VZM: జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘బెట్టింగు మాయాజాలం’ షార్ట్ ఫిల్మ్ పోస్టర్లను ఎస్పీ దామోదర్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. క్రికెట్ బెట్టింగుల వల్ల యువత జీవితాలు నాశనం అవుతున్నాయన్నారు. బెట్టింగు యాప్‌ల వలన డబ్బులు నష్టపోవడం, చదువులు దెబ్బతినడం జరుగుతుందని పేర్కొంటూ యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
AKP: నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో కేడీపేట ఎస్సై రిషికేశ్వరరావు సిబ్బందితో కలిసి ఇవాళ తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో కాకినాడకు చెందిన ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో గంజాయి విక్రయానికి పాల్పడుతున్నారనీ, ఏజెన్సీలో కొనుగోలు చేసి తరలిస్తుండగా పట్టుబడినట్లు సీఐ తెలిపారు. 50 కిలోల గంజాయి, కారు, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు.
BPT: వేటపాలెంలో దంపతులు ఆత్మహత్య ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రభాకర్, పార్వతి దంపతులు ప్రాణాలు తీసుకునే ముందు తమ 13 నెలల పసికందును పక్కింట్లో వదిలారు. ఈ నెల 5వ తేదీన ఆ పాప పుట్టినరోజు జరిపారు. తల్లిదండ్రులు ఇక లేరన్న ఊసు తెలియక నిద్రపోతున్న ఆ చిన్నారిని చూసి స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
SKLM: విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందడం దురదృష్టకరమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
ELR: ధర్మాజీగూడెం స్థానిక నాయకులతో కలిసి ఇవాళ చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ రోడ్డు ప్రక్కన గల ఓ చిన్నపాటి హోటల్లో తేనేటి విందులో పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఎస్సీ కాలనీకి వెళ్లి రక్షిత నీటి పథకాన్ని పరిశీలించారు. గ్రామంలో పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాన్ని ఏర్పాటు చేయడానికి స్థానిక నాయకులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు.
ATP: తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి కాలనీలో విషాదం నెలకొంది. గంగ పావని అనే వివాహిత తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
W.G: భూమిని సంరక్షించుకోవడం, భావితరాలకు ఆరోగ్యవంతమైన నేలను అందించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని ఆర్డివో దాసిరాజు పేర్కొన్నారు. ఇవాళ నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ధాత్రి మాత బచావో నిగ్రణి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసిరాజు మాట్లాడుతూ.. విషతుల్యం కాని ఆరోగ్యవంతమైన పంటలను పండించి ప్రజారోగ్యానికి రైతులందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
TPT: రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ దొడ్లమిట్ట గ్రామంలో జలధార-జలహారతి కార్యక్రమం కింద నీటి సంరక్షణ కుంటల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా రూ.2.27 కోట్లతో 30 పనులు గుర్తించగా, కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ 15 పనులకు అనుమతులు మంజూరు చేశారు. ఈ పనుల వల్ల భూగర్భ జలాలు పెరిగి, రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగవుతోంది.
VSP: వైసీపీ హయాంలో, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ మాజీ మంత్రి అమర్‌కు సవాల్ విసిరారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు సహా పలు అంశాల్లో వైసీపీ విఫలమైందని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగవంతం చేస్తోందని తెలిపారు.
E.G: కడియం మండలం కడియపులంక సమీపంలో గోదావరి నదిలో మట్టి తవ్వకాలను బుధవారం నర్సరీ రైతులు అడ్డుకున్నారు. మిషన్లు, లారీలు సిద్ధంగా ఉండగా రైతులు అన్నందేవుల దినేష్, ఆరేటి వెంకటరావు, గాధా గోవిందరాజు తదితరులు స్థలానికి చేరుకుని తవ్వకాలు నిలిపివేయించారు. కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు గోదావరిలో మట్టి తవ్వకాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
ATP: అనంతపురం బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా డి. సుబ్రమణ్యం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని ఈడీ కార్యాలయంలో ప్రస్తుత ఈడీ రామసుబ్బారెడ్డి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది కొత్త ఈడీకి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
సత్యసాయి: ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాలతో సత్యసాయి జిల్లా వ్యాప్తంగా పోలీసులు విజిబుల్ పోలీసింగ్, వాహనాల తనిఖీలు చేపట్టారు. ప్రధాన కూడళ్లలో హెల్మెట్ లేని ప్రయాణం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలపై నిఘా ఉంచారు. రాత్రి పహారా పెంచి గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నివారణే లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
W.G: వీఆర్వో చిన్న మరణం రెవెన్యూ శాఖకు తీరని లోటని నరసాపురం తహశీల్దార్ ఐవివి సత్యనారాయణ అన్నారు. ఇవాళ తహసీల్దార్ కార్యాలయంలో అనారోగ్యంతో అకాల మరణం చెందిన కటకంశెట్టి సూర్యనారాయణ (చిన్నా)కి రెవెన్యూ సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. సత్యనారాయణ అధ్యక్షతనలో సంతాప సభ నిర్వహించారు.
NDL: బేతంచర్ల నగర పంచాయతీ పరిధిలో పెండింగ్లో ఉన్న ఆస్తి పన్నులపై 50% వడ్డీ మాఫీ రాయితీ గడువు రేపటితో ముగుస్తుందని కమిషనర్ హరి ప్రసాద్ తెలిపారు. ఈనెల 9 నుంచి పొడిగించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 2025-26 సంవత్సరానికి ముందస్తుగా పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు. పన్ను బకాయిలు ఉన్నవారు త్వరగా చెల్లించాలని సూచించారు.
ఏలూరు టూ టౌన్ పరిధిలో జరిగిన బంటు అంజలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పెళ్లి పేరుతో మోసం చేసి, అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే నిందితుడు ఆమెను హత్య చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా రాజమండ్రిలో ఇవాళ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అనుమానస్పద మృతినీ విచారణ అనంతరం హత్య కేసుగా మార్చామన్నారు