దేశంలో మరోసారి కరోనా కలకలం రేపింది. బుధవారం ఒక్కరోజే 702 కోవిడ్ 19 కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సంఖ్యతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా ఇన్ఫెక్షన్ కేసుల సంఖ్య 4,097కి పెరిగింది.
హైదరాబాద్ పోలీసులు మరో భారీ డ్రగ్ మాఫియా గుట్టు రట్టు చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా మహారాష్ట్ర నుంచి డ్రగ్స్ తెస్తున్న ముగ్గురు నేరగాళ్లను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
రామ మందిర ప్రారంభోత్సవానికి 3 లక్షల మందికి పైగా ప్రజలు అయోధ్యకు చేరుకుంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రారంభోత్సవ వేడుకలో నెట్వర్క్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. దీంతో టెలికాం కంపెనీల నెట్వర్క్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని టెలికమ్య
మళ్లీ అధికారంలోకి వస్తామన్న గుడ్డి ఆశతో మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎవరికీ తెలవకుండా ఎన్నికల ముందే 22 ల్యాండ్‌క్రూజర్ వాహనాలను కొనుగోలు చేశారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య 80 రోజులకు పైగా యుద్ధం కొనసాగుతోంది. క్రిస్మస్ సందర్భంగా గాజాలో ఇజ్రాయెల్ భారీ విధ్వంసం సృష్టించింది. ఇజ్రాయెల్ దాడిలో 70 మందికి పైగా మరణించారు.
తెలంగాణలో నార్కోటిక్స్ అధికారులు భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అయినా రాష్ట్రంలో ఆల్ప్రజోలం ఔషధ విక్రయాలు కొనసాగుతున్నాయి. ఆల్ప్రా జోలం విక్రయాలపై ఇప్పటి వరకు 66 కేసులు నమోదయ్యాయి.
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ తన నివాసంలో క్రైస్తవ సమాజానికి చెందిన వారితో సమావేశమయ్యారు. కమ్యూనిటీ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీమాట్లాడుతూ, క్రైస్తవ సమాజంతో తనకు సన్నిహిత సంబంధం ఉందన్నారు.
బిగ్ బాస్ 7లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె హౌస్ లో ఎలిమినేట్ అయ్యి మరోసారి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.
గురుగ్రామ్‌లో ఆలయ గోడ కూలడంతో పెను ప్రమాదం సంభవించింది. గోడ కూలిపోవడంతో ఐదుగురు కూలీలు శిథిలాల కింద కూరుకుపోయారు. కూలీలను వెలికితీసే పనులు కొనసాగుతున్నాయని చెబుతున్నారు.