NTR: తిరువూరు మండల ప్రజలకు మహిళా ఎస్సై గౌరేశ్వరి కీలక సూచనలు చేశారు. 18 ఏళ్లలోపు పిల్లలపై అసభ్య ప్రవర్తన, వేధింపులు, అనుచితంగా తాకడం, భయపెట్టడం వంటి చర్యలు పోక్సో చట్టం కింద తీవ్రమైన నేరాలని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచి, వారు చెప్పే సమస్యలకు వెంటనే స్పందించాలని సూచించారు. అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే 112కు కాల్ చేయాలన్నారు.
కడపలోని స్థానిక యువతులు కవిత (బ్యూటిషన్)లక్ష్మి (వెటర్నరీ స్టూడెంట్)తమ సొంత ఖర్చులతో ఆదివారం రోడ్డుపై కొత్తగా వేసిన స్పీడ్ బ్రేకర్‌కు తెల్లని రంగులు వేశారు. రాత్రివేళ వాహనదారులు గుర్తించలేక ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని భావించి, ఈ ఉదయం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జీబ్రా లైన్లు వేశారు. వీరి సామాజిక స్పృహను స్థానికులు అభినందిస్తున్నారు.
WG: భీమవరం మార్కెట్ వివరాల ప్రకారం.. కిలో బ్రాయిలర్ చికెన్ ధర ₹260 నుంచి ₹280 వరకు పలుకుతుండగా, లేయర్ (ఫారం) కోడి మాంసం ధర కిలో రూ. 240 నుంచి రూ. 260 కి చేరింది. ఇక ఆదివారం డిమాండ్ ఎక్కువగా ఉండే మటన్ ధర కిలో ఏకంగా రూ.1000గా కొనసాగుతోంది. చేపల విషయానికి వస్తే, వాటి రకాన్ని బట్టి కిలో రూ.150 నుంచి 180 వరకు విక్రయిస్తున్నట్లు స్థానిక వ్యాపార వర్గాలు తెలిపాయి.
కోనసీమ: మహిళా రిజర్వేషన్ బిల్లుతో సంబంధం లేకుండా టీడీపీ ద్వారా అన్ని ఎన్నికల్లో మహిళలకు 33 శాతం అవకాశాలు ఇస్తామని పార్టీ అధ్యక్షులు నారా లోకేష్ ఇటీవల ప్రకటించడం పట్ల రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గడి సత్యవతి ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ మహిళలకు 33% రిజర్వేషన్ ప్రకటించారన్నారు. కూటమి ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ATP: అనంతపురం నగరంలోని కోవూరునగర్‌లో గల మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నారపరెడ్డి ఇంట్లో అరుదైన బ్రహ్మ కమలాలు (మే పుష్పాలు) విరబూశాయి. కేవలం మే మాసంలో మాత్రమే పూసే ఈ ఆకర్షణీయమైన పుష్పాలు నారపరెడ్డి నివాసంలో వికసించడంతో స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మే పుష్పాలను చూడడానికి స్థానికులు, ప్రజలు ఎంతో ఆసక్తి చూపించారని నారపరెడ్డి ఈ సందర్భంగా ఆనందంగా తెలిపారు.
PLD: నరసరావుపేట రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో కుప్పకూలడంతో రైల్వే పోలీసులు వెంటనే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం తెల్లవారుజామున బుకింగ్ కౌంటర్ వద్ద ఫిట్స్ రావడంతో వ్యక్తి పడిపోయినట్లు తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆయన వివరాలు తెలిసినవారు లేదా బంధువులు రైల్వే పోలీసులను సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.
WG: ఆకివీడు మందపాడు రోడ్డులో శనివారం 2 కేజీల 600 గ్రాముల గంజాయి కలిగి ఉన్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కాళీ చరణ్ తెలిపారు. నిందితులపై రౌడీషీట్లు తెరుస్తామని చెప్పారు. కేసు ఛేదించిన సిబ్బందికి రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై హనుమంతు నాగరాజు పాల్గొన్నారు.
ప్రకాశం: గిద్దలూరు నియోజకవర్గంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉచిత ద్విచక్ర వాహనాల పథకం కింద 10 మంది దివ్యాంగులకు వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులు శనివారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత ప్రయాణం, పెన్షన్ రూ. 3వేల నుంచి రూ. 6వేలకు పెంపు వంటి చర్యలపై వారు హర్షం వ్యక్తం చేశారు.
అన్నమయ్య: గాజువాకలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ఆదివారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు మహిళలు, డ్రైవర్ కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి. ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
ELR: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 7 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్లతో శనివారం సమీక్షించారు. కార్యక్రమంలో ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు.ప్రతీ జిల్లాలో రోజువారీ నిర్వహించాల్సిన యోగా కార్యక్రమాలపై ఆయన దిశ నిర్దేశం చేశారు.
KDP: కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. కడప జిల్లాకు ప్రభుత్వం 7,519 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అర్హులైన పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. జూన్ నెల నుంచి నిత్యావసర సరకులు అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది.
ATP: తాడిపత్రి పట్టణంలో గాలివాన బీభత్సానికి పెద్ద చెట్టు మిద్దెపై పడటంతో గోడలు కూలిపోయాయి. అకస్మాత్తుగా చెట్టు మిద్దెపై పడటంతో ఇంట్లో ఉన్నవారు బయటకు పరుగులు తీశారు. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మిద్దెపై పడి ఉన్న చెట్టును మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
విజయనగరం: ఈనెల 28న ఎస్.కోట మండలం సంతగైరమ్మపేటలో చలుమూరి కుమారి ఇంటిలో పట్టపగలు దొంగతనం జరిగింది. పట్టణ సీఐ వి.నారాయణమూర్తి కేసు నమోదు చేశారు. తనదైన శైలిలో విచారణ చేయగా నిందితుడు ఎస్.కోట రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతూ పట్టుబడినట్లు తెలిపారు. దొంగతనం జరిగిన ఒకరోజులోనే చేధించడంతో జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ అభినందించి నగదు, ప్రశంస పత్రం అందజేశారు.
NTR: హైవేపై టోల్ ప్లాజాల వద్ద ఉన్న టాయిలెట్స్ శుభ్రంగా లేకపోతే ఫోటో తీసి పంపాలని NHAI ప్రజలను సూచించింది. క్లీన్ టాయిలెట్ ఎక్స్‌పీరియన్స్ ఛాలెంజ్ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రాజ్‌మార్గ యాత్ర యాప్‌లో జియో ట్యాగింగ్ ఆధారంగా ఉన్న టాయిలెట్ ఫోటోను అప్‌లోడ్ చేయాలన్నారు. అర్హత సాధించిన వారికి రూ.1,000 విలువైన ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ ఇస్తామన్నారు.