అనకాపల్లి: గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పరవాడ సీఐ మల్లికార్జునరావు అన్నారు. శుక్రవారం రాత్రి పరవాడ మండలం తిక్కవానిపాలెం గ్రామంలో వందరోజుల యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడితే జీవితం అంధకారం అవుతుందన్నారు. గంజాయి గురించి సమాచారం తెలిస్తే వెంటనే సమీపంలో పోలీస్ స్టేషన్‌కు తెలియ చేయాలన్నారు.
NDL: డోన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ భారతి రాంగ్రూట్లో వెళ్లడంతో మల్యాలకు చెందిన గొర్ల సుంకన్న మృతి చెందినట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్.రంగనాయుడు ఆరోపించారు. శుక్రవారం మాల్యాలో సుంకన్న పార్థివదేహానికి ఆయన నివాళులర్పించారు. ఈ నెల 24న జరిగిన ప్రమాదంలో గాయపడిన సుంకన్న కర్నూలు GGHలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో చికెన్ వర్గాల రవాణా విచ్చలవిడిగా సాగుతుంది. దీంతో సీఐ శ్రీనివాసరావు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కంటైనర్లు చికెన్ వ్యర్ధాలను తరలిస్తున్న వివాహనాన్ని ఎస్సై సంతోష్ రెడ్డితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు. ఆక్వా సాగుకు చికెన్ వ్యర్ధాలను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
W.G: మైసూరు దత్త పీఠాధిపతి అవధూత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 84వ జన్మదినోత్సవం సందర్భంగా ఆకివీడు దత్తక్షేత్రంలో శుక్రవారం హెల్మెట్ల పంపిణీ చేపట్టారు. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొని ఆకివీడు సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు, హోంగార్డులకు హెల్మెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ కాళీచరణ్, ఎస్సై నాగరాజు పాల్గొన్నారు.
E.G: దళిత క్రైస్తవుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ గడువును మరో 6నెలలు పెంచాలని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. శుక్రవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సమాజంలో వెనుకబడిన దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై పునరాలోచన చేయాలన్నారు.
కర్నూలు ఉమ్మడి జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. నేటి నుంచి జూన్ 3 వరకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. రైతు సోదరులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
SS: మడకశిర క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. నియోజకవర్గ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, మహిళలు, విద్యార్థులు, సామాన్య ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించి, సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వీటి సత్వర పరిష్కారం కోసం తక్షణమే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
GNTR:మహిళా సాధికారతలో ఎప్పుడూ టీడీపీదే ముందంజ అని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి అన్నారు. మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామని లోకేశ్ ప్రకటించడంతో శుక్రవారం శ్రీనివాసరావుపేటలోని ఆమె కార్యాలయంలో సంబరాలు చేశారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలే తమ బ్రాండ్ అంబాసిడర్లని, ప్రతి ఇంటికీ అభివృద్ధిని చేర్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
అన్నమయ్య: రాజంపేట నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలిపారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి స్వయంగా వినతులను స్వీకరించారు. భూ సమస్యలు, పెన్షన్లు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు.
NLR జిల్లాలో ఇటీవల భారీ గాలులు వీస్తుండడంతో మామిడి, అరటి, నిమ్మ, ఆరంజ్, తమలపాకుల తోటలు 169.16 హెక్టర్లల్లో దెబ్బతిన్నాయి. 118 మంది రైతులు నష్ట పోయారు. దీంతో అధికారులు పంట నష్ట వివరాల ప్రాథమిక అంచనాలు రూపొందించి GOVTకు నివేదికలు పంపినట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి సుబ్బారెడ్డి తెలిపారు.
KKD: రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)గా డాక్టర్ ఏ. విష్ణువర్ధన్ శుక్రవారం విజయవాడలో బాధ్యతలు చేపట్టారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ఆయనను ప్రభుత్వం పదోన్నతిపై డీఎంఈగా నియమించింది. పలువురు వైద్యులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన వైద్య విద్యారంగంలో సేవలు మరింత మెరుగుపరుస్తారన్నారు.
ATP: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. ఒకటి రెండు చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 37.2 నుంచి 37.5 డిగ్రీలుగా నమోదు కానున్నాయి.
ASR: హుకుంపేట మండలం భీమవరం పంచాయతీ గంగరాజుపుట్టు గ్రామంలో విద్యుత్ లైన్ ఎర్త్ కావడంతో మూడు గొర్రెలు షాక్‌కు గురై మృతి చెందాయి. మృతిచెందిన గొర్రెలు జన్ని రమేష్‌కు చెందినవిగా స్థానికులు తెలిపారు. గ్రామంలోని విద్యుత్ లైన్లు ప్రమాదకరంగా ఉన్నాయని, మరమ్మతులు చేయాలని పలుమార్లు కోరినా అధికారులు స్పందించలేదని గ్రామస్థులు ఆరోపించారు.
KDP: సింహాద్రిపురం(M) బిదినంచర్ల గ్రామంలో 110 ఏళ్ల తర్వాత శ్రీయేనే మీద గంగమ్మ తల్లి దేవరను నిర్వహించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ దేవర కార్యక్రమం నేటి నుంచి రెండు రోజులపాటు జరుగుతుంది. శనివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆదివారం దేవర కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
BPT: చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో సాగుతున్న కోడిపందేల స్థావరంపై పోలీసులు శుక్రవారం మెరుపు దాడి చేశారు. ఎస్సై కందుల కృష్ణ తిరుపతిరావు తన సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ దాడుల్లో పందేలు కాస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.3,250 నగదుతో పాటు రెండు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు.