• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మంత్రుల సమావేశం నిర్వహించిన సీఎం

NDL: అమరావతిలోని సచివాలయంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రుల సమావేశం నిర్వహించారు. సహచర మంత్రులతో పాటు బనగానపల్లె ఎమ్మెల్యే, రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. 16వ పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో పలు కీలక విషయాలు చర్చించారు.

April 7, 2026 / 04:27 PM IST

‘అమరావతి పేరుతో దోపిడీ జరుగుతుంది’

అన్నమయ్య: YCP జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి పేరుతో భారీ అవినీతి జరుగుతోందని, సూపర్ సిక్స్ హామీలు అమలు కాలేదని అన్నారు. రాష్ట్రంలో చట్టవ్యవస్థ దెబ్బతిందని, అభివృద్ధి కేవలం ప్రచారానికే పరిమితమైందని విమర్శించారు. మావిగన్ ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు.

April 7, 2026 / 04:25 PM IST

విశాఖ–మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ రద్దు

VSP: డబ్లింగ్, విద్యుదీకరణ పనుల కారణంగా సికింద్రాబాద్–ధోన్ సెక్షన్‌లో రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. విశాఖ-మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ ఈనెల 10 నుంచి 17 వరకు జడ్చర్ల వరకే నడుస్తుంది. అలాగే మహబూబ్‌నగర్–విశాఖ ఎక్స్‌ప్రెస్ ఈనెల 11 నుంచి 18 వరకు జడ్చర్ల నుంచే ప్రారంభమవుతుంది.

April 7, 2026 / 04:22 PM IST

విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ

సత్యసాయి: పెనుకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెనుకొండ శాఖ ఆధ్వర్యంలో క్రీడా దుస్తులు అందజేశారు. విద్యార్థుల్లో క్రీడా ప్రోత్సాహం పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యులు రాఘవయ్య బ్యాంకు మేనేజర్ మహేష్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ శాలువాతో సత్కరించారు.

April 7, 2026 / 04:20 PM IST

జలధార కార్యక్రమంపై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్

E.G: జలధార కార్యక్రమం సత్ఫలితాలు సాధించడంలో ఇరిగేషన్‌తో పాటు ఇతర కోర్ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద జలధార కార్యక్రమంపై క్షేత్ర స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో జలధార–జలహారతి కార్యక్రమాలు భూగర్భ జలాల పెంపులో దిశానిర్దేశంగా నిలుస్తాయన్నారు.

April 7, 2026 / 04:20 PM IST

పసలదీవిలో ఉచిత పశువైద్య శిబిరం

WG: నరసాపురం మండలం పసలదీవిలో ఈ నెల 9న ఉచిత పశువైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ ఏడీ పి. చంద్ర శేఖర్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఏఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. శిబిరంలో పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. ఈ అవకాశాన్ని రైతులు, గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

April 7, 2026 / 04:13 PM IST

‘క్యూబాపై ఆర్థిక ఆంక్షలు విధించడం అమానుషం’

AKP: క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించడం అమానుషం అని సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. మంగళవారం అచ్యుతాపురంలో క్యూబాకి మద్దతుగా విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న క్యూబా దేశాన్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

April 7, 2026 / 04:13 PM IST

కమలాపురం రైల్వే గేటు బంద్

KDP:  కమలాపురం 134వ నంబర్ రైల్వే గేటు వద్ద అత్యవసర ట్రాక్ మరమ్మతు పనుల కారణంగా, ఏప్రిల్ 9 నుంచి 14వ తేదీ వరకు గేటును మూసివేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. ఈ మూసివేత కేవలం రాత్రి 10:00 నుంచి ఉదయం 5:00 గంటల వరకు మాత్రమే అమలులో ఉంటుందని తెలిపారు. ప్రజల భద్రత కోసం చేపడుతున్న ఈ పనులకు అందరూ సహకరించాలని అధికారులు కోరారు.

April 7, 2026 / 04:12 PM IST

జిల్లాలో పోషణ్ పక్వాడ్ ప్రారంభం

పోలవరం జిల్లాలోని 982 అంగన్వాడీ కేంద్రాల్లో రేపటి నుంచి 23వ తేదీ వరకు పోషణ్ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. తల్లి, శిశు సంక్షేమం, పోషకాహారంపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ లక్ష్యం అని జిల్లా మాతా శిశు సంక్షేమ శాఖ పీడీ ఉమ మంగళవారం తెలిపారు. జిల్లాలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో ఉన్నారని పేర్కొన్నారు.

April 7, 2026 / 04:11 PM IST

చెరువుల అభివృద్ధిని చేపట్టిన టీడీపీ ఇంఛార్జ్

ప్రకాశం: దోర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామంలో చెరువులు, కాలువల పునరుద్ధరణ పనులను యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రారంభించారు. ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యాచరణలో భాగంగా చెరువుల అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

April 7, 2026 / 04:00 PM IST

పోలీసులు చెంతకు తెలంగాణ బాలుడు

BPT: తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన రాజు అనే బాలుడు వేటపాలెంలో ప్రత్యక్షమయ్యాడు. వేటపాలెంకు చెందిన బాలగోపి అనే వ్యక్తికి రాజు రైల్వే స్టేషన్‌లో తారసపడి అన్నం పెట్టించమని అడిగాడు. అన్నం పెట్టిన తదుపరి రాజును వేటపాలెం ఎస్సై జనార్ధన్‌కు మంగళవారం అప్పగించాడు. రాజును ఆరా తీయగా తన తండ్రితో మంచిర్యాలలో ఉంటాడని చెప్పడంతో ఎస్సై అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

April 7, 2026 / 04:00 PM IST

కొడమంచిలిలో ప్రత్యేక అధికారికి ఫిర్యాదు..!

W.G: ఆచంట మండలం కొడమంచిలి పంచాయతీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన సోమేశ్వరరావును మంగళవారం కూటమి నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను ఆయనకు వివరించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపాలని నాయకులు కోరారు. స్పందించిన అధికారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

April 7, 2026 / 03:41 PM IST

ఆలయ పనుల పురోగతిపై సమీక్షించిన ఎమ్మెల్యే

CTR: పలమనేరు శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ పునరుద్ధరణ పనుల పురోగతిపై ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి మంగళవారం అధికారులు, అర్చకులతో పాటు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ గోపుర పనులు ఎంతవరకు వచ్చాయని ఈవో రమణారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. శివాలయ గర్భగుడి పునర్నిర్మాణానికి చేపడుతున్న చర్యలపై క్షుణ్ణంగా పరిశీలించారు.

April 7, 2026 / 03:38 PM IST

‘ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు అమలు చేయాలి’

అన్నమయ్య: రాష్ట్రంలో పెరుగుతున్న బస్సు ప్రమాదాలపై హోంమంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సమగ్ర సమీక్ష జరిగింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రమాదాల కారణాలు, రోడ్డు భద్రతా చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు అమలు చేయాలని నిర్ణయించారు.

April 7, 2026 / 03:37 PM IST

రేషన్ దుకాణాలు పరిశీలించిన తాహసీల్దార్

ELR: లింగపాలెం మండల MRO నజిముల్లషా మంగళవారం ఒకటవ నెంబర్ రేషన్ షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ రేషన్ షాపులో ఇచ్చే బియ్యాన్ని గర్భిణీ స్త్రీలు కూడా తినవచ్చని దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయన్నారు. కార్డుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని డీలర్లకు వివరించారు. అనంతరం స్టాక్ రిజిస్టర్లు పరిశీలించి పలు సూచనలు చేశారు.

April 7, 2026 / 03:34 PM IST