• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రహదారి నిబంధనలు పాటించాలి: సీఐ

ASR: వాహనదారులు రహదారి నిబంధనలు పాటించాలని కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు సూచించారు. ఆదివారం రాజేంద్రపాలెం వారపు సంతను ఎస్సై పీ.కిషోర్ వర్మతో కలిసి సందర్శించారు. వారపు సంతకు వచ్చిన ప్రజలతో సమావేశమయ్యారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ లేక పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.

May 31, 2026 / 02:24 PM IST

అమ్మవారిని దర్శించుకున్న హోం మంత్రి

VSP: కొత్త జాలారిపేటలోని శ్రీ గంగా సమేత వైశాఖేశ్వర ఆలయంలో రాష్ట్ర హోం మంత్రి అనిత‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న మంత్రి గంగమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆలయానికి వచ్చిన మంత్రికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆమె భక్తులతో కొంతసేపు ముచ్చటించారు.

May 31, 2026 / 02:22 PM IST

దివ్యాంగులు సంతకాల సేకరణ కార్యక్రమం

AKP: తిరుమలలో దివ్యాంగులకు ఆఫ్‌లైన్ దర్శన సౌకర్యం కల్పించాలని కోరుతూ శ్రీరామ దివ్యాంగుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. జూలై 7 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 10 వేల సంతకాలు సేకరించనున్నట్లు సంఘం అధ్యక్షుడు కసిరెడ్డి అర్జున్ తెలిపారు. ప్రతి జిల్లాలో కూడా ఈ సంతకాల ఉద్యమం జరుగుతుందని తెలిపారు.

May 31, 2026 / 02:20 PM IST

‘ధరల పెరుగుదలపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు’

GNTR:  నిత్యవసర వస్తువులు, ఇంధన ధరల పెంపునకు నిరసనగా ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు సీపీఎం నాయకులు కె బాబు ప్రసాద్, ములకా శివ సాంబిరెడ్డి, షేక్ హుస్సేన్ వలి, సీపీఐ నాయకులు బొల్లిముంత కృష్ణ తెలిపారు. తెనాలి గాంధీనగర్‌లోని సీపీఐ కార్యాలయంలో వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించారు. జూన్ 5న తెనాలి ప్రజా సంఘాల కార్యాలయంలో సదస్సు నిర్వహిస్తున్నామని, దానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు.

May 31, 2026 / 02:20 PM IST

రైతులకు రాయితీపై వేరుశనగ విత్తన కాయలు పంపిణీ

ATP: యాడికి మండల రైతులకు 40 శాతం రాయితీపై నాణ్యమైన వేరుశెనగ విత్తనాలను అందుబాటులో ఉన్నట్లు మండల వ్యవసాయాధికారి మహబూబా బాషా తెలిపారు. వ్యవసాయ శాఖ ద్వారా కే6 రకం 800 క్వింటాళ్లు, టీసీజీఎస్ 1694 రకం 200 క్వింటాళ్ల కేటాయించినట్లు పేర్కొన్నారు. క్వింటా విత్తన ధర రూ.10,200 కాగా.. రాయితీ పోనూ రైతులు రూ.6,120 చెల్లించి పొందవచ్చన్నారు.

May 31, 2026 / 02:09 PM IST

పదవీ విరమణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SS: నల్లచెరువు మండలం ఉబిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు డేరంగుల నారాయణ పదవీ విరమణ మహోత్సవంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. నారాయణ తన శేష జీవితంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

May 31, 2026 / 02:00 PM IST

కోడూరు పాతపాలెంలో అగ్నిప్రమాదం.. బూడిదైన గడ్డివాము

NLR: తోటపల్లిగూడూరు మండలం కోడూరు పాతపాలెంలో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ పాడి రైతుకు చెందిన గడ్డివాముకు మంటలు అంటుకొని పూర్తిగా కాలి బూడిదైంది. పశువుల మేత కోసం ఎంతో కష్టపడి నిల్వ చేసుకున్న గడ్డివాము కళ్లముందే దగ్ధం కావడంతో సదరు రైతు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.

May 31, 2026 / 02:00 PM IST

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

ATP: పెద్దవడుగూరు మండలం చిట్టూరు గ్రామ సమీపంలోని పెన్నానది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై ఆంజనేయులు మాట్లాడుతూ… ఎలాంటి అనుమతి లేకుండా ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో తమ సిబ్బందితో కలిసి దాడులు చేశామన్నారు. ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి డ్రైవర్లపై కేసు నమోదు చేశామన్నారు.

May 31, 2026 / 01:40 PM IST

‘రేపు యథావిధిగా PGRS, రెవెన్యూ కార్యక్రమాలు’

తూ.గో జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న PGRS, భూ సంబంధిత ఫిర్యాదుల పరిష్కార వేదిక జూన్ 1వ తేదీన సోమవారం జిల్లా వ్యాప్తంగా యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

May 31, 2026 / 01:40 PM IST

కాళ్లకూరు వెంకన్న స్వామి ఆలయంకు విరాళం

W.G: కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు విరాళం అందించినట్లు దేవస్థానం ఛైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈవో మోకా అరుణ్ కుమార్ ఆదివారం తెలిపారు. ఆకివీడు మండలం ఐ.భీమవరం గ్రామానికి చెందిన కీ.శే. వేగేశ్న అప్పలరాజు జ్ఞాపకార్ధం భార్య నాగమణి, కుమారులు బాపిరాజు, గోపాలకృష్ణంరాజు, ప్రసాదరాజు రూ.3 లక్షలు అందించారని ఈవో తెలిపారు.

May 31, 2026 / 01:26 PM IST

ఇంధన ధరలను తగ్గించాలని నిరసనలు

ELR: కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ జూన్ 1 నుంచి 8 వరకు ఏలూరు జిల్లాలో వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఏలూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, కేజీ బేసిన్ గ్యాస్‌లో 50 శాతం రాష్ట్రానికి కేటాయించాలన్నారు.

May 31, 2026 / 01:25 PM IST

భక్తులతో కళకళలాడిన దుర్గమ్మ ఆలయం

కడప శ్రీ విజయదుర్గమ్మ ఆలయంలో పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు, నవకలశ స్నపనం, చండీహోమం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 108 దీపాలతో దీపాలంకార సేవ, రాత్రి అమ్మవారి పల్లకీ సేవ వైభవంగా జరిగాయి. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

May 31, 2026 / 01:20 PM IST

అనంతపురంలో గడ్డి మందుపై నిషేధం

ATP: ప్రజారోగ్యం, రైతుల భద్రత దృష్ట్యా పారాక్వాట్ డైక్లోరైడ్ 24% ఎస్ఎల్ అనే గడ్డి మందును 60 రోజులు నిషేధించినట్లు ఏడీఏ వెంకటరమణ తెలిపారు. జిల్లాలోని పలు దుకాణాలను తనిఖీ చేసి 7,694 లీటర్ల నిషేధిత మందును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మందు నిల్వ ఉంచినా, అమ్మినా, వినియోగించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

May 31, 2026 / 01:20 PM IST

రహదారి విస్తరణ పనుల టెండర్లకు ఆహ్వానం

NTR: NH-65 జాతీయ రహదారి నుంచి ఈడుపుగల్లు మెయిన్ రోడ్(పంటకాల్వ రహదారి) విస్తరణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రూ. 5 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టేందుకై ఆసక్తి కల గుత్తేదారుల నుంచి APCRDA తాజాగా టెండర్లు ఆహ్వానించింది. గుత్తేదారులు పనుల వివరాలకై వెబ్‌సైట్‌లో చూడాలని, టెండర్ దాఖలుకు జూన్ 6 ఆఖరు తేదీ అని CRDA కమిషనర్ వి. విజయ తెలిపారు.

May 31, 2026 / 01:19 PM IST

గాజువాక బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి

అన్నమయ్య: విశాఖపట్నం గాజువాకలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద స్థలాన్ని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ప్రమాద కారణాలపై అధికారులతో ఆరా తీసిన మంత్రి సమగ్ర విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎమ్మెల్యే శ్రీనివాసరావు,RTC జోన్-1 ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

May 31, 2026 / 01:17 PM IST