VZM: వంగర మండలంలో జూన్ నెలకు సంబంధించి NTR భరోసా ఫించన్ల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు MPDO టి.రాజారావు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..19 గ్రామ సచివాలయాలలో 142 మంది సిబ్బందితో 6240 పింఛన్‌లకు రూ.2,65,86,500 కోట్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ఈ మేరకు శతశాతం పింఛన్ పంపిణీ చేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు.
PLD: పెదకూరపాడు రైల్వే స్టేషన్ వద్ద (LC-27), సత్తెనపల్లి-రెడ్డిగూడెం మధ్య (LC-40) రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జిల(ROB) నిర్మాణానికి రూ.84 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుత రైల్వే గేట్ల స్థానంలో కొత్తగా టూ-లేన్ వంతెనలు నిర్మిస్తారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు, ప్రయాణికుల నిరీక్షణకు చెక్ పడనుంది. రైల్వే అధికారులు ఇప్పటికే టెండర్లు పిలిచారు.
SKLM: పీఎం మోదీ నిర్వహించే మన్ కీ బాత్ శ్రీకాకుళంలోని విద్యార్థులతో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎస్ తేజేశ్వరరావు ఆదివారం వీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలో నెలవారీగా జరుగుతున్న ముఖ్యమైన అంశాలను ప్రధాని ప్రజలతో పంచుకుంటారని తెలిపారు. యువత తప్పనిసరిగా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించాలని సూచించారు.
PPM: జిల్లాలో రైతులకు నష్టం కలిగిస్తున్న అడవి ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కొమరాడలో ఇవాళ సీపీఎం మండల కన్వీనర్ సాంబమూర్తి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏనుగుల సంచారంతో పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుంకీ ఏనుగుల సహాయంతో అడవి ఏనుగుల గుంపును ఇతర ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
కోనసీమ: హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో పవన్ కళ్యాణ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై అమలాపురానికి చెందిన 80 ఏళ్ల జనసేన వీర మహిళ ముత్యాల మణెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శలకు హద్దులు ఉండాలని, వ్యక్తిగత దూషణలు సమంజసం కాదని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అమలాపురం పట్టణ పోలీసులను కోరారు.
BPT: పట్టణం పెయింటర్స్ కాలనీలో నూతనంగా నిర్మించిన చిల్డ్రన్స్ పార్కును ఆదివారం ఘనంగా ప్రారంభించారు. రూ.25 లక్షల వ్యయంతో పిల్లల కోసం ప్రత్యేకంగా దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి, కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవర్మ రాజు హాజరయ్యారు.
KDP: ప్రొద్దుటూరు 2టౌన్ CI వంశీనాథ్ ఆధ్వర్యంలో SI రాఘవేంద్ర రెడ్డి, సిబ్బంది 13 మంది క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను పట్టుకున్నారు. ఈ కేసులో 2టౌన్ పోలీసుల నిఘా, పనితీరుపై ASP విభుకృష్ణ అభినందించారు. ప్రొద్దుటూరుకు చెందిన షేక్ జావీద్, జిలాన్, రామచంద్ర, మహమ్మద్ రఫీ, అస్లాం, విష్ణు నరసింహ, జేమ్స్, గౌస్ బాషా, పఠాన్ జాఫర్, రాజకులాయప్ప (PVLD), ఇంతియాజ్(NDYL)ను అరెస్టు చేశారు.
ELR: పెదపాడు శాఖ గ్రంథాలయంలో ఆదివారం వేసవి విజ్ఞాన శిబిరం ఘనంగా జరిగింది. రిసోర్స్ పర్సన్ గుంటూరు శ్రీనివాసరావు ‘పంజాబ్ కేసరి’ లాలా లజపతిరాయ్ జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులతో కథా పఠనం, పుస్తక పఠనం చేయించి, క్యారమ్స్, చెస్ ఆటలలో శిక్షణ ఇచ్చారు. విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
VZM: డీఎస్సీలో జరిగిన అక్రమాలు, తలెత్తిన లోపాలను నిరసిస్తూ YCP యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం కలక్టరేట్ వద్ద దర్నా చేపడుతున్నట్లు నియోజకవర్గ అధ్యక్షుడు వంశీకృష్ణ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నెహ్రూ యువకేంద్రం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
VSP: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 100 ఎలక్ట్రిక్ బస్సుల్లో భాగంగా తొలి విడతగా 9 ఆధునిక ఈ-బస్సులను గాజువాక ఆర్టీసీ డిపోలో ప్రారంభించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి ఈ బస్సులను ప్రారంభించారు. పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విశాఖను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతామన్నారు .
CTR: మాదకద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ తుషార్ తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు సిబ్బంది జిల్లాలోని 25 ప్రాంతాలలో ఆదివారం కార్డెన్ సర్చ్ నిర్వహించారు. డ్రగ్ డిటెక్షన్ కిట్స్ ద్వారా 110 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. ఐరాల మండలంలో గన్ పౌడర్, పేలుడుకు ఉపయోగించే పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
SS: సోమందేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఓంకార్ ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పొగాకు, ధూమపానం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించి, పొగాకు ఉత్పత్తులను పూర్తిగా మానాలని సూచించారు. అనంతరం ప్రజలతో పొగాకు వాడకాన్ని నిరోధిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
కోనసీమ: రావులపాలెం మండలంలో మే నెల అవ్వ-తాతలకు NTR భరోసా పెన్షన్ పంపిణీ మే 1వ తేదిన ఉదయం 6:30 గంటలకు ప్రారంభమవుతుందని ఎంపీడీవో సుబ్రహ్మణ్యం తెలిపారు. వివిధ కేటగిరీలకు చెందిన 11,544 మంది లబ్ధిదారులకు 5,07,74,000 పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. లబ్ధిదారులు తమ ఇళ్ల వద్దకే సిబ్బంది వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తారని తెలిపారు.
ATP: జిల్లా కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రధాన కార్యక్రమం జరిగింది. అనంతపురంలో జరిగిన ఈ వేడుకకు ఎంపీ బీకే పార్థసారధి హాజరై విద్యార్థులను సత్కరించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కురుబ వర్గ విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
అన్నమయ్య: రాయచోటిలో వైసీపీ బీఎల్ఏలకు ఎస్‌ఐఆర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు అమరనాథరెడ్డి, పార్లమెంట్ పరిశీలకులు సురేష్ బాబు హాజరయ్యారు. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించకుండా ప్రతి ఓటును కాపాడుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు.