• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గ్రామాల్లో చెత్త నిర్వహణపై బీజేపీ వినతి

TPT: జనతా వారధి కార్యక్రమంలో భాగంగా బీజేపీ నేతలు పీజీఆర్‌ఎస్‌లో జిల్లా డీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు. గ్రామాల్లో తడి & పొడి చెత్తా సేకరణ, కంపోస్ట్ యూనిట్లు సరిగా పనిచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పనిచేయని కంపోస్ట్ యూనిట్ల పునరుద్ధరణ, చెత్త వర్గీకరణ కఠినంగా అమలు, పారిశుధ్య కార్మికుల నియామకం, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

April 20, 2026 / 08:00 PM IST

జనగణన-2027 స్వీయ గణన పూర్తి చేసిన ఎమ్మెల్యే

CTR: జనగణన 2027లో భాగంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్వీయ గణన పూర్తి చేశారు. బీవీ రెడ్డి కాలనీలోని తన నివాసంలో ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా గృహ వివరాలను నమోదు చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా జనగణనలో భాగస్వాములు కావాలని, ఏప్రిల్ 16 నుంచి 30 వరకు స్వీయ నమోదు అవకాశం ఉందని తెలిపారు. మే 1 నుంచి అధికారుల ద్వారా మొదటి దఫా గణన ప్రారంభమవుతుందని చెప్పారు.

April 20, 2026 / 08:00 PM IST

జిల్లాలో దొంగ నోట్ల ముఠా అరెస్టు

కోనసీమ: రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగ నోట్లు ముద్రిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం అమలాపురం SP కార్యాలయంలో SP రాహుల్ మీనా వివరాలు వెల్లడించారు. వేములపల్లి గ్రామంలో మీసాల అప్పలరాజు, బత్తుల శ్రీను, ముబ్బాడి దేవి ప్రసాద్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.500 నకిలీ నోట్లు, ముద్రణ పరికరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

April 20, 2026 / 07:37 PM IST

ఎర్రగొండపాలెంలో బీజేపీ కార్యకర్తల అవగాహన సదస్సు

ప్రకాశం: ఎర్రగొండపాలెం స్థానిక R&B బంగ్లాలో బీజేపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తలకు SIRపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ BLA1 ఆర్‌.ఏ. రమణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి తంగిరాల అశోక్ రెడ్డి దీనికి హాజరయ్యారు. కాగా, NWC మార్కాపురం జిల్లా ఛైర్మన్‌గా నియమితులై తొలిసారి వచ్చిన అశోక్ రెడ్డిని మండల బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించారు.

April 20, 2026 / 07:33 PM IST

ఆత్మకూరులో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

NDL: ఆత్మకూరులో సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. అన్నా క్యాంటీన్ వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పేదలకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 20, 2026 / 07:29 PM IST

నిషేధిత భూముల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ

W.G: నిషేధిత భూముల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ కోసం గ్రామ సభ నిర్వహించినట్లు VRO చిన్నారావు తెలిపారు. ఉండి మండలం మహాదేపట్నం గ్రామంలో సోమవారం గ్రామ సభ జరిగింది. కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయని ఆయన పేర్కొన్నారు. పంచాయితీ సెక్రటరీ, ఆర్ఐ, ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్, SR డిపార్ట్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు.

April 20, 2026 / 07:26 PM IST

కర్నూలు ఎస్పీకి 115 ఫిర్యాదులు

కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సోమవారం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 115 ఫిర్యాదులు స్వీకరించారు. భూ వివాదాలు, మోసాలు, వేధింపులు, రోడ్డు ప్రమాదాలు తదితర సమస్యలపై వినతులు అందాయి. ప్రతి ఫిర్యాదుపై చట్టపరంగా విచారణ చేసి త్వరితగతిన న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.

April 20, 2026 / 07:21 PM IST

ఈనెల 25న కాకినాడలో జాబ్ మేళా

కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 25న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలిపారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్ జిరాక్స్‌లతో ఆరోజు ఉదయం 10:30 గంటలకు హాజరు కావాలన్నారు. వివరాలకు  8639846568 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

April 20, 2026 / 07:20 PM IST

‘అర్జీల విషయంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు’

ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 113 అర్జీలు స్వీకరించబడినట్లు కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి పెట్టి, సమస్యలను నాణ్యంగా, గడువులో పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో ఆలస్యం, నిర్లక్ష్యానికి తావులేకుండా పని చేయాలని హెచ్చరించారు.

April 20, 2026 / 07:20 PM IST

జీవీఎంసీ PGRSకి 55 వినతులు

VSP: జీవీఎంసీలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 55 వినతులు అందాయని అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి తెలిపారు. భీమిలి నుంచి 1, ఈస్ట్ జోన్ 13 సహా అన్ని జోన్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. అధికారులందరూ వెంటనే స్పందించి నిర్ణీత కాలంలో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

April 20, 2026 / 07:19 PM IST

మోపాడు రిజర్వాయర్ ప్రధాన కాలవను ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రకాశం: పామూరు మండలం కంబాలదిన్నె పంచాయితీ గరండల వద్ద మోపాడు రిజర్వాయర్ ప్రధాన కాలువను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌తో కలిసి కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర మాట్లాడుతూ.. మోపాడు రిజర్వాయర్ ద్వారా వందలాది ఎకరాలకు నీళ్లు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

April 20, 2026 / 07:18 PM IST

పీజీఆర్ఎస్‌కి 27 ఫిర్యాదులు

VZM: జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ను నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా 27 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి ఆదేశాలిచ్చారు. వీటిలో 7 భూతగాదాలు, 5 కుటుంబ కలహాలు, 5 మోసాలు మరియు నగదు వ్యవహారాల కేసులు ఉన్నాయి. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.

April 20, 2026 / 07:11 PM IST

ఏపీలో నెంబర్ వన్ స్థానంలో ఉరుకుంద దేవాలయం

KRNL: ఏపీ ప్రభుత్వం నిర్వహించిన పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ సర్వేలో కౌతాళం (మం) ఉరుకుందలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం రాష్ట్రంలో మొదటి స్థానం సాధించింది. దర్శనం, ప్రసాదం, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం అంశాల్లో మెరుగైన సేవలతో వరుసగా మూడోసారి టాప్‌లో నిలిచింది. భక్తులకు ఇంకా మెరుగైన సేవలు అందిస్తామని డిప్యూటీ కమిషనర్ కే.వాణి తెలిపారు.

April 20, 2026 / 07:01 PM IST

గ్రామాల్లో చెత్త నిర్వహణపై కలెక్టర్‌కు వినతి

ATP: గ్రామాల్లో నిర్వీర్యమైన చెత్త నిర్వహణ యూనిట్లు, కంపోస్ట్ షెడ్లను పునరుద్ధరించాలని కోరుతూ జిల్లా BJPఅధ్యక్షుడు రాజేష్ కలెక్టర్‌ ఆనంద్ కు వినతిపత్రం అందజేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు పారిశుద్ధ్య సమస్యలు తన దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. నిర్వహణ లోపం వల్ల షెడ్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

April 20, 2026 / 07:00 PM IST

బుచ్చి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన చిన బాబు

NLR: బుచ్చిరెడ్డిపాలెం నగర కమిషనర్ బాలకృష్ణ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో బుచ్చి నూతన కమిషనర్‌గా ఇనమల చినబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయ సిబ్బందిని పరిచయం చేసుకున్నారు.

April 20, 2026 / 07:00 PM IST