NDL: వి.కోటలో ABN ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్యపై బుధవారం జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. బాధిత కుటుంబానికి పరిహారం, ఒకరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
W.G: నరసాపురం మండలం సీతారాంపురంలో బుధవారం తెల్లవారుజామున రొయ్యల సీడ్ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. కాకినాడ నుంచి మొగల్తూరు వెళ్తున్న వ్యాన్.. సీతారాంపురం శివారులో రోడ్డు పక్కకు దూసుకెళ్లి పల్టీ కొట్టిందని గ్రామస్థులు తెలిపారు. ఈ ప్రమాదంలో లక్షలాది రూపాయల విలువైన రొయ్యల పిల్లలు నేలపాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది
TPT: వెంకటగిరి పట్టణంలోని రాజా ప్యాలెస్‌లో ఉన్న యువరాజు సర్వజ్ఞ కుమార కృష్ణ యాచేంద్రకు హనుమాన్ శోభాయాత్ర ఆహ్వాన పత్రికను హిందూ పరిషత్ సభ్యులు రామకృష్ణ అందించారు. హనుమాన్ శోభాయాత్రపై పలు విషయాలను వివరించారు. అనంతరం హనుమాన్ శాశ్వత ఉత్సవ విగ్రహాన్ని ఇస్తానని యువరాజు హామీ ఇవ్వడంతో పాటు హనుమాన్ స్వామి కృప ప్రజలందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నానన్నారు.
VZM: డెంకాడ మండలం మోపాడ నుంచి కొండర్రాజుపేట, బంగార్రాజుపేట దారికి వెళ్లే ప్రధాన రహదారి దెబ్బతింది. ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన వారు, వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.
CTR: వీ.కోట మండలంలో విలేకరి హత్య ఘటనపై జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ దర్యాప్తు కొనసాగుతుండగా, నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎవరూ నిర్ధారించని సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని ప్రజలకు, మీడియాకు విజ్ఞప్తి చేశారు.
ప్రకాశం: ఒంగోలు శివారులోని ఆలాస్ హోటల్ వద్ద మంగళవారం లారీ డ్రైవర్‌పై ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడి చేసి, బెదిరించి, అతని వద్ద ఉన్న రూ. 2వేల నగదును దోచుకొని పరారయ్యారు. వలేటివారిపాలెంనకు చెందిన శ్రీనివాసరావు చెన్నై వెళుతూ.. బహిర్భూమికి వెళ్లేందుకు లారీని ఆపినప్పుడు ఈ సంఘటన జరిగింది. బాధితుడు ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు భారీ ఊరట కల్పించింది. ఆయనకు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది. గతంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లకూడదంటూ కండీషనల్ బెయిల్ ఇవ్వగా.. ఇప్పుడు పూర్తి స్థాయి బెయిల్ ఇచ్చింది. ఈయన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు.
GNTR: తెలంగాణకి చెందిన ఆంజనేయులు, ప్రకాశం (D)కు చెందిన శ్రీనివాసకుమార్ మరికొందరు కలసి చుండూరు (M) చిన పరిమిలోని రామలింగేశ్వరస్వామి ఆలయ గోపుర కలశానికి మహిమలు ఉన్నాయని భావించి 2019లో చోరీ చేసేందుకు యత్నించారు. అప్పటి ఈవో ఫిర్యాదుపై నిందితులను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. మంగళవారం విచారణలో వీరికి 3 నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
బాపట్ల రెడ్‌క్రాస్ భవన్‌లో జనౌషధి కేంద్రాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం ప్రారంభించారు. తక్కువ ధరకే నాణ్యమైన మందులు అందించడమే దీని లక్ష్యమన్నారు. బ్రాండెడ్ కంటే జనరిక్ మందులు చవకగా లభిస్తాయన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. ప్రజలంతా ఈ సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.
KDP: ఖాజీపేటలో డీజిల్ కొరత తీవ్ర సమస్యగా మారింది. దీంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలో పలు గ్రామాలలో రబీ కింద వరి పంటలు సాగు చేశారు. ప్రస్తుతం పంట కోతకొచ్చింది. డీజిల్ కొరత వల్ల వరి కోత యంత్రాలు ముందుకు కదలలేకున్నాయి. డీజిల్ సమస్య కారణంగా యంత్రాలకు పని లేకుండా పోయిందని వాహనదారులు వాపోతున్నారు.
అన్నమయ్య: మాజీ సీఎం,బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని కలికిరికి వెళ్లనున్నారు. మార్గమధ్యంలో భాకరాపేట సమీపంలోని ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని, రాత్రికి కలికిరిలో బస చేస్తారు. శుక్రవారం స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. శనివారం సాయంత్రం తిరుపతికి చేరుకుని పద్మావతి అతిథి గృహంలో బస చేయనున్నారు.
NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. గత ఐదు రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద డీజిల్, పెట్రోల్ దొరకక ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పట్టణంలో ఉన్న పెట్రోల్ బంకులను పరిశీలించారు. డీజిల్ సమస్యలపై మాజీ ఎమ్మెల్యే పెట్రోల్ బంక్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
AKP: నాతవరంలో బుధవారం స్వచ్ఛపదం కార్యక్రమం నిర్వహించారు. నాతవరం నుంచి ఏకే అగ్రహారం వరకు సుమారు 2.5 కి.మీ రహదారి ఇరువైపులా శుభ్రపరిచారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎంపీడీఓ ఎం.ఎస్. శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ కే.మూర్తిబాబు, పంచాయతీ కార్యదర్శి బి.చంద్రశేఖర్, మాజీ ఎంపీపీలు కొండబాబు, విజయ్ కుమార్ పాల్గొన్నారు.
W.G: సేంద్రియ ఆహార ఉత్పత్తుల తయారీ ఎంత ముఖ్యమో, ప్యాకింగ్, బ్రాండింగ్ కూడా అంతే ముఖ్యమని జిల్లా ఉద్యానవన అధికారి షాజా నాయక్ తెలిపారు. వట్లూరులోని టీటీడీసీ సమావేశ మందిరంలో ‘ఆహార ఉత్పత్తుల ప్యాకింగ్, లేబిలింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ పై శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఉత్పత్తుల నాణ్యతతో పాటు ఆకర్షణీయమైన ప్యాకింగ్ కూడా ఎంతో అవసరమని అన్నారు.
NDL: డోన్ పట్టణానికి చెందిన అనీస్ అనే యువకుడు విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు. స్థానికంగా ఉన్న చీప్ అండ్ బెస్ట్ సెలూన్ షాప్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్న అతను మంగళవారం రాత్రి షాప్‌ను మూసే సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే అతన్ని కర్నూలులోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన బుధవారం కోలుకోలేక మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.