• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మహిళల భద్రత కోసం ‘ఆపరేషన్ దండాయన’: ఎస్పీ

NDL: జిల్లాలో మహిళల భద్రత కోసం ‘ఆపరేషన్ దండాయన’ కార్యక్రమం ప్రారంభించినట్లు శుక్రవారం ఎస్పీ సునీల్ తెలిపారు. నేరస్థులకు త్వరితగతిన శిక్షలు, 60 రోజుల్లో ఛార్జిషీట్ల దాఖలు, జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు దీనిలో భాగమని వెల్లడించారు. మహిళలపై నేరాలకు జీరో టాలెరెన్స్ పాలసీ తీసుకొస్తామని, స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్‌తో పర్యవేక్షిస్తామన్నారు.

May 30, 2026 / 07:43 AM IST

సబ్‌జూనియర్ ఫుట్‌బాల్ జట్ల ఎంపిక

SS: ఈనెల 31న హిందూపురం ఎంజీఎం క్రీడా మైదానంలో జిల్లా ఫుట్‌బాల్ సబ్‌జూనియర్ జట్ల ఎంపిక జరుగుతుందని జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జేవీ అనిల్‌కుమార్ తెలిపారు. ఈ ఎంపికలకు వచ్చే క్రీడాకారులు తమ అన్ని ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని సూచించారు. ఇతర పూర్తి వివరాల కోసం క్రీడాకారులు 8099598958 నంబరును సంప్రదించాలని కోరారు.

May 30, 2026 / 07:35 AM IST

ఈ రైళ్లు తాత్కాలిక రద్దు

ATP: గుంతకల్లు డివిజన్ పరిధిలో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుంతకల్లు-బోధన్ రైలు ఈ నెల 30, 31 తేదీల్లో రద్దయింది. అలాగే గుంతకల్లు-మార్కాపురం రైలును ఈ నెల 31, జూన్ 1 తేదీల్లో నిలిపివేశారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని కోరారు.

May 30, 2026 / 07:26 AM IST

తీరనున్న వరద కష్టం.. రూ.5 కోట్లతో వంతెన

కోనసీమ: అప్పనపల్లి-పాసర్లపూడి గ్రామాల మధ్య పాటురేవుపై రూ.5 కోట్ల సీఆర్ఎఎఫ్ నిధులతో అధునాతన వంతెన నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. దశాబ్దాల నాటి పాత కాజ్వే పూర్తిగా శిథిలం కావడంతో దాన్ని తొలగించి, 60 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో కొత్త వంతెనను నిర్మిస్తున్నారు. గోదావరి వరదల సమయంలో లంక గ్రామాల ప్రజలకు ముంపు సమస్యలు తలెత్తకుండా ఈ వంతెన ఎంతగానో ఉపయోగపడనుంది.

May 30, 2026 / 07:20 AM IST

ఆటో బోల్తా.. వ్యక్తులకు గాయాలు

అన్నమయ్య: నిమ్మనపల్లె మండలం మర్రిబండ వద్ద శుక్రవారం ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్‌తో పాటు ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వారిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, తీవ్ర గాయాల కారణంగా ఇద్దరిని తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు.

May 30, 2026 / 07:17 AM IST

వైసీపీ కార్యకర్త పాడె మోసిన వరికూటి అశోక్ బాబు

BPT: వేమూరు నియోజకవర్గ వైసీపీ రైతు విభాగం అధ్యక్షుడు గోపాలం రాము అనారోగ్యంతో మృతి చెందడంతో శుక్రవారం ఆయన అంత్యక్రియల్లో నియోజకవర్గ ఇన్‌ఛార్జి వరికూటి అశోక్ బాబు పాల్గొన్నారు. రాము పాడె మోసి తన అభిమానాన్ని చాటుకున్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండే అశోక్ బాబు, సీనియర్ నేత మరణాన్ని జీర్ణించుకోలేకపోయారని పార్టీ శ్రేణులు తెలిపాయి.

May 30, 2026 / 07:16 AM IST

గంజాయి నిర్మూలనే లక్ష్యం

అనకాపల్లి: గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పరవాడ సీఐ మల్లికార్జునరావు అన్నారు. శుక్రవారం రాత్రి పరవాడ మండలం తిక్కవానిపాలెం గ్రామంలో వందరోజుల యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడితే జీవితం అంధకారం అవుతుందన్నారు. గంజాయి గురించి సమాచారం తెలిస్తే వెంటనే సమీపంలో పోలీస్ స్టేషన్‌కు తెలియ చేయాలన్నారు.

May 30, 2026 / 07:14 AM IST

‘ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి’

NDL: డోన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ భారతి రాంగ్‌రూట్‌లో వెళ్లడంతో మల్యాలకు చెందిన గొర్ల సుంకన్న మృతి చెందినట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్.రంగనాయుడు ఆరోపించారు. శుక్రవారం మాల్యాలో సుంకన్న పార్థివదేహానికి ఆయన నివాళులర్పించారు. ఈ నెల 24న జరిగిన ప్రమాదంలో గాయపడిన సుంకన్న కర్నూలు GGHలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 

May 30, 2026 / 07:12 AM IST

రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత నరేందర్ రెడ్డి మృతి

NDL’: ఆళ్లగడ్డ మండలం పేరాయిపల్లి మెట్ట వద్ద ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత నరేందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. జాతీయ రహదారిపై వెళుతున్న నరేందర్ రెడ్డి కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

May 30, 2026 / 07:11 AM IST

తిరుమలలో ASI రాములు సస్పెండ్.!

TPT: తిరుమలలో ఏపీఎస్‌పీఎఫ్  విభాగంలో పని చేస్తోన్న ASI రాములు మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించిన ఘటన నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేశారు. అలిపిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు DSP భక్తవత్సలం తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను నమ్మొద్దని పోలీసులు కోరారు.

May 30, 2026 / 07:10 AM IST

నిరాశాజనకంగా మామిడి ధరలు

CTR: చిత్తూరు మార్కెట్‌లో మామిడి ధరలు రైతులను నిరాశ పరుస్తున్నాయి. తోతాపురి (టేబుల్ రకం) కిలో రూ.14 నుంచి రూ.15 వరకు పలుకుతోంది. పుల్లూరా రూ.8 నుంచి రూ.15, బేనీషా రూ.20 నుంచి రూ.30, కాదర్ రూ.20 నుంచి రూ.30, కాలేపాడు రూ.20 నుంచి రూ.30, ఇమామ్ పసంద్ రూ.40 నుంచి రూ.80 వరకు అమ్ముడుతున్నట్టు వ్యాపారులు తెలిపారు. మంచి ధరల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

May 30, 2026 / 07:09 AM IST

చికెన్ వ్యర్ధాలు తరలిస్తే కఠిన చర్యలు: సీఐ

NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో చికెన్ వర్గాల రవాణా విచ్చలవిడిగా సాగుతుంది. దీంతో సీఐ శ్రీనివాసరావు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కంటైనర్లు చికెన్ వ్యర్ధాలను తరలిస్తున్న వివాహనాన్ని ఎస్సై సంతోష్ రెడ్డితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు. ఆక్వా సాగుకు చికెన్ వ్యర్ధాలను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

May 30, 2026 / 07:06 AM IST

MLA ఈశ్వరరావు నేటి పర్యటన వివరాలు

SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ఇవాళ ఉదయం 7:30కు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎమ్మెల్యే నివాసంలో అల్పాహార కార్యక్రమంలో పాల్గొంటారు. 9 గంటలకు రణస్థలం మండలం జీరుపాలెంలో ఫిష్ సీడ్ రాంచింగ్ ప్రోగ్రాంలో పాల్గొంటారు. ఉ. 10:30కు జి. సిగడాం మండల కేంద్రంలో పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించనున్నారు అని ఎమ్మెల్యే కార్యాలయం శుక్రవారం ప్రకటనలో తెలిపారు.

May 30, 2026 / 07:00 AM IST

ఆకివీడులో పోలీసు సిబ్బందికి హెల్మెట్ల పంపిణీ

W.G: మైసూరు దత్త పీఠాధిపతి అవధూత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 84వ జన్మదినోత్సవం సందర్భంగా ఆకివీడు దత్తక్షేత్రంలో శుక్రవారం హెల్మెట్ల పంపిణీ చేపట్టారు. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొని ఆకివీడు సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు, హోంగార్డులకు హెల్మెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ కాళీచరణ్, ఎస్సై నాగరాజు పాల్గొన్నారు.

May 30, 2026 / 06:57 AM IST

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి: మందకృష్ణ

E.G: దళిత క్రైస్తవుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ గడువును మరో 6నెలలు పెంచాలని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. శుక్రవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సమాజంలో వెనుకబడిన దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై పునరాలోచన చేయాలన్నారు.

May 30, 2026 / 06:48 AM IST