• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

డీజిల్ కొరతతో కదలని యంత్రాలు.!

KDP: ఖాజీపేటలో డీజిల్ కొరత తీవ్ర సమస్యగా మారింది. దీంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలో పలు గ్రామాలలో రబీ కింద వరి పంటలు సాగు చేశారు. ప్రస్తుతం పంట కోతకొచ్చింది. డీజిల్ కొరత వల్ల వరి కోత యంత్రాలు ముందుకు కదలలేకున్నాయి. డీజిల్ సమస్య కారణంగా యంత్రాలకు పని లేకుండా పోయిందని వాహనదారులు వాపోతున్నారు.

April 29, 2026 / 10:12 AM IST

పెట్రోల్ బంకులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. గత ఐదు రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద డీజిల్, పెట్రోల్ దొరకక ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పట్టణంలో ఉన్న పెట్రోల్ బంకులను పరిశీలించారు. డీజిల్ సమస్యలపై మాజీ ఎమ్మెల్యే పెట్రోల్ బంక్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

April 29, 2026 / 10:11 AM IST

నాతవరంలో స్వచ్ఛపదం కార్యక్రమం

AKP: నాతవరంలో బుధవారం స్వచ్ఛపదం కార్యక్రమం నిర్వహించారు. నాతవరం నుంచి ఏకే అగ్రహారం వరకు సుమారు 2.5 కి.మీ రహదారి ఇరువైపులా శుభ్రపరిచారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎంపీడీఓ ఎం.ఎస్. శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ కే.మూర్తిబాబు, పంచాయతీ కార్యదర్శి బి.చంద్రశేఖర్, మాజీ ఎంపీపీలు కొండబాబు, విజయ్ కుమార్ పాల్గొన్నారు.

April 29, 2026 / 10:10 AM IST

“పరీక్ష ఫలితాలపై టెన్షన్ వద్దు”

ASR: జిల్లాలో పదో తరగతి ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 264పాఠశాలలకు చెందిన 11,988మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల వేళ విద్యార్థులు ఆందోళన చెందవ ద్దని, మార్కులు తక్కువ వచ్చినా లేదా ఫెయిల్ అయినా అది జీవితానికి ముగింపు కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఓటమిని విజయానికి తొలిమెట్టుగా భావించి ధైర్యంగా ముందుకు సాగాలన్నారు.

April 29, 2026 / 10:02 AM IST

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రూ. 10 వేల జరిమానా

ATP: తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి కోర్టు భారీ జరిమానా విధించింది. నంద్యాల జిల్లాకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ నరిగ నగేష్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, మెజిస్ట్రేట్ ప్రభావతి రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

April 29, 2026 / 10:00 AM IST

ధర్మవరంలో రథోత్సవంలో మంత్రి

SS: ధర్మవరం పట్టణంలోని మడుగు తేరు వద్ద నిర్వహించిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి రథోత్సవం భక్తుల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో కలిసి రథోత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

April 29, 2026 / 10:00 AM IST

దోమల నివారణకు చర్యలు

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని 6వ వార్డులో వార్డు కౌన్సిలర్ రహమత్ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని చైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి, కమిషనర్ చిన బాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన అధికారులు దోమల నివారణకు చర్యలు చేపడుతూ స్ప్రే చేశారు. ఖాళీ ప్రదేశాల్లో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు.

April 29, 2026 / 10:00 AM IST

అధిక కొనుగోళ్లే కృత్రిమ కొరతకు కారణం: ఎంపీ

KKD: జిల్లాలో ఇంధన కొరత లేదని, ప్రజల ఆందోళన వల్ల ఏర్పడిన అధిక కొనుగోళ్లే కృత్రిమ కొరతకు కారణమని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పెట్రోల్ బంకులను పరిశీలించిన ఆయన, రోజువారీ వినియోగం కంటే రెట్టింపు స్థాయిలో కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. గల్ఫ్ యుద్ధ ప్రభావం ఉన్నా, ప్రధాని మోదీ చొరవతో ఇంధన దిగుమతులకు ఆటంకం లేదని పేర్కొన్నారు.

April 29, 2026 / 10:00 AM IST

దర్శిలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు

ప్రకాశం: దర్శి పట్టణంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సీఐ రామారావు ఆధ్వర్యంలో జిల్లా నుంచి వచ్చిన ప్రత్యేక బృందం, డాగ్ స్క్వాడ్తో కలిసి బస్టాండ్, ఫుడ్ కోర్టులు, బేకరీలలో సోదాలు నిర్వహించారు. మాదకద్రవ్యాల నిర్మూలన, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా ఈ తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

April 29, 2026 / 09:59 AM IST

32 కిలోల గంజాయి స్వాధీనం.. సీలేరు ఎస్సై

ASR: జీకేవీధి మండలం ఐస్ గెడ్డ సమీప చిత్రకొండ జంక్షన్ వద్ద 32 కిలోల గంజాయి పట్టుబడిందని సీలేరు ఎస్సై ఎండీ యాసిన్ తెలిపారు. ముందస్తు సమాచారంతో తమ సిబ్బందితో కలిసి మంగళవారం సాయంత్రం వాహన తనిఖీలు చేస్తుండగా కారులో తరలిస్తున్న గంజాయి పట్టుబడిందని చెప్పారు. గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు.

April 29, 2026 / 09:48 AM IST

వరి కోత యంత్రానికి ఎకరాకు ఎంతో తెలుసా..?

పశ్చిమ గోదావరి జిల్లాలో సార్వ మాసూళ్లు లో వరి కోత యంత్రానికి ఎకరాకు 3 వేలు గా వ్యవసాయ శాఖ ఆమోదం తెలిపిందని జిల్లా ADA శ్రీనివాస రావు ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. వీటిని సిబ్బంది సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసి రైతాంగానికి తెలియజేయాలన్నారు. వాతావరణ అననుకూల పరిస్థితుల ప్రభావం వల్ల రైతుల వద్ద అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు.

April 29, 2026 / 09:43 AM IST

కొల్లేరులో సందడి చేసిన విజిలింగ్ డక్స్

ELR: దెందులూరు(m) కొవ్వలి పెద్దచెరువులో పెద్దచెరువులో చాలా కాలం తర్వాత విజిలింగ్ డక్స్ కనిపించాయి. పక్షులు రాకతో కొవ్వలి పెద్ద చెరువు మళ్లీ జీవంతో కళకళలాడూతూ.. కనిపిస్తుందని స్థానికులు తెలిపారు. ఈ పక్షి పూర్తిగా శాకాహారి అని కొల్లేరులోనే సంతానోత్పత్తి చేసుకుని సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటాయని అన్నారు. పక్షులు రావడంతో పర్యాటకులు పెరిగే అవకాశం ఉందన్నారు.

April 29, 2026 / 09:40 AM IST

డీఎస్పీకి గ్రామ సమస్యలు విన్నపం

NDL: ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసులు ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టారు. సిరివెళ్ల మండలం రాజానగరం గ్రామస్తులు ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసులను తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామస్తులు గ్రామంలో ఉన్న సమస్యలను వారు డీఎస్పీకి వివరించారు. అనంతరం DSP శ్రీనివాసులును గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.

April 29, 2026 / 09:37 AM IST

బొమ్మూరులో శుభ్రత కార్యక్రమం

E.G: బొమ్మూరు గ్రామంలో JLB నగర్, నేతాజీ నగర్ ప్రాంతాల్లో డ్రైన్లు, రోడ్లను బుధవారం శుభ్రం చేశారు. కార్యక్రమంలో కార్మికులతో కలిసి స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాయుడు సునీల్, మెట్ల వెర్రియ్య, కొయ్యలమూడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మత్సేటి శివసత్య ప్రసాద్ నేతృత్వం వహించారు.

April 29, 2026 / 09:33 AM IST

అంబులెన్స్‌లోనే ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం

NLR: ఇందుకూరుపేట మండలం ముదివర్తి పాలెం అంబులెన్స్‌లో ఓ గర్భిణీ పండింటి బిడ్డకు జన్మనిచ్చింది. ఎస్టీ కాలనీకి చెందిన రుతు (20) ఆసుపత్రికి తరలిస్తుండడంతో మార్గమధ్యంలో నొప్పులు అధికం కావడంతో అంబులెన్స్‌లోనే డెలివరీ చేయడంతో మగ బిడ్డకు జన్మించింది. దీంతో అంబులెన్స్‌లోనే డెలివరీ చేసిన ఎం.టీ పీ. అంకయ్య, కే. శ్రీనివాసులు‌ను స్థానికులు అభినందించారు.

April 29, 2026 / 09:30 AM IST