• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

డీజిల్ కొరత ప్రభావం.. కూరగాయల ధరలు భారం

WG: డీజిల్ కొరత, రవాణా ఖర్చుల పెరుగుదల ప్రభావంతో ఆకివీడులో కూరగాయల ధరలు బుధవారం కొండెక్కాయి. పంట దిగుబడి తగ్గడంతో మార్కెట్‌లో వంకాయ రూ. 80, బీరకాయ, బెండ రూ. 70, టమాటా రూ. 60గా విక్రయిస్తున్నారు. ములక్కాడ ఒకటి రూ.10 పలుకుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు పడుతున్నట్లు వినియోగదారులు అరోపిస్తున్నారు.

April 29, 2026 / 12:11 PM IST

బడే హజరత్ తిరణాలకు పోటేత్తిన ముస్లిం సోదరులు

NTR: చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో బడే హజరత్ తిరునాళ్లు ఘనంగా జరిగాయి. కంచికచర్ల మండలం పెండ్యాల నుంచి సుమారు 700 జతల ఎడ్లబండ్లతో ముస్లిం కుటుంబాలు దర్గాకు చేరుకుని సంప్రదాయంగా పండుగ జరుపుకున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో నందిగామ రూరల్ సీఐ చవాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి శాంతిభద్రతలు కట్టుదిట్టం చేశారు.

April 29, 2026 / 12:11 PM IST

మంత్రి ఫరూక్‌ను కలిసిన అడ్వకేట్ ప్రసాద్ రెడ్డి

NDL: నంద్యాల మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యునిగా నియమితులైన అడ్వకేట్ ప్రసాద్ రెడ్డి బుధవారం మంత్రి ఎన్ఎండి ఫరూక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఫరూక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధి, న్యాయపరమైన అంశాల్లో తన వంతు సేవలు అందిస్తానని ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి అభినందిస్తూ బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని సూచించారు.

April 29, 2026 / 12:08 PM IST

టీడీపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న వైకుంఠం జ్యోతి

KRNL: టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇవాళ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి సహా పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా నాయకులు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తూ, ఐక్యతతో ముందుకు సాగాలన్నారు.

April 29, 2026 / 12:08 PM IST

TDP రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే

VSP: TDP రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. మంగళగిరిలోనే పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆయన చే ప్రమాణస్వీకారం చేయించారు. పార్టీకి విధేయుడుగా ఉంటానని, క్రమశిక్షణ అంటేనే TDP అని పల్లా ఈ సందర్భంగా అన్నారు.

April 29, 2026 / 12:00 PM IST

‘పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి’

ప్రకాశం: కంభం పట్టణంలో బుధవారం నిర్వహించిన స్వచ్ఛరథం కార్యక్రమంలో ఎంపీడీవో వీరభద్రాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు.

April 29, 2026 / 11:44 AM IST

చదువే విదార్థులకు పెద్ద ఆస్తి: కలెక్టర్

VZM: బొబ్బిలి మండలం పారాది గ్రామంలో బీసీ బాలుర వసతి గృహాన్ని, ఎమ్మెల్యే బేబీ నాయనతో కలిసి జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. విద్యార్థులకు తల్లితండ్రులు ఇచ్చే గొప్ప ఆస్తి చదువేనని కలెక్టర్ ఉద్ఘాటించారు. ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకుండా చూడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

April 29, 2026 / 11:41 AM IST

విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యచారం

పల్నాడు (D) రెంటచింతల మండలానికి చెందిన ఓ వివాహితపై విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీవనోపాధి కోసం విశాఖలో ఉంటున్న మహిళ, తన భర్తతో కలిసి ఈ నెల 26న విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో నడికుడికి బయలుదేరింది. జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న ఆమెను ఓ వ్యక్తి AC బోగీలోకి తీసుకెళ్లి అత్యచారం చేసినట్లు సమాచారం.

April 29, 2026 / 11:34 AM IST

ప్రతిష్ఠా మహోత్సవాల్లో పాల్గొన్న తలారి రంగయ్య

ATP: పామిడిలో పాండురంగస్వామి మహాకుంభ సంప్రోక్షణ, హింగుళాంబిక మాత ప్రతిష్ఠా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ తలారి రంగయ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆయనకు సాదర స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేసింది. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల గ్రామాల్లో భక్తిభావం, ఐక్యత పెంపొందుతాయని రంగయ్య పేర్కొన్నారు.

April 29, 2026 / 11:30 AM IST

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం

ELR: TDP రాష్ట్ర అధికార ప్రతినిధిగా దాసరి శ్యాంచంద్ర శేషు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన శేషు క్రమంగా తన కృషి, పట్టుదలతో ఎదుగుతూ పార్టీలో కీలక స్థాయికి చేరుకున్నారు.పేద కుటుంబం నుంచి వచ్చి ఈరోజు రాష్ట్ర స్థాయి పదవిని అందుకోవడం ఆనందంగా ఉందని ఆయన అభిమానులు పేర్కొన్నారు.

April 29, 2026 / 11:28 AM IST

అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

PPM: గుమ్మలక్ష్మీపురం మండలంలోని బధ్రగిరి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సీడీపీవో విజయగౌరీ వివరాల ప్రకారం, మొత్తం 36 ఖాళీలకు మే 14 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన గిరిజన వివాహిత మహిళలు అర్హులు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎంపికలు చేపడతారు.

April 29, 2026 / 11:26 AM IST

‘స్వచ్ఛ రథం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ELR: గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమాన్ని ఫాతిమాపురం గ్రామంలో బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత, మహిళా సంఘాల సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

April 29, 2026 / 11:24 AM IST

రేపు ఉచిత ఖత్నా శిబిరం

అన్నమయ్య: పీలేరులో అక్సా మసీదులో గురువారం ఉదయం 6 గంటల నుంచి ఉచిత ఖత్నా శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పిల్లలకు మందులు, పౌష్టిక ఆహారం ఉచితంగా అందజేస్తారు. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో శిబిరం నిర్వహించబడుతుందని తెలిపారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

April 29, 2026 / 11:19 AM IST

‘హత్యకు గురైన విలేకరి కుటుంబాన్ని ఆదుకోవాలి’

NDL: వి.కోటలో ABN ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్యపై బుధవారం జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. బాధిత కుటుంబానికి పరిహారం, ఒకరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

April 29, 2026 / 11:14 AM IST

సీతారామపురంలో రొయ్యలు సీడ్ వ్యాన్ బోల్తా

W.G: నరసాపురం మండలం సీతారాంపురంలో బుధవారం తెల్లవారుజామున రొయ్యల సీడ్ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. కాకినాడ నుంచి మొగల్తూరు వెళ్తున్న వ్యాన్.. సీతారాంపురం శివారులో రోడ్డు పక్కకు దూసుకెళ్లి పల్టీ కొట్టిందని గ్రామస్థులు తెలిపారు. ఈ ప్రమాదంలో లక్షలాది రూపాయల విలువైన రొయ్యల పిల్లలు నేలపాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

April 29, 2026 / 11:10 AM IST