• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపు జిల్లాలో ఉద్యోగ మేళా

కడప నగరంలోని కోటిరెడ్డి SKR ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సలీంబాషా తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల్లో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న, పూర్తిచేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

April 29, 2026 / 07:13 AM IST

ఘనంగా అన్నమయ్య ఉత్సవాలు

అన్నమయ్య: తాళ్లపాక అన్న మాచార్యుల జయంతి ఉత్సవాలను మే 2 నుంచి 8వ తేదీ వరకు తితిదే ఆధ్వర్యంలో తాళ్లపాక, బోయనపల్లి అన్నమయ్య విగ్రహం వద్ద నిర్వహిస్తున్నట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ బాలాజీ మంగళవారం తెలిపారు. మే 2న అన్నమాచార్య ప్రాజెక్ట్‌కు కళాకారులచే సప్తగిరి సంకీర్తన గోస్టి గానం, శ్రీవారి కల్యాణం, ఊంజల్ సేవ, సంగీత కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు.

April 29, 2026 / 07:12 AM IST

మామిడి రైతుపై యుద్ధ ప్రభావం

CTR: యుద్ధంతో చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో సుమారు రూ. 1.50 లక్షల ఎకరాల్లో మామిడి సాగులో ఉంది. ఏటా రూ. 2.50 లక్షల మెట్రిక్ టన్నుల గుజ్జును పల్ప్ ఫ్యాక్టరీలు తయారు చేస్తాయి. దీంట్లో అధిక శాతం గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. యుద్ధంతో తాత్కాలికంగా ఆగిన ఆర్డర్లు రాకపోవడంతో ఫ్యాక్టరీలో యజమానులు అయోమయంలో ఉన్నారు.

April 29, 2026 / 07:12 AM IST

నేడు కీలక బాధ్యతలు చేపట్టనున్న మంత్రి

NDL: టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా బుధవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆయన మరో కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. నిన్నటితో సింగపూర్ పర్యటన ముగించుకుని మంత్రి బీసీ రాష్ట్రానికి చేరుకున్న విషయం తెలిసిందే.

April 29, 2026 / 07:12 AM IST

దేశంలో పెట్టుబడులు ఏపీకే వస్తున్నాయి: మంత్రి

KRNL: దేశానికి వచ్చే పెట్టుబడుల్లో సుమారు 25 శాతం ఏపీకే వస్తున్నాయని మంగళవారం మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ‘బస్సు వరల్డ్ ఇండియా కాంక్లేవ్-2026’ లో ఆయన ప్రసంగించారు. CM చంద్రబాబుపై ఉన్న నమ్మకమే ఈ పెట్టుబడులకు కారణమని పేర్కొన్నారు. ఏపీ ఈవీ పాలసీ 4.0 పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తోందని, అభివృద్ధిలో రాష్ట్ర దూసుకుపోతుందన్నారు.

April 29, 2026 / 07:11 AM IST

కత్తితో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

అన్నమయ్య: దెందులూరు మండలం సానిగూడెం అడ్డురోడ్డు వద్ద జరిగిన కత్తి దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై ఆర్. శ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. గాలాయగూడెంకు చెందిన హర్షవర్ధన్ సోషల్ మీడియాలో పెట్టిన అనుచిత పోస్టుల విషయమై తరుణ్ ప్రశ్నించగా, అతనిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హర్షవర్ధన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

April 29, 2026 / 07:10 AM IST

ఇంధన సరఫరాపై కలెక్టర్లతో సీఎం సమీక్ష

WG: రాష్ట్రంలో ఇంధన పరిస్థితులపై సీఎం చంద్రబాబు మంగళవారం రాత్రి కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో క్యూలైన్లు తగ్గి, పరిస్థితి అదుపులోకి వచ్చిందని కలెక్టర్ నాగరాణి సీఎంతో పేర్కొన్నారు. డీజిల్ వినియోగంపై నియంత్రణ ఉండాలని ముఖ్యమంత్రి సూచించినట్లు ఆమె తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సరఫరాను పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.

April 29, 2026 / 07:09 AM IST

‘పెట్రోలు బంకులను రెవెన్యూ అధికారులు పర్యవేక్షించాలి’

VZM: జిల్లాలో కొనసాగుతున్న కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రైల్వే లైన్లు, జాతీయ రహదారుల భూసేకరణ పురోగతిపై జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మంగళవారం సంబంధత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజిల్ అంశం సద్దుమణిగే వరకు రెవెన్యూ అధికారులు బంకుల వద్ద పర్యవేక్షించాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జే.సీ పాల్గొన్నారు.

April 29, 2026 / 07:02 AM IST

‘ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి’

ATP: ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. బుక్కరాయసముద్రం మండలం రోటరీపురంలో గ్రామ కమిటీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కమిటీ సభ్యుల ఐడీ కార్డుల వెరిఫికేషన్‌పై చర్చించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు.

April 29, 2026 / 07:00 AM IST

లే అవుట్ల పరిశీలన.. ఇళ్ల నిర్మాణానికి ప్రోత్సాహం

BPT: సంతమాగులూరు మండలంలోని పాత మాగులూరులో హౌసింగ్ పీడీ శ్రీనివాస్ ప్రసాద్ లే అవుట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడిన ఆయన, కేటాయించిన లే అవుట్లలో త్వరగా ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు.

April 29, 2026 / 06:57 AM IST

కనిగిరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా ఆరిఫ్ ఖాన్

ప్రకాశం: కనిగిరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా ఆరిఫ్ ఖాన్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అటవీ సంపదను పరిరక్షించడం అత్యంత ముఖ్యమని, అటవీ ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలను అరికట్టడంలో అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలన్నారు.

April 29, 2026 / 06:48 AM IST

చిప్పగిరిలో నమోదైన అత్యధికంగా ఉష్ణోగ్రత

KRNL: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. జిల్లాలోని 27 మండలాల్లో మంగళవారం 16 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా చిప్పగిరి మండలంలో 42.2 డిగ్రీలు, దేవనకొండ మండలంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

April 29, 2026 / 06:40 AM IST

రోడ్డు ప్రమాద బాధితులకు ‘పీఎం రాహత్’ వరం

ATP: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. ఎస్పీ జగదీష్‌తో కలిసి నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పీఎం రాహత్’ పథకం ద్వారా ప్రమాదాల్లో గాయపడిన వారికి రూ.1.5 లక్షల వరకు చికిత్స అందుతుందని, దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కోరుతూ గోడపత్రికలను ఆవిష్కరించారు.

April 29, 2026 / 06:40 AM IST

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2026కు జీవీఎంసీ సిద్ధం

VSP: జీవీఎంసీ స్వచ్ఛ సర్వేక్షణ్‌-2026 పోటికి సన్నద్ధమవుతోంది. ఈసారి దేశవ్యాప్తంగా సుమారు 4,600 నగరాలు పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. పారిశుధ్య నిర్వహణతో పాటు ప్రజాభిప్రాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో త్వరలో కేంద్ర బృందం నగరాన్ని సందర్శించే అవకాశం ఉంది. ఇంటింటి చెత్త సేకరణ, తడి-పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పిస్తున్నారు.

April 29, 2026 / 06:40 AM IST

మే 1 న జిల్లాకు డెడికేటెడ్ కమిషన్: కలెక్టర్

SKLM: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ ఖరారుకు సంబంధించి ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ మే 1 న జిల్లాలో పర్యటించ నుందని కలెక్టర్ స్పప్నిల్ దినకర్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం ఉ.10.30 గంటల నుంచి మ. 1 గంట వరకు కుల సంఘాలు, ప్రజాప్రతినిధులు నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారని తెలిపారు.

April 29, 2026 / 06:36 AM IST