• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అర్హులకే సబ్ ప్లాన్ నిధులు: కలెక్టర్

BPT: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు అర్హులకే అందాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం జేసీ భావన వశిష్టతో కలిసి వివిధ శాఖలతో ఆయన సమీక్ష నిర్వహించారు. నిధుల మళ్లింపు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, పనుల నాణ్యతపై ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్ సూచించారు.

April 29, 2026 / 05:42 PM IST

పార్టీ బలోపేతంపై హోం మంత్రి దిశానిర్దేశం

GNTR: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై స్పందించే తీరు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాలపై మార్గనిర్దేశం చేశారు.

April 29, 2026 / 05:40 PM IST

సింగిల్ విండో ద్వారా అనుమతులు: కలెక్టర్

ATP: జిల్లాలో పరిశ్రమల స్థాపన, నిర్వహణ అనుమతుల ప్రక్రియను ప్రభుత్వం సరళీకరించిందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఆన్‌లైన్ సింగిల్ విండో ద్వారా అనుమతులు జారీ చేస్తామన్నారు. పారిశ్రామికవేత్తలు దరఖాస్తు సమయంలోనే ఫీజులు చెల్లించి, పూర్తి పత్రాలు సమర్పించాలని సూచించారు. నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

April 29, 2026 / 05:40 PM IST

AIMSRలో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ కార్యక్రమం

CTR: చిత్తూరు AIMSRలో ‘ఎఫెక్టివ్ ఫీడ్‌బ్యాక్ డెలివరీ’పై ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీన్ డా. అల్ఫ్రెడ్ జె. అగస్టీన్ మాట్లాడుతూ.. బోధన అనేది విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలను పెంపొందించేలా ఉండాలని సూచించారు. ఆధునిక బోధన పద్ధతుల ద్వారానే విద్యార్థుల అభ్యాస సామర్థ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. 

April 29, 2026 / 05:35 PM IST

100 అడుగుల దూరంలోనే మరో అగ్ని ప్రమాదం

NLR: బుచ్చి పట్టణంలోని లైలా హాల్ ఎదురుగా మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఐదు ఎకరాల్లో సాగు చేస్తున్న జామాయిల్ అగ్నికి ఆహుతి అయింది. ఎవరో ఆకతాయిలో ఈ పని చేస్తుంటారని యాజమాన్యం అన్వేష్ కుమార్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమారు పది లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని వాపోతున్నారు.

April 29, 2026 / 05:30 PM IST

రాజంపేట సమీపంలో గాలి బీభత్సం

KDP: రాజంపేట సమీపంలోని మోడల్ స్కూల్ నుంచి పుల్లంపేట వరకు గాలి బీభత్సం కారణంగా భారీ వృక్షాలు, షెడ్లు నేలకొరిగాయి. రహదారులపై అడ్డంకులు ఏర్పడి వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిపై అధికారులు వెంటనే స్పందించి రోడ్లను క్లియర్ చేసి, ట్రాఫిక్‌ను సాధారణ స్థితికి తీసుకురావాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

April 29, 2026 / 05:26 PM IST

విశాఖ ఘటనపై మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ ఆగ్రహం

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మహిళపై జరిగిన అమానుష ఘటనపై మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ శైలజ రాయపాటి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలితో వీడియో కాల్ ద్వారా మాట్లాడి పరామర్శించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుని, బాధితురాలికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవసరమని ఆమె పేర్కొన్నారు.

April 29, 2026 / 05:25 PM IST

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీసీ ఇందిరమ్మ

NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. పెండేకంటి నగర్ కాలనీకి చెందిన బొమ్మిరెడ్డి బాలిరెడ్డి ఆహ్వానం మేరకు వారి కుమారుని వివాహ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

April 29, 2026 / 05:22 PM IST

‘లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి’

కృష్ణా: నందివాడ మండలం తమిరిశ గ్రామాన్ని డిప్యూటీ ఎంపీడీవో సుబ్రహ్మణ్యం బుధవారం సందర్శించి, యూఎఫ్‌ఎస్ మిస్సింగ్, ఎంఎం సర్వే పనులను పరిశీలించారు. ప్రతి అధికారి గ్రామంలో జరుగుతున్న సర్వే ప్రక్రియను సమీక్షించి, యూఎఫ్‌ఎస్ మిస్సింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు.

April 29, 2026 / 05:20 PM IST

లోకేష్‌కు అభినందనలు తెలిపిన కనిగిరి ఎమ్మెల్యే

ప్రకాశం: టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నూతన కార్యవర్గంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్‌కు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.

April 29, 2026 / 05:20 PM IST

శ్రీ పాండురంగ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

ATP: పామిడి పట్టణంలోని శ్రీ లక్ష్మి పాండురంగ స్వామి నూతన దేవాలయం ప్రారంభోత్సవంలో భాగంగా బుధవారం ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు.

April 29, 2026 / 05:20 PM IST

‘ఇంటి బిల్లులను చెల్లించాలి’

PPM: జగనన్న కాలనీల్లో ఇల్లు నిర్మాణం చేస్తున్న పేదలకు ఇల్లు నిర్మాణం బిల్లులను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని గిరిజన సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్లాబులు పూర్తి చేసిన నెలల తరబడి బిల్లులు చెల్లించడం లేదని వివరించారు.

April 29, 2026 / 05:12 PM IST

అమ్మవారి సేవలో బీజేపీ జిల్లా అధ్యక్షులు

SKLM: మెలియాపుట్టి మండలం గొల్ల బంజీరులో నిర్వహించిన శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయ ప్రతిష్ట మహోత్సవం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు బుధవారం బీజేపీ జిల్లా అధ్యక్షులు తేజేశ్వరరావు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేత మంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

April 29, 2026 / 05:11 PM IST

ఉపాధి హామీ బకాయిల విడుదల

అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం వేతన బకాయిలు విడుదల చేసింది. గత డిసెంబర్ నుంచి పెండింగ్‌లో ఉన్న చెల్లింపుల కింద రూ.72.42 కోట్లు మంజూరు చేశారు. ఇందులో అల్లూరికి రూ.52.39 కోట్లు, పోలవరానికి రూ.20.02 కోట్లు కేటాయించారు. ఇవి రెండు మూడు రోజుల్లో కూలీల ఖాతాల్లో జమ కానున్నాయి.

April 29, 2026 / 05:11 PM IST

‘ప్రజలకు ఇబ్బంది లేకుండా సరఫరా చేయండి’

VSP: పెద్దవాల్తేర్ పెట్రోల్ బంక్ను జాయింట్ కలెక్టర్ విద్యా ధరి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యాజమాన్యంతో మాట్లాడి స్టాక్ వివరాలు తెలుసుకున్నారు. వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బంక్లలో పెట్రోల్ అందుబాటులో ఉందన్నారు. వాహనదారులకు ఇబ్బంది లేకుండా పెట్రోల్ సరఫరా చేయాలని బంక్ యాజమాన్యానికి సూచించారు.

April 29, 2026 / 05:10 PM IST