TPT: తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జరిగిన స్మార్ట్ సిటీ కార్పొరేషన్ 43వ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు సహా అన్ని పనులను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ ఎన్. మౌర్య పాల్గొన్నారు.
NDL: ఈ ఏడాదికి సంబంధించి జరిగిన అకాడమిక్ ఆడిట్లో కోవెలకుంట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఏ-గ్రేడ్ పత్రం లభించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ మంగళవారం వెల్లడించారు. ఈ మేరకు డిగ్రీ కళాశాలలో జరిగిన సమావేశానికి అకాడమిక్ అడ్వైజర్లుగా వచ్చిన డాక్టర్ హనుమంత రెడ్డి కాసిం సాహెబ్ కళాశాల అధ్యా పకులను అభినందించి ఏ-గ్రేడ్ పత్రాన్ని అందజేశారు.
ASR: పెదబయలులో జరిగిన టీడీపీ కేడర్ సమావేశంలో అరకు నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ సియ్యారి దొన్ను దొర పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తలు నిరంతరం ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
GNTR: అమరావతిలో ఎకో టూరిజంపై ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారథి ప్రపంచ బ్యాంకు బృందానికి వివరించారు. మంగళవారం వీరు రాజధానిలో పర్యటించారు. గ్రావిటీ కెనాల్ వద్ద ఎకో టూరిజం పనులను పరిశీలించారు. అనంతవరం నర్సరీలో వృక్షాల సంరక్షణను బృందం అభినందించింది. నీరుకొండలో 0.4 టీఎంసీలతో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనుల వివరాలను సీఎండీ వారికి తెలియజేశారు.
PLD: యడ్లపాడు మండలం చీఘిస్ ఖాన్‌పేట్‌లో ప్రకృతి వ్యవసాయంపై మంగళవారం అవగాహన సదస్సు జరిగింది. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ అమల కుమారి రైతులకు పీఎండీఎస్ కిట్ల వాడకంపై వివరించారు. తొలకరి కంటే ముందే 30 రకాల విత్తనాల కిట్‌ను చల్లడం వల్ల నేలలో తేమ నిలిచి పంటలు ఎండను తట్టుకుంటాయన్నారు. దీనివల్ల సేంద్రియ కర్బనం, దిగుబడి పెరుగుతుందన్నారు.
ప్రకాశం: మార్కాపురం జిల్లాలో భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదేశించారు. “జల ధార-నీటి భద్రత” కార్యక్రమంలో భాగంగా 100 రోజుల ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ముందుగా 10 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి, తదుపరి 80 రోజుల్లో చెరువుల పూడిక తీయడం, భూగర్భ జలాల పెంపు చర్యలు చేపట్టాలని తెలిపారు.
NTR: నీటి నిల్వలతోనే సంపద సృష్టి సాధ్యం అని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. మైలవరం మండలం చంద్రాల గ్రామంలో “నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంగళవారం పాల్గొన్నారు. నీటి భద్రత కార్యక్రమ ప్రచార పత్రాలు ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన యాప్‌ను అందరూ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
KRNL: ఎమ్మిగనూరు మండలం బనవాసి సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద పెండేకల్ నుంచి ఎమ్మిగనూరు వైపు మొక్కజొన్న లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వాహనంలో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మొక్కజొన్న సంచులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.
TPT: తిరుపతిలో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 43వ బోర్డు సమావేశంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నగర అభివృద్ధికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులను సమయానికి పూర్తి చేయాలన్నారు.
PLD: తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే జగన్ ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై దాడులు చేయిస్తున్నారని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సొంత నేతలే తనను వ్యతిరేకిస్తున్నారన్న అక్కసుతో దాడులకు పురిగొల్పుతున్నారన్నారు. పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవడం ఎవరితరం కాదన్నారు.
ప్రకాశం: మార్కాపురం మండలంలోని బోడపాడు గ్రామంలో పేకాట శిబిరంపై దాడి చేశారు. ఈ దాడిలో 14 మందిని తీసుకొని వారి వద్ద నుండి రూ.55,860 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌కి అప్పగించారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి శిక్ష తప్పదని అన్నారు.
GNTR: తెనాలి మున్సిపల్ కమిషనర్ రామా అప్పలనాయుడు వార్డుల్లో కల్వర్టులు, అభివృద్ధి పనులను పరిశీలించి ఇంజనీరింగ్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అన్నా క్యాంటీన్‌ను సందర్శించి ఆహార నాణ్యతను తనిఖీ చేశారు. 7వ వార్డులో హోమ్ కంపోస్ట్ విధానంపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈ ఆంజనేయరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ELR: కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు A- గ్రేడ్ లభించిందని ఇంఛార్జి ప్రిన్సిపాల్ మల్లేశ్వరరావు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం 2025-26 సంబంధించి కళాశాలలో సౌకర్యాలను అన్ని విభాగాల రికార్డులను అకడమిక్ ఆడిట్ నిర్వహించడం జరిగింది. నారాయణపురం డిగ్రీ కళాశాలకు చెందిన తెలుగు అధ్యాపకులు కొండా రవి, తణుకు డిగ్రీ కళాశాలకు చెందిన జువాలజీ అధ్యాపకులు చెప్పారు.
కోనసీమ: అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం పాలక మండలి డైరెక్టర్‌గా మండపేట మండలం ద్వారపూడికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు యరగతపు బాబ్జి నియమితులయ్యారు. ఆయన టీడీపీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
NTR: ఏపీ CRDA కమిషనర్ విజయ రామరాజును జగ్గయ్యపేట ఎమ్మెల్యే రాజగోపాల్ (తాతయ్య) మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా CRDA పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా జగ్గయ్యపేట పరిధిలోని బలుసుపాడు రోడ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే, కమిషనర్‌ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు.