ELR: జంగారెడ్డిగూడెం శివారు పెరంపేట రోడ్డులో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను యథేచ్ఛగా పారబోస్తున్నారు. దీంతో వెలువడుతున్న తీవ్ర దుర్వాసన వల్ల స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం అటువైపుగా వెళ్లలేని విధంగా పరిస్థితులు ఉండటంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యర్థాలను పారబోస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
BPT: సంతమాగులూరు శాఖా గ్రంధాలయం నందు ఆదివారం 27వ రోజు వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహించడం జరిగినది. ఈ మేరకు విద్యుత్ శాఖ లైన్మెన్ ఎస్. హరి గోపాల్ “టీవీ వద్దు-పుస్తకం ముద్దు” అనే కాన్సెప్ట్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వివిధ రకాల ఆటలు ఆడటం జరిగినది. ఈ కార్యక్రమంలో 17 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
KDP: వీర బ్రహ్మేంద్ర స్వామి నివాసం ఉన్న ఇళ్లు గత వర్షాకాలంలో కూలిన విషయం తెలిసిందే. అప్పుడు SM ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి లోకేశ్ వెంటనే స్వామి నివాస గృహాన్ని పునర్నిర్మించాలని కలెక్టరుకు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇప్పటికి దాదాపు 8 నెలలు అవుతున్నా ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టక పోవటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
NTR: తిరువూరు మండల ప్రజలకు మహిళా ఎస్సై గౌరేశ్వరి కీలక సూచనలు చేశారు. 18 ఏళ్లలోపు పిల్లలపై అసభ్య ప్రవర్తన, వేధింపులు, అనుచితంగా తాకడం, భయపెట్టడం వంటి చర్యలు పోక్సో చట్టం కింద తీవ్రమైన నేరాలని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచి, వారు చెప్పే సమస్యలకు వెంటనే స్పందించాలని సూచించారు. అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే 112కు కాల్ చేయాలన్నారు.
కడపలోని స్థానిక యువతులు కవిత (బ్యూటిషన్)లక్ష్మి (వెటర్నరీ స్టూడెంట్)తమ సొంత ఖర్చులతో ఆదివారం రోడ్డుపై కొత్తగా వేసిన స్పీడ్ బ్రేకర్‌కు తెల్లని రంగులు వేశారు. రాత్రివేళ వాహనదారులు గుర్తించలేక ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని భావించి, ఈ ఉదయం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జీబ్రా లైన్లు వేశారు. వీరి సామాజిక స్పృహను స్థానికులు అభినందిస్తున్నారు.
WG: భీమవరం మార్కెట్ వివరాల ప్రకారం.. కిలో బ్రాయిలర్ చికెన్ ధర ₹260 నుంచి ₹280 వరకు పలుకుతుండగా, లేయర్ (ఫారం) కోడి మాంసం ధర కిలో రూ. 240 నుంచి రూ. 260 కి చేరింది. ఇక ఆదివారం డిమాండ్ ఎక్కువగా ఉండే మటన్ ధర కిలో ఏకంగా రూ.1000గా కొనసాగుతోంది. చేపల విషయానికి వస్తే, వాటి రకాన్ని బట్టి కిలో రూ.150 నుంచి 180 వరకు విక్రయిస్తున్నట్లు స్థానిక వ్యాపార వర్గాలు తెలిపాయి.
కోనసీమ: మహిళా రిజర్వేషన్ బిల్లుతో సంబంధం లేకుండా టీడీపీ ద్వారా అన్ని ఎన్నికల్లో మహిళలకు 33 శాతం అవకాశాలు ఇస్తామని పార్టీ అధ్యక్షులు నారా లోకేష్ ఇటీవల ప్రకటించడం పట్ల రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గడి సత్యవతి ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ మహిళలకు 33% రిజర్వేషన్ ప్రకటించారన్నారు. కూటమి ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
KRNL: మంత్రాలయంలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతైన ఘటన నేపథ్యంలో వైసీపీ నాయకుడు వై. సీతారామిరెడ్డి, జిల్లా కార్యదర్శి సి.వి. విశ్వనాథ్ రెడ్డితో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఘటన వివరాలను తెలుసుకుని గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని పోలీసులను కోరారు.
ATP: అనంతపురం నగరంలోని కోవూరునగర్‌లో గల మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నారపరెడ్డి ఇంట్లో అరుదైన బ్రహ్మ కమలాలు (మే పుష్పాలు) విరబూశాయి. కేవలం మే మాసంలో మాత్రమే పూసే ఈ ఆకర్షణీయమైన పుష్పాలు నారపరెడ్డి నివాసంలో వికసించడంతో స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మే పుష్పాలను చూడడానికి స్థానికులు, ప్రజలు ఎంతో ఆసక్తి చూపించారని నారపరెడ్డి ఈ సందర్భంగా ఆనందంగా తెలిపారు.
PLD: నరసరావుపేట రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో కుప్పకూలడంతో రైల్వే పోలీసులు వెంటనే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం తెల్లవారుజామున బుకింగ్ కౌంటర్ వద్ద ఫిట్స్ రావడంతో వ్యక్తి పడిపోయినట్లు తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆయన వివరాలు తెలిసినవారు లేదా బంధువులు రైల్వే పోలీసులను సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.
WG: ఆకివీడు మందపాడు రోడ్డులో శనివారం 2 కేజీల 600 గ్రాముల గంజాయి కలిగి ఉన్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కాళీ చరణ్ తెలిపారు. నిందితులపై రౌడీషీట్లు తెరుస్తామని చెప్పారు. కేసు ఛేదించిన సిబ్బందికి రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై హనుమంతు నాగరాజు పాల్గొన్నారు.
ప్రకాశం: గిద్దలూరు నియోజకవర్గంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉచిత ద్విచక్ర వాహనాల పథకం కింద 10 మంది దివ్యాంగులకు వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులు శనివారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత ప్రయాణం, పెన్షన్ రూ. 3వేల నుంచి రూ. 6వేలకు పెంపు వంటి చర్యలపై వారు హర్షం వ్యక్తం చేశారు.
అన్నమయ్య: గాజువాకలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ఆదివారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు మహిళలు, డ్రైవర్ కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి. ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
కోనసీమ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం నిధులు జూన్ 15లోపు అర్హులైన తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. నిధులు సకాలంలో అందాలంటే ఆధార్‌ను యాక్టివ్ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసి, ఎన్పీసీఐ మ్యాపింగ్ పూర్తైందో లేదో సంబంధిత బ్యాంక్‌లో నిర్ధారించుకోవాలని సూచించారు.
ELR: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 7 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్లతో శనివారం సమీక్షించారు. కార్యక్రమంలో ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు.ప్రతీ జిల్లాలో రోజువారీ నిర్వహించాల్సిన యోగా కార్యక్రమాలపై ఆయన దిశ నిర్దేశం చేశారు.