KRNL: మెగా డీఎస్సీపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలు రాజకీయ ప్రేరేపితమైనవని టీడీపీ నాయకులు క్రిష్ణమ్మ విమర్శించారు. వైసీపీ పాలనలో మెగా డీఎస్సీ నిర్వహించకుండా నిరుద్యోగ యువతను మోసం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం డీఎస్సీ నిర్వహిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉందన్నారు. అసత్య ప్రచారాలు మానుకుని ప్రజలకు వాస్తవాలు చెప్పాలని సూచించారు.
GNTR: సీఆర్డీఏ 61వ సమావేశంలో 18 కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. హైకోర్టు వసతుల కోసం రూ.547 కోట్లు కేటాయించగా, జెయింట్ అబ్జర్వేషన్ వీల్, ఏలూరు-ప్రకాశం ఎకనామిక్ రీజియన్, సిటీ గ్యాస్ నెట్‌వర్క్, ప్రత్యేక ఫైర్ వింగ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే నిర్మాణ వివాదాల ట్రిబ్యునల్ ఏర్పాటుతో పాటు 495 మంది రైతులకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు కల్పించారు.
NTR: విజయవాడలో సోమవారం జరగనున్న “పెద్ది” సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎసీపీ దామోదర్ తెలిపారు. ఈ మేరకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం మధ్యాహ్నం మాచవరం సీఐ వెంకటరమణతో కలిసి పరిశీలించారు. 11 వందల మందితో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతుందన్నారు.
TPT: నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచింది. బీకాం పూర్తిచేసిన కె.వి హరిప్రియ ఏపీ పీజీ సెట్ ఫలితాల్లో కామర్స్ విభాగంలో 7వ ర్యాంక్ సాధించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిని వాణిజ్య విభాగ అధిపతి డాక్టర్ భాస్కర్, ఇతర అధ్యాపకులు అభినందించారు.
ASR: డుంబ్రిగుడ మండలం కొర్ర పంచాయతీ పరిధి చంపవలస గ్రామంలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని గిరిజనులు కోరుతున్నారు. వైసీపీ నేత చిరంజీవి ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. జల్ జీవన్ మిషన్ పథకం కింద నిర్మించాల్సిన మంచినీటి ట్యాంకు, సోలార్ ఆధారిత నీటి సరఫరా పనులు పూర్తికాకుండానే గుత్తేదారు, అధికారులు బిల్లులు డ్రా చేసుకున్నారని ఆరోపించారు.
SKLM: మెలియాపుట్టి మండల కేంద్రంలో రెండు రోజులుగా కొళాయిల్లో నీరు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సూచనతో టీడీపీ నేత ఎరుసు శ్రీనివాసరెడ్డి సొంత నిధులతో 5000 లీటర్ల ట్యాంకర్‌తో ఇంటింటికీ మంచినీరు అందిస్తున్నారు. ప్రజలు సహకరిస్తే ట్రస్ట్ ద్వారా మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని ఆయన తెలిపారు.
AKP: రాంబిల్లి మండలం ధార భోగాపురం వద్ద రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీటిని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆదివారం పరిశీలించారు. జేసీబీతో శుభ్రం చేయించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామస్తులతో ఆయన మాట్లాడుతూ.. గ్రామాన్ని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పారిశుద్యం క్షీణిస్తే లేనిపోని రోగాలు వ్యాప్తి చెందుతాయి అన్నారు.
PPM: SVD నిర్వహించిన రాష్ట్రస్థాయి పీజీ సెట్ ఫలితాల్లో స్థానిక శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పలువురు మంచిర్యాంకులు సాధించడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ డా.చింతల చలపతిరావు హర్షం వ్యక్తం చేశారు. కళాశాలలో ఫిజిక్స్ విభాగానికి చెందిన జీవన్ కుమార్ 45వ ర్యాంకు, రోహిత్ 180వ ర్యాంకు, ఉపేంద్ర 304 నరేష్ 505 ర్యాంక్ సాధించారని తెలిపారు.
VZM: పోలీసు శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన నలుగురు పోలీసు సిబ్బందికి ఎస్పీ దామోదర్ ఆదివారం ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. పోలీసు కంట్రోల్ రూం ఏఎస్సై మీసాల గోపీకృష్ణ, ARSI బొత్స అప్పారావు, హెడ్ కానిస్టేబుల్ నల్ల శ్రీనివాసరావు, కానిస్టేబుల్ సయ్యద్ సలీంను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
CTR: సదుం మండలంలోని జాండ్రపేట రామలింగ చౌడేశ్వరీదేవి ఆలయంలో ఆదివారం పుష్కర మహా కుంభాభిషేక వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు రఘునాథశర్మ ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం, విశేషాలంకరణ, ప్రసన్నపూజ, జ్యోతి దర్శనం కార్యక్రమాలు జరిగాయి. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
ATP: అనంతపురం టౌన్ హెచ్ఎల్సీ కాలనీలోని YCP జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమంలో ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రేటర్ రాయలసీమ అధికార ప్రతినిధిగా నియమితులైన తన మిత్రుడు రమణకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
అన్నమయ్య: జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, పాత నేరస్థులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లలో వారి కదలికలు, ప్రవర్తనపై ఆరా తీశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.
PLD: చిలకలూరిపేటలో ఆదివారం సూర్యవంశం వాడియారాజుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. సేవా సమితి అధ్యక్షుడు కందుల చంద్రశేఖర్ ఈ సదస్సులో మాట్లాడారు. వాడియారాజులు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం సాధించేలా ఐక్యంగా ఎదగాలన్నారు. తమకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.
SKLM: పొందూరు మండలం బాణం పంచాయతీలోని తానెం గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఒక సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామస్తులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వైద్య సలహాలు అందించారు. రక్తపోటు, మధుమేహం, తదితర వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
PPM: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల వివరాలు మీ కోసం వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని కలెక్టర్ చెప్పారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని అన్నారు.