• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పోలేరమ్మ తల్లి తిరునాళ్లకు ఎమ్మెల్యే హాజరు

GNTR: కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలోని శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సుమారు 400 ఏళ్ల క్రితం స్వయంభూదేవిగా వెలసిన అమ్మవారిని ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు సతీసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు స్థాపించారు.

April 7, 2026 / 02:30 PM IST

కర్మాగారాల్లో భద్రతా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

KRNL: కర్మాగారాల్లో భద్రతా చర్యలు ఖచ్చితంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.సిరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఫ్యాక్టరీస్ శాఖ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని కర్మాగారాల్లో ప్రమాదాలు జరగకుండా నిర్దేశిత ప్రమాణాల మేరకు భద్రత ఉండాలని ఆమె పేర్కొన్నారు. కార్మికుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

April 7, 2026 / 02:17 PM IST

‘గ్రామ స్థాయి నుంచే పార్టీ బలోపేతం కావాలి’

SKLM: గ్రామ స్థాయిలో టీడీపీ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే శిరీష అన్నారు. మంగళవారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల క్యాడర్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ క్రమశిక్షణ, విధి విధానాలు, నాయకుల బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈ మేరకు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

April 7, 2026 / 02:13 PM IST

మే 1 నుంచి హౌసింగ్ సెన్సస్

PPM: మే 1 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా హౌసింగ్ సెన్సస్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు ఈ నెల 16 నుంచి 30 వరకు ‘స్వీయ గణన’ (Self Enumeration) అవకాశం కల్పించారు. ప్రజలు తమ ఇంటి వివరాలను స్వయంగా se.census.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చన్నారు.

April 7, 2026 / 02:12 PM IST

‘అబద్ధాల ప్రచారమే మీడియా స్వేచ్ఛా..?’

BPT: మీడియా స్వేచ్ఛ ముసుగులో వైసీపీ నాయకుల కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా ఆడవాళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని అద్దంకి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి, ఒక పార్టీకి తొత్తుగా మారి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దురదృష్టకరమని అన్నారు.

April 7, 2026 / 02:12 PM IST

వారపు సంత వేలంతో భారీ ఆదాయం

CTR: ఎస్ఆర్ పురం (M) 49. కొత్తపల్లి మిట్టలో వారపు సంతకు మంగళవారం వేళం జరిగింది. సీఐ హనుమంతప్ప, Dy. ఎంపీడీవో నాగరత్నమ్మ ఆధ్వర్యంలో వారపు సంత, షాపింగ్ కాంప్లెక్స్ మొదలైన ఆస్థులకు బహిరంగ వేలం నిర్వహించారు. 49. కొత్తపల్లి మిట్టకు చెందిన సీనియర్ నేత సూరి రెడ్డి రూ.16.20 లక్షలు హెచ్చుగా వేలం పాడి వారపు సంతను దక్కించుకున్నారు.

April 7, 2026 / 01:33 PM IST

ఎస్సీ కమిషన్ సభ్యులకు ఘన స్వాగతం

TPT: నాయుడుపేటకు విచ్చేసిన ఎస్సీ కమిషన్ సభ్యులు డాక్టర్ పాకాటి గౌతమ్, డాక్టర్ శ్రీపతి బాబుకు మంగళవారం ఘన స్వాగతం లభించింది. ఏఎంసీ ఛైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ జనసేన నాయకులతో కలిసి ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో పూల బొకేలు అందజేసి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు అట్ల కృష్ణరావు, బాలు శెట్టి తదితరులు పాల్గొన్నారు.

April 7, 2026 / 01:31 PM IST

ఎమ్మెల్సీ వ్యాఖ్యలను ఖండించిన సీపీఎం

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై పోరాడుతున్న కార్మికులు, కమ్యూనిస్టులపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను సీపీఎం తీవ్రంగా ఖండించింది. మంగళవారం ఏచూరి భవన్‌లో జరిగిన సమావేశంలో సీసీ సభ్యుడు లోకనాథం మాట్లాడారు. ఈ సందర్భంగా వీర్రాజు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

April 7, 2026 / 01:30 PM IST

శ్రీ లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

PPM: శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారిని ఇవాళ బొబ్బిలి ఎమ్మెల్యే R.V.S.K.K.రంగారావు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసాచార్యులు , ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు సాదర స్వాగతం పలికారు. దేవాలయమలో విశ్వశాంతి, లోకకళ్యాణార్థం నిర్వహిస్తున్న నవ నారసింహ యాగంలో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

April 7, 2026 / 01:20 PM IST

గాజువాకలో ఈఎస్ఐ ఆసుపత్రి 90% పనులు పూర్తి: ఎంపీ

VSP: గాజువాకలోని షీలానగర్ వద్ద 6.45 ఎకరాల్లో 400 మంది వైద్య సదుపాయం అందించే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని విశాఖ ఎంపీ భరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంగళవారం ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలించి మాట్లాడారు. రెండు నెలలు పూర్తిస్థాయిలో పనులు జరిగి ఆసుపత్రి ఉద్యోగ నియమకాలు చేస్తామన్నారు.

April 7, 2026 / 01:20 PM IST

డెంకాడలో ‘పీఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజన’ ప్రారంభం

VZM: పేద కుటుంబాల విద్యుత్ కష్టాలను తీర్చి వారి ఇళ్లలో వెలుగులు నింపే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజన’ పథకాన్ని నెల్లిమర్ల MLA లోకం నాగ మాధవి డెంకాడ గ్రామంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సోలార్ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు విద్యుత్ బిల్లుల భారం పూర్తిగా తగ్గుతుంది అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

April 7, 2026 / 01:20 PM IST

జిల్లా అభివృద్ధి అంశాలపై సీఎస్ సమీక్ష

TPT: ఏపీ సచివాలయం నుంచి 22ఏ, రిసర్వే, రెవెన్యూ, పీపీబీ పంపిణీ అంశాలపై చీఫ్ సెక్రటరీ జి. జయలక్ష్మి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, డీఆర్వో జి. నరసింహులు, అధికారులు పాల్గొన్నారు.

April 7, 2026 / 01:20 PM IST

భరతనాట్యంలో 5వ తరగతి విద్యార్థినికి అవార్డు

అన్నమయ్య: రైల్వేకోడూరులోని విజడమ్ సెంట్రల్ స్కూల్ 5వ తరగతి విద్యార్థిని కే.లిఫిత మార్చి 19-20 తేదీలలో కేరళలోని తిరువనంతపురంలో జరిగిన భరతనాట్య పోటీలలో పాల్గొని అవార్డు గెలుచుకుంది. ఈ విషయాన్ని విజడమ్ విద్యా సంస్థల ఛైర్మన్ డా. టీ.ప్రదీప్ తెలిపారు. ఈ సందర్భంగా ఛైర్మన్, అడ్మిన్ డైరెక్టర్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం లిఫితకు శుభాకాంక్షలు తెలిపారు.

April 7, 2026 / 01:19 PM IST

రేపు జిల్లాకు ఎస్సీ కమిషన్ ఛైర్మన్ రాక

CTR: రాష్ట్ర షెడ్యూల్ కులాల ఛైర్మన్ జవహర్ బుధవారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చిత్తూరులోని ఆర్అండ్‌బీ అతిథి గృహంలో ఫిర్యాదులను స్వీకరిస్తారన్నారు. మధ్యాహ్నం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులు, పోలీసు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.

April 7, 2026 / 01:18 PM IST

తాడేపల్లిగూడెంలో వైసీపీ కాఫీ విత్ క్యాడర్ ప్రోగ్రాం

W.G: కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ 1వ వార్డు వైసీపీ ఇన్‌ఛార్జ్ కొర్రపాటి వెంకటేశ్వరరావు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఇన్‌ఛార్జ్ వడ్డే రఘురాం పాల్గొన్నారు. అనంతరం పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.

April 7, 2026 / 01:17 PM IST