అన్నమయ్య: రాయచోటిలో వైసీపీ బీఎల్ఏలకు ఎస్ఐఆర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు అమరనాథరెడ్డి, పార్లమెంట్ పరిశీలకులు సురేష్ బాబు హాజరయ్యారు. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించకుండా ప్రతి ఓటును కాపాడుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు.
GNTR: మంగళగిరిలో AP యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హక్కుల సాధనకై మహా ధర్నాను నిర్వహించారు. కూటమి ప్రభుత్వం యాదవులను నిర్లక్ష్యం చేస్తోందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు మండిపడ్డారు. యాదవ కార్పొరేషన్‌కు రూ.6 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అమరావతిలో యాదవ భవనానికి 10 ఎకరాల స్థలం, రూ.10 కోట్లు ఇవ్వాలన్నారు. జనాభా ప్రకారం చట్టసభల్లో ప్రాధాన్యం కల్పించాలన్నారు
NDL: తల్లికి వందనం పథకం లబ్ధి కోసం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అర్హత కలిగిన ఎస్సీ విద్యార్థులు జూన్ 10లోగా బ్యాంకు ఖాతాలు తెరవాలని డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ బి.రాధిక ఓ ప్రకటనలో తెలిపారు. యూనియన్ బ్యాంకు/పోస్టాఫీసులో విద్యార్థి పేరుతో ఖాతా తెరచి, NPCI లింక్ చేయాలని సూచించారు. ఆధార్‌కు లింక్ అయిన ఫోన్ నంబర్‌తో సచివాలయాలను సంప్రదించాలన్నారు.
W.G: రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు తన స్వగ్రామమైన ఆగర్తిపాలెంలో ఆదివారం వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. పాలకొల్లు నుంచి 7 కి.మీ. సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిన ఆయన, దారిపొడవునా ప్రజలను కలుస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన సొంత రొయ్యల చెరువులో మేత వేసి, ఎదుగుదలను పరిశీలించారు. సొంత పొలంలో కూలీలతో కలిసి ట్రాక్టర్‌పై దుక్కు దున్నారు.
కృష్ణా: విజయవాడ రూరల్ నిడమానూరులో తెలుగు యువత నాయకులు వైసీపీ ఆరోపణలను ఖండించారు. జగన్ హయాంలో నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేసిందన్నారు. మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యారంగంలో సంస్కరణలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
BPL: నాటు సారా, గంజాయి వంటి మత్తు పదార్థాల క్రయవిక్రయాలకు పాల్పడితే తీవ్రమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చీరాల డీఎస్పీ ఎం.డి.మోయిన్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ నేతృత్వంలో చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌నగర్‌లో పోలీసు అధికారులు, సిబ్బంది ఆదివారం ఉదయం నుండి కార్డాన్ సెర్చ్ చేశారు.
PLD: ఒడిశాలో జరిగిన సబ్‌జూనియర్ బేస్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో ఏపీ బాలికల, బాలుర జట్లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఫెడరేషన్ ప్రశంసలు అందుకున్నాయి. ప్రత్యేకంగా బాలికల జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. జట్టులో పిచర్గా ఉన్న పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన క్రీడాకారిణి పమ్మి చంద్రిక 6 మ్యాచ్‌ల్లో 96% స్ట్రైక్ రేట్ నమోదు చేసి విశేష ప్రతిభ కనబరిచింది.
ASR: గూడెంకొత్తవీధి మండలం దారకొండ పంచాయతీ పరిధిలోని చీడిగుంట గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న ఏకైక చేతి పంపు మరమ్మతులకు గురికావడంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కిలోమీటరు దూరంలో ఉన్న ఊట నుంచి నీరు తెచ్చుకుని అవసరాలు తీర్చుకుంటున్నామని పేర్కొన్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
మన్యం జిల్లా పరిపాలనలో సమర్థవంతమైన సేవలు అందించి ఇటీవల ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శాఖకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బదిలీ అయిన జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ మందిరంలో ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి ఉన్నతాధికారులు, రెవెన్యూశాఖ సిబ్బంది పెద్దఎత్తున హాజరై ఆయన సేవలను కొనియాడారు.
VSP: షీలా నగర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు కేవీ వెంకటరమణను రాష్ట్ర హోంమంత్రి అనిత పరామర్శించారు. లంకెలపాలెం వద్ద విధి నిర్వహణలో ఉన్న సమయంలో జరిగిన దాడిలో వెంకటరమణ గాయపడిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
AKP: నర్సీపట్నం మండలం అమలాపురం గ్రామంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు అనిమిరెడ్డి శ్రీను ఆధ్వర్యంలో ఆదివారం బావి శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టారు. బోర్లు ఎండిపోవడంతో నీటి కొరత ఏర్పడటంతో బావిలో పేరుకుపోయిన చెత్త, మురికి, పిచ్చిమొక్కలను తొలగించి వినియోగానికి సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
CTR: పుంగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం 15 కిలోల టమోటా బాక్స్ ధర రూ.400 పలికింది. దిగుబడి పెరగడంతో టమోటా కాయలు మార్కెట్‌కు ఎక్కువ శాతం వస్తున్నాయి. ఇవాళ 835.50 మెట్రిక్ టన్నులు టమాటాలు వచ్చాయి. మొదటి రకం బాక్స్ రూ. 400, రెండవ రకం బాక్స్ రూ. 300 పలకగా.. మూడో రకం బాక్స్ రూ. 180 వరకు పలికాయి.
CTR: మదనపల్లి కలెక్టరేట్ వద్ద రేపు చేపట్టే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని YCP యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మిద్దింటి కిషోర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతూ మోసం చేస్తున్న తీరుపై ఉద్యమిస్తున్నట్లు తెలిపారు. DSC అక్రమాలపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
VZM: గజపతినగరం మండలంలోని డోలపాలెం గ్రామంలో దుర్గాదేవి ఆలయ నిర్మాణానికి టీటీడీ రూ. 20 లక్షల మంజూరు చేసినట్లు ఆ గ్రామ మాజీ సర్పంచ్ శీర అప్పలనాయుడు ఆదివారం తెలిపారు. గుడి నిర్మాణానికి నిధులు కావాలని ఇటీవల రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు తనతో పాటు బీబీ ఛానల్ వైస్ ఛైర్మన్ బొత్స సూర్యనారాయణ, స్థలదాత అప్పలనాయుడు కూటమి నేతలు కోరామన్నారు.
NLR: వెంకటాచలం మండలంలోని తాటిపర్తిపాళెం గ్రామంలో ఆదివారం గ్రామదేవుడు తాటిపర్తయ్య స్వామివారి తిరునాళ్ల సందర్భంగా, గ్రామస్తులు పొలిమేరలోని పొలాల్లో కనకదుర్గమ్మ అమ్మవారికి పొంగళ్ళు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు పంటల సమృద్ధిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు,మహిళలు యువకులు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.