• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బొలెరో వాహనం బోల్తా.. తప్పిన పెనుప్రమాదం

KRNL: ఎమ్మిగనూరు మండలం బనవాసి సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద పెండేకల్ నుంచి ఎమ్మిగనూరు వైపు మొక్కజొన్న లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వాహనంలో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మొక్కజొన్న సంచులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.

April 7, 2026 / 09:33 PM IST

పనులు వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

TPT: తిరుపతిలో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 43వ బోర్డు సమావేశంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నగర అభివృద్ధికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులను సమయానికి పూర్తి చేయాలన్నారు.

April 7, 2026 / 09:32 PM IST

‘ఏబీఎన్‌పై దాడులు హేయం’

PLD: తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే జగన్ ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతిపై దాడులు చేయిస్తున్నారని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సొంత నేతలే తనను వ్యతిరేకిస్తున్నారన్న అక్కసుతో దాడులకు పురిగొల్పుతున్నారన్నారు. పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవడం ఎవరితరం కాదన్నారు.

April 7, 2026 / 09:30 PM IST

బోడపాడులో పేకాట శిబిరంపై దాడి 14 మంది అరెస్ట్

ప్రకాశం: మార్కాపురం మండలంలోని బోడపాడు గ్రామంలో పేకాట శిబిరంపై దాడి చేశారు. ఈ దాడిలో 14 మందిని తీసుకొని వారి వద్ద నుండి రూ.55,860 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌కి అప్పగించారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి శిక్ష తప్పదని అన్నారు.

April 7, 2026 / 09:30 PM IST

తెనాలిలో తనిఖీలు చేసిన మున్సిపల్ కమిషనర్

GNTR: తెనాలి మున్సిపల్ కమిషనర్ రామా అప్పలనాయుడు వార్డుల్లో కల్వర్టులు, అభివృద్ధి పనులను పరిశీలించి ఇంజనీరింగ్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అన్నా క్యాంటీన్‌ను సందర్శించి ఆహార నాణ్యతను తనిఖీ చేశారు. 7వ వార్డులో హోమ్ కంపోస్ట్ విధానంపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈ ఆంజనేయరాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

April 7, 2026 / 09:30 PM IST

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు A-గ్రేడ్

ELR: కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు A- గ్రేడ్ లభించిందని ఇంఛార్జి ప్రిన్సిపాల్ మల్లేశ్వరరావు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం 2025-26 సంబంధించి కళాశాలలో సౌకర్యాలను అన్ని విభాగాల రికార్డులను అకడమిక్ ఆడిట్ నిర్వహించడం జరిగింది. నారాయణపురం డిగ్రీ కళాశాలకు చెందిన తెలుగు అధ్యాపకులు కొండా రవి, తణుకు డిగ్రీ కళాశాలకు చెందిన జువాలజీ అధ్యాపకులు చెప్పారు.

April 7, 2026 / 09:27 PM IST

అన్నవరం దేవస్థానం పాలకమండలి డైరెక్టర్‌గా బాబ్జి

కోనసీమ: అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం పాలక మండలి డైరెక్టర్‌గా మండపేట మండలం ద్వారపూడికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు యరగతపు బాబ్జి నియమితులయ్యారు. ఆయన టీడీపీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

April 7, 2026 / 09:00 PM IST

CRDA కమిషనర్‌ను కలిసిన ఎమ్మెల్యే తాతయ్య

NTR: ఏపీ CRDA కమిషనర్ విజయ రామరాజును జగ్గయ్యపేట ఎమ్మెల్యే రాజగోపాల్ (తాతయ్య) మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా CRDA పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా జగ్గయ్యపేట పరిధిలోని బలుసుపాడు రోడ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే, కమిషనర్‌ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు.

April 7, 2026 / 09:00 PM IST

ఈతకు వెళ్లి బాలుడి మృతి

PLD: చిలకలూరిపేటలో విషాదం జరిగింది. సుభాని నగర్‌కు చెందిన చందు అనే ఐదో తరగతి విద్యార్థి వాగులో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. నీటి లోతు తెలియక ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో నీటిలోంచి బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

April 7, 2026 / 09:00 PM IST

కామేపల్లిలో వైభవంగా శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి తిరునాళ్ల

BPT: మండల పరిధిలోని కామేపల్లి గ్రామంలో వెలసిన శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. ఏటా నిర్వహించే ఈ వేడుకలకు ఈ ఏడాది భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

April 7, 2026 / 09:00 PM IST

పుంగనూరుకు నూతన కోర్టు మంజూరు

CTR: పుంగనూరు కోర్ట్ సముదాయంలో రెండవ అదనపు సివిల్‌జడ్జి, జూడిషియల్‌ మెజిస్ట్రేట్‌ఆఫ్‌ ఫస్ట్ క్లాస్ కోర్టును ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న 3 కోర్టులతో కలిపి పట్టణంలో 4 కోర్టుల్లోను కేసులు పరిష్కరించనున్నారు. కేసులను వేగంవంతంగా పరిష్కరించేందుకు అదనపు కోర్టు మంజూరు కావడంపై న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ హర్షం వ్యక్తపరిచారు.

April 7, 2026 / 08:50 PM IST

ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా మధులత

W.G: ద్వారకాతిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా పెంటపాడుకు చెందిన జనసేన నాయకురాలు కసిరెడ్డి మధులత నియమితులయ్యారు. స్వామివారి సేవ చేసుకునే భాగ్యం కలగడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. తన నియమాకానికి సహకరించిన ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, మద్దిపాటి వెంకట్రాజులకు మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు.

April 7, 2026 / 08:43 PM IST

తాగునీటి సరఫరాపై కమిషనర్ తనిఖీలు

KDP: నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర బండి కనుమ పంప్ హౌస్, స్టోరేజ్ ట్యాంకులను పరిశీలించారు. తాగునీటి సరఫరా వ్యవస్థ పనితీరును అధికారులతో సమీక్షిస్తూ.. నీటి నాణ్యతపై ప్రత్యక్షంగా పరీక్షలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. నగర ప్రజలకు శుద్ధమైన మరియు సమృద్ధిగా తాగునీటి సరఫరా అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

April 7, 2026 / 08:32 PM IST

మహిళా రక్షణపై అవగాహన కార్యక్రమం

CTR: ఇవాళ చిత్తూరులో మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బందిలు, శక్తి బృందాలతో కలిసి వివిధ ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు భద్రత, రక్షణ, చట్టపరమైన భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాలలో తక్షణ సహాయం, అత్యవసర మద్దతు కోసం శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించమని మహిళలను ప్రోత్సహించారు.

April 7, 2026 / 08:32 PM IST

డోకిశీలలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

PPM: గ్రామ స్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఆయుర్వేద వైద్య సేవలు అందిస్తున్నామని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యాధికారిణి డాక్టర్ టి. హేమాక్షి అన్నారు. ఈ మేరకు డోకిశీలలో మంగళవారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో పలువురికి ఆరోగ్య తనిఖీలు నిర్వహించారు. అనంతరం రోగులకు మందులను పంపిణీ చేశారు

April 7, 2026 / 08:31 PM IST