• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

విలేకరి హత్య ఘటనపై అన్ని కోణాల్లో విచారణ

CTR: వీ.కోట మండలంలో విలేకరి హత్య ఘటనపై జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ దర్యాప్తు కొనసాగుతుండగా, నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎవరూ నిర్ధారించని సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని ప్రజలకు, మీడియాకు విజ్ఞప్తి చేశారు.

April 29, 2026 / 10:28 AM IST

లారీ డైవర్‌పై దాడి.. ఆపై దోపిడి

ప్రకాశం: ఒంగోలు శివారులోని ఆలాస్ హోటల్ వద్ద మంగళవారం లారీ డ్రైవర్‌పై ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడి చేసి, బెదిరించి, అతని వద్ద ఉన్న రూ. 2వేల నగదును దోచుకొని పరారయ్యారు. వలేటివారిపాలెంనకు చెందిన శ్రీనివాసరావు చెన్నై వెళుతూ.. బహిర్భూమికి వెళ్లేందుకు లారీని ఆపినప్పుడు ఈ సంఘటన జరిగింది. బాధితుడు ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

April 29, 2026 / 10:19 AM IST

వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రికి భారీ ఊరట

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు భారీ ఊరట కల్పించింది. ఆయనకు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది. గతంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లకూడదంటూ కండీషనల్ బెయిల్ ఇవ్వగా.. ఇప్పుడు పూర్తి స్థాయి బెయిల్ ఇచ్చింది. ఈయన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు.

April 29, 2026 / 10:19 AM IST

గుడిలో చోరీ కేసులో 3 నెలలు జైలు శిక్ష

GNTR: తెలంగాణకి చెందిన ఆంజనేయులు, ప్రకాశం (D)కు చెందిన శ్రీనివాసకుమార్‌ మరికొందరు కలసి చుండూరు (M) చిన పరిమిలోని రామలింగేశ్వరస్వామి ఆలయ గోపుర కలశానికి మహిమలు ఉన్నాయని భావించి 2019లో చోరీ చేసేందుకు యత్నించారు. అప్పటి ఈవో ఫిర్యాదుపై నిందితులను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. మంగళవారం విచారణలో వీరికి 3 నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

April 29, 2026 / 10:15 AM IST

డీజిల్ కొరతతో కదలని యంత్రాలు.!

KDP: ఖాజీపేటలో డీజిల్ కొరత తీవ్ర సమస్యగా మారింది. దీంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలో పలు గ్రామాలలో రబీ కింద వరి పంటలు సాగు చేశారు. ప్రస్తుతం పంట కోతకొచ్చింది. డీజిల్ కొరత వల్ల వరి కోత యంత్రాలు ముందుకు కదలలేకున్నాయి. డీజిల్ సమస్య కారణంగా యంత్రాలకు పని లేకుండా పోయిందని వాహనదారులు వాపోతున్నారు.

April 29, 2026 / 10:12 AM IST

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పర్యటన వివరాలు

అన్నమయ్య: మాజీ సీఎం,బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని కలికిరికి వెళ్లనున్నారు. మార్గమధ్యంలో భాకరాపేట సమీపంలోని ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని, రాత్రికి కలికిరిలో బస చేస్తారు. శుక్రవారం స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. శనివారం సాయంత్రం తిరుపతికి చేరుకుని పద్మావతి అతిథి గృహంలో బస చేయనున్నారు.

April 29, 2026 / 10:11 AM IST

పెట్రోల్ బంకులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. గత ఐదు రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద డీజిల్, పెట్రోల్ దొరకక ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పట్టణంలో ఉన్న పెట్రోల్ బంకులను పరిశీలించారు. డీజిల్ సమస్యలపై మాజీ ఎమ్మెల్యే పెట్రోల్ బంక్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

April 29, 2026 / 10:11 AM IST

నాతవరంలో స్వచ్ఛపదం కార్యక్రమం

AKP: నాతవరంలో బుధవారం స్వచ్ఛపదం కార్యక్రమం నిర్వహించారు. నాతవరం నుంచి ఏకే అగ్రహారం వరకు సుమారు 2.5 కి.మీ రహదారి ఇరువైపులా శుభ్రపరిచారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎంపీడీఓ ఎం.ఎస్. శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ కే.మూర్తిబాబు, పంచాయతీ కార్యదర్శి బి.చంద్రశేఖర్, మాజీ ఎంపీపీలు కొండబాబు, విజయ్ కుమార్ పాల్గొన్నారు.

April 29, 2026 / 10:10 AM IST

సేంద్రియ ఆహార ఉత్పత్తుల ప్యాకింగ్ పై శిక్షణ

W.G: సేంద్రియ ఆహార ఉత్పత్తుల తయారీ ఎంత ముఖ్యమో, ప్యాకింగ్, బ్రాండింగ్ కూడా అంతే ముఖ్యమని జిల్లా ఉద్యానవన అధికారి షాజా నాయక్ తెలిపారు. వట్లూరులోని టీటీడీసీ సమావేశ మందిరంలో ‘ఆహార ఉత్పత్తుల ప్యాకింగ్, లేబిలింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ పై శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఉత్పత్తుల నాణ్యతతో పాటు ఆకర్షణీయమైన ప్యాకింగ్ కూడా ఎంతో అవసరమని అన్నారు.

April 29, 2026 / 10:10 AM IST

అధికారుల తప్పిదం.. మూడేళ్లుగా పోరాటం

TPT: తిరుపతి స్విమ్స్ కార్మికులను కార్పొరేషన్‌లో విలీన చేసే సమయంలో పోస్టుల పేర్లు తప్పుగా నమోదు చేశారు. దీంతో 700 మందికి పైగా కార్మికులకు మూడేళ్లుగా వేతనాలు పెరగలేదు. నెలకు సుమారు రూ.6 వేల నష్టం చవిచూస్తూ, ఒక్కొక్కరు ఇప్పటివరకు రూ.1.80 లక్షలు కోల్పోయారు. 2023లో TTD తీసుకున్న నిర్ణయాలు అమలు కాకపోవడంతో సమస్య కొనసాగుతోంది.

April 29, 2026 / 10:04 AM IST

ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం.. ఇంటింటికీ అవగాహన

PPM: సాలూరు పట్టణంలో బుధవారం ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలను ప్రోత్సహించేందుకు ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వ బడులను ఎంపిక చేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ బృందాలు ఇంటింటికీ వెళ్లాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ రాజకుమార్ నేతృత్వంలో ఎంఈఓ వెంకట్రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

April 29, 2026 / 10:03 AM IST

“పరీక్ష ఫలితాలపై టెన్షన్ వద్దు”

ASR: జిల్లాలో పదో తరగతి ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 264పాఠశాలలకు చెందిన 11,988మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల వేళ విద్యార్థులు ఆందోళన చెందవ ద్దని, మార్కులు తక్కువ వచ్చినా లేదా ఫెయిల్ అయినా అది జీవితానికి ముగింపు కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఓటమిని విజయానికి తొలిమెట్టుగా భావించి ధైర్యంగా ముందుకు సాగాలన్నారు.

April 29, 2026 / 10:02 AM IST

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రూ. 10 వేల జరిమానా

ATP: తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి కోర్టు భారీ జరిమానా విధించింది. నంద్యాల జిల్లాకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ నరిగ నగేష్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, మెజిస్ట్రేట్ ప్రభావతి రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

April 29, 2026 / 10:00 AM IST

ధర్మవరంలో రథోత్సవంలో మంత్రి

SS: ధర్మవరం పట్టణంలోని మడుగు తేరు వద్ద నిర్వహించిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి రథోత్సవం భక్తుల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో కలిసి రథోత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

April 29, 2026 / 10:00 AM IST

దోమల నివారణకు చర్యలు

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని 6వ వార్డులో వార్డు కౌన్సిలర్ రహమత్ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని చైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి, కమిషనర్ చిన బాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన అధికారులు దోమల నివారణకు చర్యలు చేపడుతూ స్ప్రే చేశారు. ఖాళీ ప్రదేశాల్లో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు.

April 29, 2026 / 10:00 AM IST