ఆరుగురు ఉంటారు. వారిలో ఒకరు ఎలిమినేట్ అయితే.. ఈ వారం ఆట తీరు ఆధారంగా మిగిలిన నలుగురు టాప్-5 చేరుకుంటారు. ఈ సారి ఫైనలిస్ట్‌కు రూ.50 లక్షల నగదు, బ్రెజ్జా కారు, అలాగే జోసలుక్కాస్ రూ.15 లక్షల విలువ గల బంగారు ఆభరణాల సెట్ ఇస్తామని హోస్ట్ నాగార్జున (Nagarjuna) చెప్పారు.
టైటిల్ గెలిస్తే ఆ రూ.50 లక్షలు ఏం చేస్తారని ఒక్కొక్కరిని అడిగారు. తాను గెలిస్తే అమ్మకు ఉన్న లోన్లు క్లియర్ చేస్తానని గౌతమ్ (Gautham) చెప్పారు. కానీ ఎలిమినేట్ అయ్యారు. ప్రియాంక (Priyanka Jain) వంతు రాగా.. నిజాయితీగా సమాధానం ఇచ్చింది. తన తండ్రికి ఎలాంటి ప్రాపర్టీ లేదని చెప్పింది. ఇల్లు లేదు, షాప్ కూడా లేదని చెప్పింది. అమ్మ పేరు మీద కూడా ఆస్తులు లేవని పేర్కొంది. అందుకే రూ.50 లక్షలు వస్తే ఓ ఇల్లు తీసుకొని గిప్ట్గా ఇవ్వాలని అనుకుంటున్నానని తెలిపింది.
మిగతా కంటెస్టెంట్లు కూడా ఒక్కొక్కరు సూటిగా సమాధానం ఇచ్చారు. తన భార్య క్యారింగ్ కాబట్టి.. పుట్టే బిడ్డ కోసం, అలాగే చారిటీ కోసం ఖర్చు చేస్తానని అర్జున్ (arjun) చెప్పారు. గెలిచిన తర్వాత చూస్తానని శివాజీ (shivaji) సమాధానం ఇచ్చారు. డబ్బు కోసం రాలేదని పల్లవి ప్రశాంత్ (pallavi prashanth) చెప్పుకొచ్చారు. తాను టైటిల్ గెలిస్తే.. పంట రాక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఆ డబ్బును సాయం చేస్తానని చెప్పి మిగతా వారి మనసును గెలుచుకున్నారు.