అన్నమయ్య: జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, పాత నేరస్థులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లలో వారి కదలికలు, ప్రవర్తనపై ఆరా తీశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.
PLD: చిలకలూరిపేటలో ఆదివారం సూర్యవంశం వాడియారాజుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. సేవా సమితి అధ్యక్షుడు కందుల చంద్రశేఖర్ ఈ సదస్సులో మాట్లాడారు. వాడియారాజులు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం సాధించేలా ఐక్యంగా ఎదగాలన్నారు. తమకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.
SKLM: పొందూరు మండలం బాణం పంచాయతీలోని తానెం గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఒక సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామస్తులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వైద్య సలహాలు అందించారు. రక్తపోటు, మధుమేహం, తదితర వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
PPM: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల వివరాలు మీ కోసం వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని కలెక్టర్ చెప్పారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని అన్నారు.
అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని ప్రతిభా జూనియర్ కళాశాలలో నిర్వహించిన మానవత సంస్థ నెలవారీ సమావేశంలో విశ్రాంత ఉపాధ్యాయులు ఒంటేరు రెడ్డన్న, అంకం శంకర్ రెడ్డి పాల్గొని సంస్థ సేవలను ప్రశంసించారు. నిస్వార్థ సేవలతో పాటు పర్యావరణ పరిరక్షణ, విద్యార్థుల్లో నైతిక విలువల పెంపుకు మానవత సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
NDL: డోన్ పట్టణంలో కార్మిక హక్కుల, సామాజిక న్యాయం, సమానత్వం కోసం పుట్టిందే ఎర్రజెండా అని సీఐటీయూ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు మాణిక్యం, శివరాం, నాగమద్దయ్య, రామాంజనేయులు, నక్కి శ్రీకాంత్ అన్నారు. కార్మిక హక్కులు కాలరాసే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కార్మికులను సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కాంటాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
VSP: కూర్మన్నపాలెం జంక్షన్లో ఆదివారం రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఏడుగురికి గాయాలైన విషయం విధితమే. ఈ ప్రమాదం గురించి మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయని అన్నారు. 200 ఈవీ బస్సులను త్వరలో తీసుకువస్తున్నామని దీంతో ఓవర్‌లోడ్ తగ్గిస్తామన్నారు.
KDP: బద్వేలు నియోజకవర్గం టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకాల బాధ్యతలను పార్టీ అధిష్టానం కడప జిల్లా డీసీసీ బ్యాంకు ఛైర్మన్ మంచూరు సూర్యనారాయణరెడ్డికి అప్పగించింది. ఈ సందర్భంగా రాష్ట్ర నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కొలవలి వేణుగోపాల్, టీడీపీ నాయకులు గోవిందాయపల్లె కిష్టయ్య, బద్వేల్ వెంకటసుబ్బయ్య ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
KRNL: జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు స్వీకరిస్తామని కలెక్టర్ డా.ఏ.సిరి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా, ఆన్‌లైన్‌లో meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చని కలెక్టర్ సూచించారు.
SKLM: ఉత్తరాంధ్ర చిరకాల స్వప్నం నెరవేరింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపటి నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ‘డబుల్ ఇంజన్ సర్కార్’ కృషితోనే ఇది సాధ్యమైందని, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు చొరవతోనే జోన్ వచ్చిందన్నారు. దీనివల్ల రైల్వే అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
CTR: ఐరాల మండలం గుండ్లపల్లి ఎస్టీ కాలనీలో ఎస్సై జయశ్రీ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. గన్ పౌడర్‌తో పాటు పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
TPT: తిరుపతి జిల్లా వ్యాప్తంగా జూన్ 1 నుంచి 30 వరకు పోలీస్ సెక్షన్-30 యాక్ట్‌ను విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తిరుమల, తిరుపతి ప్రాంతాలకు భక్తులు భారీగా వస్తున్నందున శాంతిభద్రతల పరిరక్షణ, అవాంఛనీయ ఘటనల నివారణకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కాలంలో ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు లేదా సమావేశాలు నిర్వహించాలంటే ముందస్తుగా పోలీసుల అనుమతి తప్పనిసరి అని తెలిపారు.
VZM: వంగర మండలంలో జూన్ నెలకు సంబంధించి NTR భరోసా ఫించన్ల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు MPDO టి.రాజారావు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..19 గ్రామ సచివాలయాలలో 142 మంది సిబ్బందితో 6240 పింఛన్‌లకు రూ.2,65,86,500 కోట్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ఈ మేరకు శతశాతం పింఛన్ పంపిణీ చేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు.
PLD: పెదకూరపాడు రైల్వే స్టేషన్ వద్ద (LC-27), సత్తెనపల్లి-రెడ్డిగూడెం మధ్య (LC-40) రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జిల(ROB) నిర్మాణానికి రూ.84 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుత రైల్వే గేట్ల స్థానంలో కొత్తగా టూ-లేన్ వంతెనలు నిర్మిస్తారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు, ప్రయాణికుల నిరీక్షణకు చెక్ పడనుంది. రైల్వే అధికారులు ఇప్పటికే టెండర్లు పిలిచారు.
SKLM: పీఎం మోదీ నిర్వహించే మన్ కీ బాత్ శ్రీకాకుళంలోని విద్యార్థులతో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎస్ తేజేశ్వరరావు ఆదివారం వీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలో నెలవారీగా జరుగుతున్న ముఖ్యమైన అంశాలను ప్రధాని ప్రజలతో పంచుకుంటారని తెలిపారు. యువత తప్పనిసరిగా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించాలని సూచించారు.