• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘జెట్రో-ఏయూ భాగస్వామ్యం’

VSP: జపాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి బృందం ఆంధ్ర యూనివర్సిటీను సందర్శించింది. ఈ సందర్భంగా జపాన్ కంపెనీల్లో విద్యార్థుల నియామకాలు, ఫ్యాకల్టీ-స్టూడెంట్ ఎక్స్చేంజ్‌పై చర్చలు జరిపింది. జపాన్ విద్యార్థులకు ఏయూలో ప్రవేశాలు, భాషా తరగతులు, సంయుక్త సదస్సులపై ప్రతిపాదనలు వెల్లువెత్తాయి.

April 28, 2026 / 08:29 PM IST

‘రోడ్డు విస్తరణ పనులలో స్పీడ్ పెంచండి’

GNTR: నగరంలో పెండింగ్‌లో ఉన్న రోడ్డు విస్తరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కమిషనర్ కే. మయూర్ అశోక్ ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశించారు. రెడ్డిపాలెం–నందివెలుగు రోడ్, ఏటీ అగ్రహారం ప్రాంతాల్లో పనులను పరిశీలించారు. వాసవి నగర్‌లో లేఅవుట్ అప్లికేషన్‌ను సమీక్షించి, పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులపై అధికారులకు సూచనలు ఇచ్చారు.

April 28, 2026 / 08:27 PM IST

బొర్రవారిపాలెంలో కలెక్టర్ పర్యటన

BPT: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయమని బాపట్ల జిల్లా కలెక్టర్ వీ. వినోద్ కుమార్ అన్నారు. నిజాంపట్నం మండలం బొర్రవారిపాలెంలో ఆయన మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ భవనం, మంచినీటి ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

April 28, 2026 / 08:24 PM IST

జలధార కార్యక్రమం ప్రారంభం

ASR: డుంబ్రిగుడ మండలం కండ్రం పంచాయతీ జాకరగూడ గ్రామంలో వి.బి.జి రామ్ గ్రామీణ పథకంలో భాగంగా జలధార జలవిహారి అనే కార్యక్రమం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచాయతీ ప్రత్యేక పరిపాలన అధికారి ఎస్. సుందర్రావు కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ ఎస్. ఆనందరావు, అధికారులు పాల్గొన్నారు.

April 28, 2026 / 08:15 PM IST

పోక్సో చట్టంపై వర్కర్లకు అవగాహన

AKP: పాయకరావుపేటలో పనిచేస్తున్న ప్రైవేట్ వర్కర్లకు సైబర్ క్రైమ్, పోక్సో యాక్ట్ పై సీఐ అప్పన్న మంగళవారం అవగాహన కల్పించారు. డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే, మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ASI పురుషోత్తం, సిబ్బంది పాల్గొన్నారు.

April 28, 2026 / 08:13 PM IST

దుకాణాదారులకు అవగాహన కల్పించిన సీఐ

VZM: కొత్తవలస కూడలిలో వ్యాపారం చేస్తున్న నిర్వాహకులు దుకాణం ముందు మూడురోడ్లు కనబడేలా సీసీ కెమెరాలను ఆమర్చుకోవాలని సీఐ టి.వి. విజయ కుమార్ మంగళవారం సూచించారు. సీసీ కెమెరాలు మూడో నేత్రంతో సమానమన్నారు. వీటి ద్వారా దొంగతనాల చెక్ పెట్టవచ్చని తెలిపారు. అంతే కాకుండా విలువైన వస్తువులు కాపాడుకోవచ్చని చెప్పారు.

April 28, 2026 / 08:13 PM IST

మే 3న NEET UG–2026 ప్రవేశ పరీక్ష

E.G: మే 3న నిర్వహించనున్న NEET UG–2026 ప్రవేశ పరీక్షలను జిల్లాలో ప్రశాంతంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని DRO టి. సీతారామ మూర్తి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు.

April 28, 2026 / 08:10 PM IST

మే 3న అనంతపురంలో నీట్ పరీక్ష

ATP: అనంతపురం జిల్లాలో మే 3న నీట్ (యూజీ) పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8 కేంద్రాల్లో 3616 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష నిర్వహణకు జిల్లా రెవెన్యూ అధికారి మలోలను నోడల్ ఆఫీసర్‌గా కలెక్టర్ ఆనంద్ నియమించారు. అభ్యర్థులు పరీక్ష సమయం కంటే ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.

April 28, 2026 / 08:10 PM IST

ముగిసిన మంత్రి బీసీ సింగపూర్ పర్యటన

NDL: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సింగపూర్ పర్యటన ముగిసింది. ఇవాళ ఆయన సహచర మంత్రులతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. వివిధ అంశాలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి బీసీని ప్రత్యేక కమిటీలో భాగం చేసి సింగపూర్ పర్యటనకు పంపింది. ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై ఆయన CMకు నివేదిక అందించనున్నారు.

April 28, 2026 / 08:04 PM IST

నంద్యాలలో కొబ్బరిచెట్టుపై పడ్డ పిడుగు

NDL: జిల్లాలోని పలు మండలాల్లో ఇవాళ సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. సిరివెళ్ల మండలంలోని వెంకటేశ్వరపురం గ్రామంలో పిడుగు పడటంతో కొబ్బరి చెట్టుపై మంటలు చెలరేగాయి. ఉరుములు, మెరుపులతో వర్షం పడే వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం కురుస్తున్నప్పుడు బయటకు రావద్దని, చెట్ల కింద ఆశ్రయం పొందకూడదని హెచ్చరికలు జారీ చేశారు.

April 28, 2026 / 08:03 PM IST

YCPపై మంత్రి తీవ్ర విమర్శలు

KRNL: గూగుల్ డేటా సెంటర్, క్వాంటం వ్యాలీతో రాష్ట్ర దశ మారుతుందని మంగళవారం మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఇది రాష్ట్ర భవిష్యత్ మార్చే గొప్ప కార్యక్రమం అని కొనియాడారు. జగన్‌కు క్రెడిట్ చోరీ అలవాటైందని విమర్శించారు. ఏపీ నుంచి పరిశ్రమలను తరిమేశారని.. మెడికల్ కాలేజీల టెండర్లను అడ్డుకున్నారని ఆరోపించారు.

April 28, 2026 / 08:01 PM IST

‘సురక్షిత ప్రసవాలే లక్ష్యం’

PPM: గర్భిణీ స్త్రీల్లో హైరిస్క్ సమస్యలను సకాలంలో గుర్తించి సురక్షిత ప్రసవాలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మాతా, శిశు మరణాలపై సమీక్ష నిర్వహించి, క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ పెంచాలని సూచించారు. గర్భిణీలు సమయానికి పరీక్షలు చేయించుకుని పోషకాహారం తీసుకోవాలన్నారు.

April 28, 2026 / 08:01 PM IST

ఆక్వా సాగుకు ఇంధన కష్టం

W.G: విద్యుత్ కోతలు, డీజిల్ కొరత ఆక్వా రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ అందించే ఏరియేటర్లు తిరగాలంటే విద్యుత్ తప్పనిసరి. కరెంటు లేని వేళ జనరేటర్లే దిక్కుకాగా, మార్కెట్లో డీజిల్ దొరకక సాగు భారమవుతోంది. కొల్లేరు వంటి ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

April 28, 2026 / 08:00 PM IST

‘రైతులకు ఇబ్బంది లేకుండా డీజిల్ సరఫరా చేస్తాం’

ELR: దెందులూరు నియోజకవర్గ పరిధిలోని రైతులకు ధాన్యం సేకరణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. మంగళవారం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల తాహసీల్దారుల పర్యవేక్షణలో వ్యవసాయ అధికారుల ద్వారా ప్రత్యేకంగా ఇంధన కూపన్‌లు అందించి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నమన్నారు.

April 28, 2026 / 08:00 PM IST

16 మందిపై పీడీ యాక్ట్ నమోదు

CTR: తిరుపతి జిల్లా పోలీస్ శాఖ గాంజా, ఇతర మాదకద్రవ్యాల నియంత్రణపై కఠిన చర్యలు కొనసాగిస్తోంది. పదేపదే నేరాలకు పాల్పడిన 16 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన రూ.5.32 కోట్ల విలువైన 1064 కిలోల గంజాయిని చట్టపరంగా దగ్దం చేశారు. ఈ ప్రక్రియను అనంతపురం రేంజ్ ఐజీ డా.షిముషి బాజ్‌పాయి పర్యవేక్షించారు.

April 28, 2026 / 07:56 PM IST