KKD: గండేపల్లి మండలం తాళ్లూరులో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని వైసీపీ గ్రీవెన్స్ సెల్ జాయింట్ సెక్రెటరీ ఒబ్బిడి వీరబాబు ఆవిష్కరించారు. సుమారు 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా సేవలందించిన జగజ్జీవన్ రామ్ వ్యవసాయ, కార్మిక రక్షణ రంగాల్లో కీలక సంస్కరణలు తీసుకొచ్చారని వక్తలు కొనియాడారు.
ATP: జిల్లాలో అక్రిడేషన్ మంజూరులో జరిగిన అవకతవకలపై జిల్లా కలెక్టర్ ఆనంద్‌కు సీనియర్ జర్నలిస్టులు సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీనియర్ జర్నలిస్టులు భాస్కర్ రెడ్డి, రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తినే జీవనాధారం చేసుకొని జీవనం సాగిస్తున్నామన్నారు. జర్నలిజం నమ్ముకున్న తమకు న్యాయం చేయాలన్నారు.
NLR: అల్లూరు మండలంలోని ఇందుపూర్ గ్రామంలో సోమవారం వివిధ పంటల్లో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. పంటలకు అధిక యూరియా వేయకూడదని తెలియజేశారు. మట్టి పరీక్షలు చేసిన తర్వాత, ఫలితాలు ఆధారంగా పంటలకు యూరియా, ఇతర రకాల ఎరువులు వేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఏవో కళారాణి, పీఎసీఎస్ ఛైర్మన్ హరికృష్ణ, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి: పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో సోమవారం రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యంపై తహశీల్దార్లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువు దాటిన అర్జీలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. భూ రీ-సర్వే పనులను వేగవంతం చేసి ఏప్రిల్ 30 నాటికి లక్ష్యాలను చేరాలని సూచించారు.
ప్రకాశం: సింగరాయకొండ మండలానికి చెందిన పోక్సో కేసు నిందితుడు సురేష్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం సెక్షన్ 8 కింద అతడిపై కేసు నమోదైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కేసు తీవ్రతను పరిశీలించిన సింగరాయకొండ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ వివరాలను SI మహేంద్ర మీడియాకు వెళ్లడించారు.
సత్యసాయి: ధర్మవరంలోని ఎన్డీఏ కార్యాలయంలో సోమవారం మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి విగ్రహాన్ని మంత్రి సత్య కుమార్ ఆవిష్కరించి, నివాళులు అర్పించారు. దేశానికి అంకితభావంతో సేవలందించిన మహానేత వాజపేయి ఆశయాలు, నాయకత్వం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ దేశాభివృద్ధికి కృషి చేయడం ఆ మహనీయునికి మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.
ATP: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆరు మండలాల నాయకులతో కలిసి పేరూరు డ్యాంకు వెంటనే నీరు విడుదల చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ మోహన్ రెడ్డి చొరవతో డ్యాంకు నీరు అందించి రైతులకు అండగా నిలిచామని గుర్తుచేశారు.
గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలోని స్పెషల్ బ్రాంచ్ విభాగంలో డీఎస్పీగా అలహరి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎస్పీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ కార్యాలయ సిబ్బంది, ఫీల్డ్ సిబ్బంది కూడా అభినందనలు తెలియజేశారు.
ప్రకాశం: కొమరోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రాస్ రోడ్ వద్ద తాటిచెర్ల మోట నుంచి కొమరోలు వైపు వస్తున్న ఆటో సోమవారం అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న మొరం సుబ్బమ్మ సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. మృతి చెందిన సుబ్బమ్మది మదనపల్లె గ్రామం అని సమాచారం. ఆటోలో ప్రయాణిస్తున్న మరొక ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
PLD: జిల్లాలో ఫైర్ క్రాకర్స్ లైసెన్స్ దారులతో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ సమీక్షా సమావేశం నిర్వహించారు. లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని, లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గడువు ముగిసిన వారు వెంటనే రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. వేసవి కాలంలో షాపులు, క్రాకర్స్ నిల్వలో భద్రతా జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
VZM: పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని KC సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. 25న జరిగే పరీక్షకు జిల్లాలో నుంచి 8,053 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. జిల్లాలో మొత్తం 26 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
కర్నూల్ రేంజ్ DIG కోయ ప్రవీణ్ ఆదేశాల మేరకు జరిగిన బదిలీలలో ఒంటిమిట్ట సీఐగా శ్రీహరి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన కడప నేర విభాగంలో విధులు నిర్వహిస్తూ బదిలీపై ఒంటిమిట్టకు రావడం జరిగింది. ఇక్కడ CIగా పనిచేస్తున్న నరసింహారాజు బదిలీపై కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్‌కి వెళ్లడం జరిగింది.
ELR: నూజివీడు పట్టణ పరిధిలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం పర్యటించనున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయం సోమవారం ప్రకటనలో తెలిపింది. మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం 9 గంటలకు, శ్రీనివాస సెంటర్ వద్ద 10 గంటలకు బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు.
AKP: పంచాయతీ కార్యదర్శులు సంపద కేంద్రాలపై దృష్టి పెట్టాలని పాయకరావుపేట ఎంపీడీవో లవరాజు ఆదేశించారు. ఇవాళ పీఎల్ పురంలో సంపద కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రాలను సక్రమంగా నిర్వహిస్తే పంచాయతీలకు ఆదాయం వస్తుందన్నారు. గ్రామాల నుంచి ప్రతిరోజు సేకరిస్తున్న చెత్తను కేంద్రాలకు తరలించి సేంద్రియ ఎరువుగా మార్చాలన్నారు.
VZM: ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయ గణన విధానంపై జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఇవాళ ఆదేశించారు. ఈ నెల 16 నుంచి 30 వరకు ప్రజలు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన 15 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.