• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ధర్నా

KDP: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో స్కాలర్‌షిప్ బకాయిలపై ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం విద్యార్థులు ధర్నాకు దిగారు. పెండింగ్ స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ క్యాంపస్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. విద్యార్థులను శాంతింపజేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. సమస్య పరిష్కారం వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు హెచ్చరించారు.

April 29, 2026 / 08:05 PM IST

‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసానికి వైసీపీనే కారణం’

సత్యసాయి: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసానికి వైసీపీనే కారణమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజు, నేతలు పరిటాల శ్రీరామ్, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ధ్వజమెత్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయింది జగన్ హయాంలోనేనని, 102 ప్రాజెక్టులను ఆపిన చరిత్ర ఆ పార్టీదేనని విమర్శించారు. గత ఐదేళ్లలో ఒక్క ఎకరాకు అదనంగా నీరు ఇవ్వలేదని మండిపడ్డారు.

April 29, 2026 / 08:00 PM IST

‘క్రికెట్ బెట్టింగుల వల్ల యువత జీవితాలు నాశనం’

VZM: జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘బెట్టింగు మాయాజాలం’ షార్ట్ ఫిల్మ్ పోస్టర్లను ఎస్పీ దామోదర్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. క్రికెట్ బెట్టింగుల వల్ల యువత జీవితాలు నాశనం అవుతున్నాయన్నారు. బెట్టింగు యాప్‌ల వలన డబ్బులు నష్టపోవడం, చదువులు దెబ్బతినడం జరుగుతుందని పేర్కొంటూ యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

April 29, 2026 / 08:00 PM IST

భారీగా గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్

 AKP: నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో కేడీపేట ఎస్సై రిషికేశ్వరరావు సిబ్బందితో కలిసి ఇవాళ తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో కాకినాడకు చెందిన ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో గంజాయి విక్రయానికి పాల్పడుతున్నారనీ, ఏజెన్సీలో కొనుగోలు చేసి తరలిస్తుండగా పట్టుబడినట్లు సీఐ తెలిపారు. 50 కిలోల గంజాయి, కారు, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు.

April 29, 2026 / 08:00 PM IST

దంపతుల ఆత్మహత్య.. అనాథగా పసికందు

BPT: వేటపాలెంలో దంపతులు ఆత్మహత్య ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రభాకర్, పార్వతి దంపతులు ప్రాణాలు తీసుకునే ముందు తమ 13 నెలల పసికందును పక్కింట్లో వదిలారు. ఈ నెల 5వ తేదీన ఆ పాప పుట్టినరోజు జరిపారు. తల్లిదండ్రులు ఇక లేరన్న ఊసు తెలియక నిద్రపోతున్న ఆ చిన్నారిని చూసి స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

April 29, 2026 / 07:54 PM IST

రోడ్డు ప్రమాదంపై కేంద్రమంత్రి దిగ్భ్రాంతి

SKLM: విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందడం దురదృష్టకరమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

April 29, 2026 / 07:51 PM IST

‘జర్నలిస్టుపై దాడి నిందితులను కఠినంగా శిక్షించాలి’

E.G: చిత్తూరు జిల్లా వి.కోటలోని ఆంధ్రజ్యోతి విలేకరి ఘోర హత్యను గోపాలపురం ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు తీవ్రంగా ఖండించారు. దేవరపల్లి ఎమ్మార్వో శ్రీనివాస్‌కు బుధవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని అతి దారుణంగా నరికి చంపిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

April 29, 2026 / 07:50 PM IST

తేనేటి విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

ELR: ధర్మాజీగూడెం స్థానిక నాయకులతో కలిసి ఇవాళ చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ రోడ్డు ప్రక్కన గల ఓ చిన్నపాటి హోటల్లో తేనేటి విందులో పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఎస్సీ కాలనీకి వెళ్లి రక్షిత నీటి పథకాన్ని పరిశీలించారు. గ్రామంలో పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాన్ని ఏర్పాటు చేయడానికి స్థానిక నాయకులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు.

April 29, 2026 / 07:50 PM IST

విషాదం.. ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

ATP: తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి కాలనీలో విషాదం నెలకొంది. గంగ పావని అనే వివాహిత తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

April 29, 2026 / 07:50 PM IST

మంటల్లో వృద్ధురాలు సజీవదహనం

PLD: ఎడ్లపాడు మండలం తిమ్మాపురంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. పావులూరి పిచ్చమ్మ(70) తన పొలంలో మొక్కజొన్న వ్యర్థాలు తగలబెడుతుండగా గాలికి మంటలు వేగంగా వ్యాపించాయి. వాటిని ఆర్పే ప్రయత్నంలో ఆమె చీరకు నిప్పు అంటుకుని మంటలు దేహానికి వ్యాపించడంతో వృద్ధురాలు అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 29, 2026 / 07:50 PM IST

‘ఆరోగ్యవంతమైన పంటలు పండించాలి’

W.G: భూమిని సంరక్షించుకోవడం, భావితరాలకు ఆరోగ్యవంతమైన నేలను అందించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని ఆర్డివో దాసిరాజు పేర్కొన్నారు. ఇవాళ నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ధాత్రి మాత బచావో నిగ్రణి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసిరాజు మాట్లాడుతూ.. విషతుల్యం కాని ఆరోగ్యవంతమైన పంటలను పండించి ప్రజారోగ్యానికి రైతులందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

April 29, 2026 / 07:50 PM IST

‘భూగర్భ జలాలతో సాగునీటి సౌకర్యం మెరుగౌతుంది’

TPT: రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ దొడ్లమిట్ట గ్రామంలో జలధార-జలహారతి కార్యక్రమం కింద నీటి సంరక్షణ కుంటల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా రూ.2.27 కోట్లతో 30 పనులు గుర్తించగా, కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ 15 పనులకు అనుమతులు మంజూరు చేశారు. ఈ పనుల వల్ల భూగర్భ జలాలు పెరిగి, రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగవుతోంది.

April 29, 2026 / 07:50 PM IST

అమర్‌కు మూర్తి యాదవ్ సవాల్

VSP: వైసీపీ హయాంలో, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ మాజీ మంత్రి అమర్‌కు సవాల్ విసిరారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు సహా పలు అంశాల్లో వైసీపీ విఫలమైందని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగవంతం చేస్తోందని తెలిపారు.

April 29, 2026 / 07:34 PM IST

గోదావరిలో మట్టి తవ్వకాలను అడ్డుకున్న నర్సరీ రైతులు

E.G: కడియం మండలం కడియపులంక సమీపంలో గోదావరి నదిలో మట్టి తవ్వకాలను బుధవారం నర్సరీ రైతులు అడ్డుకున్నారు. మిషన్లు, లారీలు సిద్ధంగా ఉండగా రైతులు అన్నందేవుల దినేష్, ఆరేటి వెంకటరావు, గాధా గోవిందరాజు తదితరులు స్థలానికి చేరుకుని తవ్వకాలు నిలిపివేయించారు. కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు గోదావరిలో మట్టి తవ్వకాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

April 29, 2026 / 07:30 PM IST

బీసీ కార్పొరేషన్ ఈడీగా సుబ్రమణ్యం బాధ్యతలు స్వీకరణ

ATP: అనంతపురం బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా డి. సుబ్రమణ్యం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని ఈడీ కార్యాలయంలో ప్రస్తుత ఈడీ రామసుబ్బారెడ్డి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది కొత్త ఈడీకి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

April 29, 2026 / 07:30 PM IST