• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అక్రమ ఇంధన నిల్వలపై దాడులు

KRNL: కౌతాళం మండలం ఉరుకుందలో అక్రమంగా నిల్వ ఉంచిన పెట్రోల్, డీజిల్ పైఅధికారులు దాడులు నిర్వహించారు. ఇవాళ తక్కువ ధరకు తెచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారంతో జిల్లా పౌరసరఫరాల అధికారి రాజా రఘువీర్ ఆధ్వర్యంలో రెండు ప్రైవేటు ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో 1060 లీటర్ల డీజిల్, 150 లీటర్ల పెట్రోల్‌తో సహా మొత్తం 1210 లీటర్లు స్వాధీనం చేసుకున్నారు.

May 30, 2026 / 09:43 AM IST

మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి: ఎమ్మెల్యే

W.G: సరిపల్లి పద్మశ్రీ రైస్ మిల్ కాలనీలో స్ట్రీట్ లైట్లు, మంచి నీరు, మౌలిక సదుపాయాల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న MLA బొమ్మిడి నాయకర్, పొత్తూరి రామరాజు శనివారం స్వయంగా కాలనీకి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

May 30, 2026 / 09:40 AM IST

‘మన మిత్ర యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

BPT: ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు మన మిత్ర యాప్‌లను వినియోగించుకోవాలని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు అన్నారు. కొరిసపాడు మండలం పి.గుడిపాడులో శుక్రవారం రాత్రి నిర్వహించిన పల్లెనిద్ర కార్యక్రమంలో స్థానికులకు పలు సూచనలు చేశారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా అమలు చేస్తున్న కౌశలం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

May 30, 2026 / 09:36 AM IST

జిల్లాలో గృహాల సర్వే 102 శాతం పూర్తి

CTR: జిల్లాలో చేపట్టిన జనగణనలో భాగంగా గృహాల సర్వే 102 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 5.92 లక్షల ఇళ్ల సర్వే లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 6.08 లక్షల గృహాలను సర్వే చేశారు. మొత్తం జనాభా 18.91 లక్షలు ఉండగా.. 17.13 లక్షల మంది గణన పూర్తి చేశారు. చిత్తూరు రూరల్ మండలం 113 శాతంతో ప్రథమ స్థానంలో ఉంది.

May 30, 2026 / 09:06 AM IST

ట్రాక్టర్‌ను ఢీకొన్న ఎలక్ట్రికల్ బస్.. తప్పిన ప్రమాదం

NTR: కంచికచర్ల మండలం పరిటాల రాళ్ల క్వారీల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. క్వారీ నుంచి కాంకర లోడుతో బయటకు వస్తున్న ట్రాక్టర్‌ను ఎలక్ట్రిక్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు ట్రాక్టర్ పల్టీ కొట్టగా, బస్సు ముందు భాగం ధ్వంసమైంది. ట్రాక్టర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతడిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

May 30, 2026 / 09:06 AM IST

కొమ్మలపాడులో 15 సీసీ కెమెరాలు

BPT: సంతమాగులూరు మండలం కొమ్మాలపాడులో శుక్రవారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రామస్థుల సహకారంతో మొత్తం 15 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సీఐ శేషగిరిరావు తెలిపారు. దొంగతనాల నివారణ, యాక్సిడెంట్ల గుర్తింపు, తప్పిపోయిన వ్యక్తులను వెతకటానికి వీటిని ఏర్పాటు చేసినట్లు ఎస్సై పట్టాభి రామయ్య తెలిపారు.

May 30, 2026 / 09:04 AM IST

బైక్‌ను ఢీకొన్న కారు.. వ్యక్తికి గాయాలు

PLD: యడ్లపాడు 16వ నంబర్ హైవేపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గొట్టిపాడు నుంచి గణపవరం వెళ్తున్న బైక్‌ను ఓ గుర్తు తెలియని కారు వెనుక నుంచి ఢీకొట్టింది. స్థానిక వైన్స్‌ మార్గం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న గ్రంథి తులసీరామ్‌కు గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత కారు ఆపకుండా వెళ్లిపోగా, బైక్ ధ్వంసమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

May 30, 2026 / 09:00 AM IST

రెండు బైకులు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు

BPT: నూజిలపల్లి – గంగన్నపాలెం గ్రామాల మధ్య శుక్రవారం రాత్రి రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో మారెళ్లకు చెందిన ఆరోన్, అద్దంకికి చెందిన అశోక్, షేక్ హరి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే బాధితులను అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.

May 30, 2026 / 08:55 AM IST

గంజాయి సేవిస్తున్న 6 మంది అరెస్ట్

ELR: ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవిస్తున్న ఆరుగురు యువకులను అరెస్టు చేశామని సీఐ రామకృష్ణ శుక్రవారం తెలిపారు. సమాచారం మేరకు.. తంగేళ్లమూడి బీడీ కాలనీ నోవా కాలేజీ వద్ద గంజాయి సేవిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. కాకినాడ జిల్లా తలుపులమ్మలోవ ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు సమాచారం.

May 30, 2026 / 08:48 AM IST

శ్రీవారి తోమాల సేవలో సామాన్యులకు దర్శనం

TPT: టీటీడీ అధికారులు శుక్రవారం అభిషేక సేవ అనంతరం జరిగే తోమాల సేవ సమయంలోనూ సామాన్య భక్తులకు స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించారు. దాదాపు 1200 మంది భక్తులు తోమాల సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తుండడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి.

May 30, 2026 / 08:45 AM IST

బీఎల్‌వోలకు జీఎంసీ కమిషనర్ హెచ్చరిక

GNTR: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మ్యాపింగ్‌ను సోమవారం కల్లా ప్రతి బీఎల్‌వో 70 శాతం పూర్తి చేయాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు ఉంటాయని జీఎంసీ కమిషనర్ కె. మయూర్ అశోక్ హెచ్చరించారు. శుక్రవారం కౌన్సిల్ హాలులో బీఎల్వోలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు.

May 30, 2026 / 08:43 AM IST

పెద్ద చెరువు వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం

PLD: నరసరావుపేట పెద్ద చెరువు కలెక్టర్ బంగ్లా వద్ద స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ భారత్ “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన పాల్గొన్నారు.పెద్ద చెరువు పరిసరాల్లో శుభ్రత చర్యలు చేపట్టి, కాలువల్లో పేరుకు పోయిన పూడిక తొలగించారు.

May 30, 2026 / 08:40 AM IST

పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. కేసు నమోదు

NTR: అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఓ వ్యక్తి మహిళతో పాటు ఆమె బంధువుల నుంచి రూ.52 లక్షలు వసూలు చేశాడు. ప్రతి లక్షకు నెలకు రూ.20 వేల లాభం ఇస్తానని చెప్పి మొదట కొంత మొత్తంపై లాభాలు చెల్లించి నమ్మకం కల్పించాడు. అనంతరం పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదుతో సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

May 30, 2026 / 08:30 AM IST

జీజీహెచ్‌లో భవనం పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

గుంటూరు: జీజీహెచ్‌లో ఓ వ్యక్తి వార్డు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండికి చెందిన చెన్నంశెట్టి శ్రీనివాస్(50). కిడ్నీ సమస్యతో ఈ నెల 23న ఆయన ఆసుపత్రిలో చేరాడు. కాలకృత్యాలకు వెళ్లి కిటికీలోంచి కిందకు దూకాడు. శ్రీనివాస్‌ వృత్తి రీత్యా తాపీ మేస్త్రీ. ఆయన భార్య మృతి చెందగా, ఇద్దరు కుమారులున్నారు.

May 30, 2026 / 08:26 AM IST

తంటికొండలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం

E.G: గోకవరం మండలం తంటికొండ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిల్లులు పూర్తిగా ధ్వంసం అయినట్లు స్థానికులు తెలిపారు. రెండు కుటుంబాల సభ్యులు కట్టుబట్టలతో మిగిలారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

May 30, 2026 / 08:24 AM IST