తెలంగాణలో నార్కోటిక్స్ అధికారులు భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అయినా రాష్ట్రంలో ఆల్ప్రజోలం ఔషధ విక్రయాలు కొనసాగుతున్నాయి. ఆల్ప్రా జోలం విక్రయాలపై ఇప్పటి వరకు 66 కేసులు నమోదయ్యాయి.
Drugs : తెలంగాణలో నార్కోటిక్స్ అధికారులు భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అయినా రాష్ట్రంలో ఆల్ప్రజోలం ఔషధ విక్రయాలు కొనసాగుతున్నాయి. ఆల్ప్రా జోలం విక్రయాలపై ఇప్పటి వరకు 66 కేసులు నమోదయ్యాయి. గ్రాము రూ.10 వేల చొప్పున ఈ ముఠా డ్రగ్స్ విక్రయించింది. తెలంగాణలో గత రెండేళ్లలో టీఎస్ఎన్ఏబీ 43 కేసులు నమోదు చేసింది. 3.14 కోట్ల విలువైన ఆల్ప్రజోలంను డీఆర్ఐ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. పరమేశ్వర కెమికల్స్ ఎండీ కిరణ్ కుమార్, లింగయ్య గౌడ్ ఆధ్వర్యంలో 70 కిలోల డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ ముఠాకు గచ్చి బౌలికి చెందిన నరసింహ కీలక సూత్రధారిగా గుర్తించారు.
అయితే నరసింహ ఢిల్లీ నుంచి 34 కిలోల డ్రగ్స్ తెచ్చినట్లు ఎన్ఏఏబీ గుర్తించింది. ఆల్ప్రా జోలం డ్రగ్‌ను పలు ఫ్యాక్టరీల్లో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నరసింహగౌడ్ గత 25 ఏళ్లుగా డ్రగ్స్ రవాణా చేస్తున్నాడని.. ఢిల్లీ నుంచి మెట్రో కొరియర్ సర్వీస్‌లో నరసింహులు మత్తు పదార్థాలను రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. నరసింహులు 2.4 లక్షల రూపాయలకు కెజి అల్ప్రా జోలం కొనుగోలు చేసి హైదరాబాద్‌లో 3.5 లక్షల రూపాయలకు విక్రయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రతినెలా 40 కిలోలకు పైగా మందులు విక్రయిస్తున్నారని తెలిపారు. నర్సింహగౌడ్‌తో పాటు అతని కుమారుడు రాజశేఖర్‌గౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బుతో నరసింహగౌడ్ కుటుంబ సభ్యులు భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఇతనిపై ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయని నార్కోటిక్స్ బ్యూరో అధికారులు చెబుతున్నారు.