• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: మంత్రి

సత్యసాయి: పెనుకొండ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో పంచాయతీల ప్రత్యేక అధికారులతో మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక వసతులపై దృష్టి సారించాలని సూచించారు. వేసవి నేపథ్యంలో తాగునీటి కొరత రాకుండా చూడాలని అన్నారు.

April 8, 2026 / 06:21 AM IST

ఆదోనికి ప్రముఖ నటుడు అలీ రాక

KRNL: ఆదోని పట్టణంలో ఏప్రిల్ 13న నూతనంగా ప్రారంభం కానున్న ఆంధ్రా గోల్డ్ అండ్ జ్యూవెలరీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటుడు అలీ తన సతీమణితో కలిసి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వారి రాక నేపథ్యంలో అభిమానులు, వ్యాపార వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.

April 8, 2026 / 06:16 AM IST

శుద్ధి చేసిన తాగునీరు అందించడమే ప్రాధాన్యత: ఎమ్మెల్యే

ATP: రాయదుర్గం ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందించడమే ప్రాధాన్యతని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ అధికారులు, కాంట్రాక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. రూ.72.32 కోట్లతో అమృత్-2 పథకం కింద 70 వేల మందికి ఉపయోగపడే పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.

April 8, 2026 / 06:16 AM IST

22న భారీ సాంస్కృతిక ప్రదర్శన: కలెక్టర్

PPM: జిల్లా కేంద్రంలో ఈ నెల 22న నిర్వహించనున్న భారీ సాంస్కృతిక ప్రదర్శనతో సరికొత్త రికార్డు సృష్టించాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి ఆకాంక్షించారు. పట్టణంలో సుమారు 6 వేల మంది విద్యార్థులతో ఈ ప్రదర్శనను చేపట్టనున్నారు. దీనికి సంబంధించి మంగళవారం కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో VC నిర్వహించి ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. 

April 8, 2026 / 06:16 AM IST

నెల్లూరులో 10 మంది ఎస్సైలు బదిలీ

NLR: నెల్లూరు జిల్లాలో పరిపాలనా కారణాలతో 10 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాపూరు, చేజర్ల, సైదాపురం, కండలేరు ఎస్సైలతో పాటు వీఆర్‌‌లో ఉన్న నలుగురు అధికారులకు కొత్త పోస్టింగ్లు ఇచ్చారు. బదిలీ అయిన ఎస్సైలందరూ తక్షణమే విధుల్లో చేరాలని ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.

April 8, 2026 / 06:14 AM IST

కనుల పండుగగా గంగమ్మ కళ్యాణోత్సవం

CTR: చౌడేపల్లిలో గంగ జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. నిన్న రాత్రి కుమ్మరుల ఇంటి నుంచి అమ్మవారిని కళ్యాణ గంగమ్మ ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి ఊరేగింపుగా రజకుల ఇంటికి తీసుకువెళ్లారు. మడవలి రాజుతో కళ్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం నడివీధిలో ప్రతిష్టించారు. ఇవాళ కూడా ఈ జాతర కొనసాగనుంది.

April 8, 2026 / 06:09 AM IST

స్మార్ట్ సిటీ పనులు త్వరగా పూర్తి చేయాలి

TPT: తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జరిగిన స్మార్ట్ సిటీ కార్పొరేషన్ 43వ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు సహా అన్ని పనులను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ ఎన్. మౌర్య పాల్గొన్నారు.

April 7, 2026 / 10:15 PM IST

కోవెలకుంట్ల GDCకి ఏ-గ్రేడ్: ప్రిన్సిపల్

NDL: ఈ ఏడాదికి సంబంధించి జరిగిన అకాడమిక్ ఆడిట్లో కోవెలకుంట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఏ-గ్రేడ్ పత్రం లభించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ మంగళవారం వెల్లడించారు. ఈ మేరకు డిగ్రీ కళాశాలలో జరిగిన సమావేశానికి అకాడమిక్ అడ్వైజర్లుగా వచ్చిన డాక్టర్ హనుమంత రెడ్డి కాసిం సాహెబ్ కళాశాల అధ్యా పకులను అభినందించి ఏ-గ్రేడ్ పత్రాన్ని అందజేశారు.

April 7, 2026 / 10:14 PM IST

నిరంతరం ప్రజల వెంటే.. అప్పుడే విజయం..!

ASR: పెదబయలులో జరిగిన టీడీపీ కేడర్ సమావేశంలో అరకు నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ సియ్యారి దొన్ను దొర పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తలు నిరంతరం ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

April 7, 2026 / 10:12 PM IST

అమరావతిలో ప్రపంచ బ్యాంకు బృందం

GNTR: అమరావతిలో ఎకో టూరిజంపై ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారథి ప్రపంచ బ్యాంకు బృందానికి వివరించారు. మంగళవారం వీరు రాజధానిలో పర్యటించారు. గ్రావిటీ కెనాల్ వద్ద ఎకో టూరిజం పనులను పరిశీలించారు. అనంతవరం నర్సరీలో వృక్షాల సంరక్షణను బృందం అభినందించింది. నీరుకొండలో 0.4 టీఎంసీలతో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనుల వివరాలను సీఎండీ వారికి తెలియజేశారు.

April 7, 2026 / 10:00 PM IST

‘భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా అధికారులు పనిచేయాలి’

ప్రకాశం: మార్కాపురం జిల్లాలో భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదేశించారు. “జల ధార-నీటి భద్రత” కార్యక్రమంలో భాగంగా 100 రోజుల ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ముందుగా 10 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి, తదుపరి 80 రోజుల్లో చెరువుల పూడిక తీయడం, భూగర్భ జలాల పెంపు చర్యలు చేపట్టాలని తెలిపారు.

April 7, 2026 / 10:00 PM IST

నీటి నిల్వలతోనే సంపద సృష్టి సాధ్యం: వసంత

NTR: నీటి నిల్వలతోనే సంపద సృష్టి సాధ్యం అని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. మైలవరం మండలం చంద్రాల గ్రామంలో “నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంగళవారం పాల్గొన్నారు. నీటి భద్రత కార్యక్రమ ప్రచార పత్రాలు ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన యాప్‌ను అందరూ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

April 7, 2026 / 10:00 PM IST

పీఎండీఎస్ కిట్లపై అవగాహన

PLD: యడ్లపాడు మండలం చీఘిస్ ఖాన్‌పేట్‌లో ప్రకృతి వ్యవసాయంపై మంగళవారం అవగాహన సదస్సు జరిగింది. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ అమల కుమారి రైతులకు పీఎండీఎస్ కిట్ల వాడకంపై వివరించారు. తొలకరి కంటే ముందే 30 రకాల విత్తనాల కిట్‌ను చల్లడం వల్ల నేలలో తేమ నిలిచి పంటలు ఎండను తట్టుకుంటాయన్నారు. దీనివల్ల సేంద్రియ కర్బనం, దిగుబడి పెరుగుతుందన్నారు.

April 7, 2026 / 10:00 PM IST

బొలెరో వాహనం బోల్తా.. తప్పిన పెనుప్రమాదం

KRNL: ఎమ్మిగనూరు మండలం బనవాసి సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద పెండేకల్ నుంచి ఎమ్మిగనూరు వైపు మొక్కజొన్న లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వాహనంలో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మొక్కజొన్న సంచులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.

April 7, 2026 / 09:33 PM IST

పనులు వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

TPT: తిరుపతిలో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 43వ బోర్డు సమావేశంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నగర అభివృద్ధికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులను సమయానికి పూర్తి చేయాలన్నారు.

April 7, 2026 / 09:32 PM IST