• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపు ఫించన్ల పంపిణీకీ సర్వం సిద్దం: MPDO

VZM: వంగర మండలంలో జూన్‌ నెలకు సంబంధించి NTR భరోసా ఫించన్ల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు MPDO టి.రాజారావు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..19 గ్రామ సచివాలయాలలో 142 మంది సిబ్బందితో 6240 పింఛన్‌లకు రూ.2,65,86,500 కోట్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ఈ మేరకు శతశాతం పింఛన్‌ పంపిణీ చేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు.

May 31, 2026 / 04:06 PM IST

రెండు ఆర్వోబీల నిర్మాణానికి రూ.84 కోట్లు

PLD: పెదకూరపాడు రైల్వే స్టేషన్ వద్ద (LC-27), సత్తెనపల్లి-రెడ్డిగూడెం మధ్య (LC-40) రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జిల(ROB) నిర్మాణానికి రూ.84 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుత రైల్వే గేట్ల స్థానంలో కొత్తగా టూ-లేన్ వంతెనలు నిర్మిస్తారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు, ప్రయాణికుల నిరీక్షణకు చెక్ పడనుంది. రైల్వే అధికారులు ఇప్పటికే టెండర్లు పిలిచారు.

May 31, 2026 / 04:06 PM IST

యువత ‘మన్ కీ బాత్’ తప్పక చూడాలి: తేజేశ్వరరావు

SKLM: పీఎం మోదీ నిర్వహించే మన్ కీ బాత్ శ్రీకాకుళంలోని విద్యార్థులతో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎస్ తేజేశ్వరరావు ఆదివారం వీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలో నెలవారీగా జరుగుతున్న ముఖ్యమైన అంశాలను ప్రధాని ప్రజలతో పంచుకుంటారని తెలిపారు. యువత తప్పనిసరిగా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించాలని సూచించారు.

May 31, 2026 / 04:05 PM IST

ఏనుగుల తరలింపుకు చర్యలు చేపట్టాలి: సీపీఎం

PPM: జిల్లాలో రైతులకు నష్టం కలిగిస్తున్న అడవి ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కొమరాడలో ఇవాళ సీపీఎం మండల కన్వీనర్ సాంబమూర్తి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏనుగుల సంచారంతో పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుంకీ ఏనుగుల సహాయంతో అడవి ఏనుగుల గుంపును ఇతర ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

May 31, 2026 / 04:01 PM IST

‘కాలువలపై ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తాం’

ATP: తాడిపత్రి పట్టణంలో కాలువలపై ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తామని మాజీ మున్సిపల్ ఛైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఇవాళ సంచలన ప్రకటన చేశారు. ప్రధాన రహదారి పక్కన ఉన్న కాలువలలో వ్యాపారస్తులు చెత్తాచెదారం వేయడం వల్లే కాలువలు బూడిపోతున్నాయని ఆయన అన్నారు. వర్షం వచ్చినప్పుడు వరద నీరు రోడ్లపై పారి ఇళ్లలోకి చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.

May 31, 2026 / 04:00 PM IST

రూ.50 లక్షలతో సుందరీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన

E.G: నిడదవోలు రూరల్ మండలం సమిశ్రగూడెంలో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన చేశారు. చెరువు వద్ద వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, ఫెన్సింగ్, బెంచీలు, పచ్చదనం అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యం, వినోదం కోసం ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందన్నారు.

May 31, 2026 / 04:00 PM IST

ప్రజా మన్ననలు పొందేలా ప్రభుత్వ సేవలుండాలి: కలెక్టర్

KKD: వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా చేపడుతున్న పనులు ప్రజల మన్ననలు పొందేలా ఉండాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచించారు. అధికారులతో నిర్వహించిన సమీక్షలో పౌర సేవలపై ‘పబ్లిక్ పాజిటివ్ పర్ఫార్మెన్స్’ స్థాయిని పరిశీలించారు. అన్న కాంటీన్లు, వివిధ హాస్టళ్లలో అందిస్తున్న ఆహార నాణ్యత, అర్బన్, రూరల్ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం కల్పించారు.

May 31, 2026 / 04:00 PM IST

పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. వృద్ధురాలు ఫిర్యాదు

కోనసీమ: హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో పవన్ కళ్యాణ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై అమలాపురానికి చెందిన 80 ఏళ్ల జనసేన వీర మహిళ ముత్యాల మణెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శలకు హద్దులు ఉండాలని, వ్యక్తిగత దూషణలు సమంజసం కాదని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అమలాపురం పట్టణ పోలీసులను కోరారు.

May 31, 2026 / 04:00 PM IST

చిల్డ్రన్స్ పార్క్ ప్రారంభం

BPT: పట్టణం పెయింటర్స్ కాలనీలో నూతనంగా నిర్మించిన చిల్డ్రన్స్ పార్కును ఆదివారం ఘనంగా ప్రారంభించారు. రూ.25 లక్షల వ్యయంతో పిల్లల కోసం ప్రత్యేకంగా దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి, కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవర్మ రాజు హాజరయ్యారు.

May 31, 2026 / 03:58 PM IST

డివైడర్‌ను ఢీకొట్టిన స్కూటీ.. ఇద్దరికి గాయాలు

ప్రకాశం: టంగుటూరు(M)పెళ్లూరు దగ్గర ఇవాళ పేస్ కాలేజీ వద్ద స్కూటీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇరువురు వ్యక్తులు క్రింద పడ్డారు. ఇద్దరికీ తల వద్ద గాయాలు అయి స్పృహ తప్పారు. వారిద్దరుని స్థానికులు 108కు ఫోన్ చేసి రిమ్స్ హాస్పటల్‌కు తరలించారు. ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా సేఫ్టీ కోన్స్ పెట్టారు. స్కూటీ నడుపుతున్న తన్నీరు శ్రీనుగా గుర్తించారు.

May 31, 2026 / 03:57 PM IST

2 టౌన్ పోలీసులను అభినందించిన ASP విభుకృష్ణ

KDP: ప్రొద్దుటూరు 2టౌన్ CI వంశీనాథ్ ఆధ్వర్యంలో SI రాఘవేంద్ర రెడ్డి, సిబ్బంది 13 మంది క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను పట్టుకున్నారు. ఈ కేసులో 2టౌన్ పోలీసుల నిఘా, పనితీరుపై ASP విభుకృష్ణ అభినందించారు. ప్రొద్దుటూరుకు చెందిన షేక్ జావీద్, జిలాన్, రామచంద్ర, మహమ్మద్ రఫీ, అస్లాం, విష్ణు నరసింహ, జేమ్స్, గౌస్ బాషా, పఠాన్ జాఫర్, రాజకులాయప్ప (PVLD), ఇంతియాజ్(NDYL)ను అరెస్టు చేశారు.

May 31, 2026 / 03:55 PM IST

గ్రంథాలయంలో విద్యార్థులకు శిక్షణ తరగతులు

ELR: పెదపాడు శాఖ గ్రంథాలయంలో ఆదివారం వేసవి విజ్ఞాన శిబిరం ఘనంగా జరిగింది. రిసోర్స్ పర్సన్ గుంటూరు శ్రీనివాసరావు ‘పంజాబ్ కేసరి’ లాలా లజపతిరాయ్ జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులతో కథా పఠనం, పుస్తక పఠనం చేయించి, క్యారమ్స్, చెస్ ఆటలలో శిక్షణ ఇచ్చారు. విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

May 31, 2026 / 03:43 PM IST

రేపు చలో కలక్టరేట్‌కు వైసీపీ పిలుపు

VZM: డీఎస్సీలో జరిగిన అక్రమాలు, తలెత్తిన లోపాలను నిరసిస్తూ YCP యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం కలక్టరేట్ వద్ద దర్నా చేపడుతున్నట్లు నియోజకవర్గ అధ్యక్షుడు వంశీకృష్ణ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నెహ్రూ యువకేంద్రం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

May 31, 2026 / 03:40 PM IST

గాజువాకలో ఈ-బస్సుల ప్రారంభం

VSP: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 100 ఎలక్ట్రిక్ బస్సుల్లో భాగంగా తొలి విడతగా 9 ఆధునిక ఈ-బస్సులను గాజువాక ఆర్టీసీ డిపోలో ప్రారంభించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, TDP రాష్ట్ర అధ్యక్షుడు ప‌ల్లా శ్రీనివాస‌రావుతో కలిసి ఈ బస్సులను ప్రారంభించారు. పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విశాఖను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతామన్నారు .

May 31, 2026 / 03:40 PM IST

25 ప్రాంతాలలో కార్డెన్ సెర్చ్

CTR: మాదకద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ తుషార్ తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు సిబ్బంది జిల్లాలోని 25 ప్రాంతాలలో ఆదివారం కార్డెన్ సర్చ్ నిర్వహించారు. డ్రగ్ డిటెక్షన్ కిట్స్ ద్వారా 110 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. ఐరాల మండలంలో గన్ పౌడర్, పేలుడుకు ఉపయోగించే పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.

May 31, 2026 / 03:35 PM IST