కృష్ణా: నందివాడ మండలం తుమ్మలపల్లి గ్రామ సర్పంచ్ సింగలా రాధాకృష్ణ ఐదేళ్ల పదవీకాలం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా, పంచాయతీ కార్యాలయంలో సత్కార కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. పంచాయతీ సెక్రటరీ ‘స్వర్ణ గ్రామ పంచాయితీ సిబ్బంది కలిసి సర్పంచ్ రాధాకృష్ణను శాలువతో సత్కరించారు. గ్రామ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
BPT: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సజ్జాపురానికి చెందిన తేలప్రోలు నాగేశ్వరరావు (62) తన టీవీఎస్ ఎక్సెల్‌పై రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చిన ఒక ట్రాలీ ఆటో ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి.
విశాఖపట్నంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యతతో పాటు గడువులోగా పూర్తి చేయాలని, పదేపదే వచ్చే సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 334 వినతులు నమోదయ్యాయని చెప్పారు.
GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పీకల వాగు కాలువ పూడిక తీత పనులను ఎమ్మెల్యే గళ్ళా మాధవి సోమవారం పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నీటి భద్రత–సాగు నీటి సంఘాల బాధ్యత’ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ పనులు కొనసాగుతున్నాయి.
PLD: నూజెండ్ల మండలం కంభంపాడు గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయ ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ శ్రీ జీవీ ఆంజనేయులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిభావం వల్ల గ్రామంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని, బ్రహ్మంగారి బోధనలు అందరికీ ఆదర్శప్రాయమని జీవితంలో పేర్కొన్నారు.
NTR: నందిగామ పట్టణంలో వేసవి కాలం దృష్ట్యా ప్రతిరోజు తాగునీరు అందించాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు అర్జీ సమర్పించారు. 20 వార్డుల్లో పది రోజులుగా నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఐటీయు కార్యదర్శి కె. గోపాల్ తెలిపారు. అనాసాగరం గ్రామంలోని కొత్త వాటర్ ట్యాంక్‌ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.
W.G: మార్టేరు వరి పరిశోధనా కేంద్రంలో ఈనెల 8న భారీ ‘కిసాన్ మేళా’ నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి(ఏవో) డాక్టరు జ్యోషిలా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని రైతులందరూ పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆమె కోరారు. సాగు పద్ధతులపై అవగాహనతో పాటు, శాస్త్రవేత్తలు రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు నేరుగా అందిస్తారని పేర్కొన్నారు.
SKLM: కాశీబుగ్గ పోస్టాఫీస్‌లో పౌర సేవలకు సోమవారం అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంబాల మార్పిడి పనుల కారణంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. ఖాతాదారులు, పెన్షన్ దారులు అనేక అవస్థలు పడుతున్నారు. పోస్టల్ ఉన్నతాధికారులు స్పందించి కొత్త యూపీఎస్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
అన్నమయ్య: మదనపల్లెలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశమై ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. గతంతో పోలిస్తే విద్యార్థుల సంఖ్య తగ్గిన నేపథ్యంలో నమోదు పెంపుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పాఠశాలల సౌకర్యాలు, విజయగాథలను తల్లిదండ్రులకు తెలియజేయాలని కోరారు. హాస్టల్ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని MLA కోరారు.
CTR: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారిని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం ఆలయ ఏఈవో రవీంద్రబాబు, అర్చకులు, వేదపండితులు, ఇతర ఆలయ సిబ్బంది కూడా హాజరయ్యారు.
ATP: తాడిపత్రిని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని MLA జేసీ అస్మిత్ రెడ్డి CM చంద్రబాబుని కోరారు. యాడికిలో సీఎంను కలిసి ఈ ప్రాంతంలోని చారిత్రక ఆలయాల ప్రాముఖ్యతను వివరించారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నుంచి సహకారం కావాలని విన్నవించారు.
ELR: కొయ్యలగూడెం మండలం, పొంగుటూరులో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “మీ భూమి-మీ హక్కు” కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ రాజముద్రతో రూపొందించిన పట్టాదార్ పాస్ పుస్తకాలను 478 మంది అర్హులైన రైతులకు పంపిణీ చేశారు.
కృష్ణా: గుడ్లవల్లేరు మండలం తాడిచర్ల రోడ్డు శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే రామును కట్టావాని చెరువు ముస్లిం సోదరులు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక ఖబరస్థాన్‌కు (బరియల్ గ్రౌండ్) రక్షణగా ప్రహరీ గోడ నిర్మించాలని అబ్దుల్ కరీం, ఫైజు తదితరులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ.. సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
AKP: సమస్యల పరిష్కారం కోసం ఈనెల 7వ తేదీన కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ రాము తెలిపారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధి నుంచి కార్మికులకు ప్రమాద బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గృహ నిర్మాణ మెటీరియల్ రేట్లను తగ్గించాలన్నారు. రద్దు చేసిన భవన నిర్మాణ కార్మిక చట్టాన్ని పునరుద్ధరించాలన్నారు.
TPT: తిరుపతి ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో సోమవారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బాలింతలకు డ్రై ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ సూపరింటెండెంట్ డా. ప్రమీల దేవి, సివిల్ సర్జన్ డా.రామనారాయణ రెడ్డి పర్యవేక్షణలో సుమారు 190 మంది బాలింతలకు డ్రై ఫ్రూట్స్ అందజేశారు. హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ద్వారా తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.