ప్రకాశం: కంభం పట్టణంలో బుధవారం నిర్వహించిన స్వచ్ఛరథం కార్యక్రమంలో ఎంపీడీవో వీరభద్రాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు.
VZM: బొబ్బిలి మండలం పారాది గ్రామంలో బీసీ బాలుర వసతి గృహాన్ని, ఎమ్మెల్యే బేబీ నాయనతో కలిసి జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. విద్యార్థులకు తల్లితండ్రులు ఇచ్చే గొప్ప ఆస్తి చదువేనని కలెక్టర్ ఉద్ఘాటించారు. ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకుండా చూడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
పల్నాడు (D) రెంటచింతల మండలానికి చెందిన ఓ వివాహితపై విశాఖ ఎక్స్ప్రెస్లో అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీవనోపాధి కోసం విశాఖలో ఉంటున్న మహిళ, తన భర్తతో కలిసి ఈ నెల 26న విశాఖ ఎక్స్ప్రెస్లో నడికుడికి బయలుదేరింది. జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న ఆమెను ఓ వ్యక్తి AC బోగీలోకి తీసుకెళ్లి అత్యచారం చేసినట్లు సమాచారం.
ATP: పామిడిలో పాండురంగస్వామి మహాకుంభ సంప్రోక్షణ, హింగుళాంబిక మాత ప్రతిష్ఠా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ తలారి రంగయ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆయనకు సాదర స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేసింది. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల గ్రామాల్లో భక్తిభావం, ఐక్యత పెంపొందుతాయని రంగయ్య పేర్కొన్నారు.
ELR: TDP రాష్ట్ర అధికార ప్రతినిధిగా దాసరి శ్యాంచంద్ర శేషు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన శేషు క్రమంగా తన కృషి, పట్టుదలతో ఎదుగుతూ పార్టీలో కీలక స్థాయికి చేరుకున్నారు.పేద కుటుంబం నుంచి వచ్చి ఈరోజు రాష్ట్ర స్థాయి పదవిని అందుకోవడం ఆనందంగా ఉందని ఆయన అభిమానులు పేర్కొన్నారు.
PPM: గుమ్మలక్ష్మీపురం మండలంలోని బధ్రగిరి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సీడీపీవో విజయగౌరీ వివరాల ప్రకారం, మొత్తం 36 ఖాళీలకు మే 14 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన గిరిజన వివాహిత మహిళలు అర్హులు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎంపికలు చేపడతారు.
ELR: గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమాన్ని ఫాతిమాపురం గ్రామంలో బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత, మహిళా సంఘాల సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
అన్నమయ్య: పీలేరులో అక్సా మసీదులో గురువారం ఉదయం 6 గంటల నుంచి ఉచిత ఖత్నా శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పిల్లలకు మందులు, పౌష్టిక ఆహారం ఉచితంగా అందజేస్తారు. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో శిబిరం నిర్వహించబడుతుందని తెలిపారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
NDL: వి.కోటలో ABN ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్యపై బుధవారం జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. బాధిత కుటుంబానికి పరిహారం, ఒకరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
W.G: నరసాపురం మండలం సీతారాంపురంలో బుధవారం తెల్లవారుజామున రొయ్యల సీడ్ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. కాకినాడ నుంచి మొగల్తూరు వెళ్తున్న వ్యాన్.. సీతారాంపురం శివారులో రోడ్డు పక్కకు దూసుకెళ్లి పల్టీ కొట్టిందని గ్రామస్థులు తెలిపారు. ఈ ప్రమాదంలో లక్షలాది రూపాయల విలువైన రొయ్యల పిల్లలు నేలపాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది
SKLM: కంచిలి (M) కొక్కిలి పుట్టుగలో సుమారు 142 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ కంచిలి మండలం అధ్యక్షులు మాదిన రామారావు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఐటీడీపీ మండల అధ్యక్షులు వి.రమేష్ రెడ్డి ఉన్నారు
VZM: గజపతినగరం, పురిటిపెంట గ్రామాల్లో స్వచ్ఛ పథం కార్యక్రమంలో భాగంగా భారీగా శుభ్రత చర్యలు చేపట్టారు. ఎంపిడివో కల్యాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య సిబ్బంది, ఉపాధి హామీ కార్మికులు పాల్గొని గ్రామాలను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ గోపాల రాజు, ఈఓఆర్డి శంకరరావు, ఈవో ఎం. జగదీశ్ పాల్గొన్నారు.
NDL: పట్టణంలోని 39వ వార్డు భైర్మల్ స్ట్రీట్లో ఇవాళ ఉదయం పాత భవనం మరమ్మతుల సమయంలో స్లాబ్ కూలి ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు కార్మికులు గాయపడగా, ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ సంఘటన స్థలాన్ని సందర్శించి, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
ELR: గ్రంధాలయాలు వేసవిలో విద్యార్థులకు మంచి వినోదాన్ని విజ్ఞానాన్ని అందించే విడిది కేంద్రాలని ఎంఈఓ- 2 రాములు అన్నారు. బుధవారం సాయంత్రం గ్రంథాలయంలో పశ్చిమాసియా యుద్ధాలు, భారతదేశం అనుసరిస్తున్న తీరుపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామన్నారు. వేసవికాలంలో విద్యార్థులు గ్రంథాలయాలను ఉపయోగించుకుని వాటి ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
VSP: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆర్ఎస్డీపీ అప్పల నరసింహరాజు పార్థీవ దేహానికి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బుధవారం ఉదయం పద్మనాభం మండలం పాండ్రంగిలో నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడుతూ నిజాయతీ రాజకీయాలకు ప్రతీకగా నిలిచారని అన్నారు. కుమారుడు పృధ్వీతో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.