• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ రైతులకు సాంకేతిక సమస్యలు శాపంగా మారాయి’

W.G: సాంకేతిక సమస్యలు రైతుల పాలిట శాపంగా మారాయని రైతు నాయకుడు కూనపరెడ్డి రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నరసాపురంలో ఆయన మాట్లాడుతూ.. ఈ- పాస్ పుస్తకాలు అందక రైతులు సచివాలయాలు, మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదన్నారు. సైట్ ఓపెన్ కావడం లేదనే సాకుతో సిబ్బంది కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.

April 7, 2026 / 07:25 PM IST

డైరీ యూనిట్‌తో మహిళ ఆర్థికాభివృద్ధి: కలెక్టర్

సత్యసాయి: గుడిబండ మండలం కరికెర గ్రామంలో లక్ష్మమ్మ నిర్వహిస్తున్న డైరీ యూనిట్‌ను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మంగళవారం సందర్శించారు. డైరీ ద్వారా రోజుకు 30 లీటర్ల పాలు విక్రయిస్తూ… నెలకు రూ. 50 వేల ఆదాయం పొందుతున్నట్లు లక్ష్మమ్మ వివరించారు. మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో రాణించడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు.

April 7, 2026 / 07:20 PM IST

వైసీపీ నేత మృతి

ASR: డుంబ్రిగూడ మండలం కితలంగి పంచాయతీ పాడి గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు వయబారికి రౌతు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య హుటాహుటిన గ్రామానికి చేరుకుని పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

April 7, 2026 / 07:14 PM IST

పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం

KDP: దువ్వూరు మండలంలోని పెద్ద జొన్నవరం రైతు సేవా కేంద్రంలో జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం వాతావరణ మార్పుల వలన కలిగే ప్రతికూల పరిస్థితులను తట్టుకునే విధంగా సాగు పద్దతులపై శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఆర్సీ ఏవో స్వాతి మాట్లాడుతూ.. రైతులకు పంట సాగు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయన్నారు.

April 7, 2026 / 07:12 PM IST

రేపు కోర్టు విధులను బహిష్కరిస్తున్నాం: విజయ్ కుమార్

CTR: ఈనెల 8వ తేదీ బుధవారం పుంగనూరులో న్యాయవాదులు విధులను బహిష్కరిస్తున్నట్లు సంఘ అధ్యక్షులు విజయ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పీలేరులో న్యాయవాది పి.యల్లను దారుణంగా హత్య చేశారు. దీనిని ఖండిస్తూ స్థానిక న్యాయవాదులు రేపు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు తెలిపారు.

April 7, 2026 / 07:12 PM IST

వంద రోజులు యాక్షన్ ప్లాన్ పై ఎమ్మెల్యే సమీక్ష

W.G: రాష్ట్రంలో నీటి భద్రత కోసం చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ జలధార కార్యక్రమంపై తణుకులో ప్రభుత్వ అధికారులు, వాటర్ బాడీ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించటం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాల్వల పూడికతీత, మరమ్మతులు, భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

April 7, 2026 / 07:04 PM IST

‘విశాఖను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలి’

విశాఖ జిల్లాను దేశానికి ఆదర్శంగా నిలిపేలా వినూత్న అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలకు వేగంగా స్పందించాలని ఆదేశించారు.

April 7, 2026 / 07:04 PM IST

’23 మంది ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు’

కోనసీమ: పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకన విధులకు గైర్హాజరైన 23 మంది ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు ఇస్తున్నట్లు DEO పి. నాగేశ్వరరావు తెలిపారు. ఈ నెల 6న సోమవారం నుంచి పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించగా.. విధులకు హాజరు కావాల్సిన 23 మంది చీఫ్‌ ఎగ్జామినర్, అసిస్టెంట్‌ ఎగ్జామినర్స్, స్పెషల్‌ అసిస్టెంట్స్‌ విధులకు గైర్హాజరయ్యారన్నారు.

April 7, 2026 / 07:00 PM IST

తెనాలి ఎన్జీవో సంఘంలో నూతన నియామకాలు

GNTR: తెనాలి ఏపీఎన్జీవో సంఘ కార్యవర్గ సమావేశంలో ఖాళీగా ఉన్న నాలుగు పదవులను కోఆప్షన్ ద్వారా భర్తీ చేశారు. అధ్యక్షుడు బిక్షాలు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సుధాకర్‌ను వైస్ ప్రెసిడెంట్‌గా, వెంకటేష్, వికాస్ చంద్రలను జాయింట్ సెక్రటరీలుగా, ఆదిల్ హుస్సేన్‌ను డీఈసీ సభ్యుడిగా ఎంపిక చేశారు. జిల్లా జాయింట్ సెక్రటరీ నరసింహారావు హాజరయ్యారు.

April 7, 2026 / 07:00 PM IST

H.జంక్షన్ నుంచి రామన్నగూడెంకు కొత్త బస్ సర్వీస్

కృష్ణా: గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు బాపులపాడు మండలం రామన్నగూడెంకు కొత్త బస్ సర్వీస్ మంగళవారం ప్రారంభమైంది. హనుమాన్ జంక్షన్ నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరిన బస్ 8.30కి రామన్నగూడెం చేరుకుని, వెంటనే తిరిగి జంక్షన్‌కు బయలుదేరుతుంది. సాయంత్రం 5 గంటలకు మరో సర్వీస్ ప్రారంభమై 5.30కి గ్రామానికి చేరుతుంది.

April 7, 2026 / 07:00 PM IST

పన్నులు కట్టకపోతే చట్టపరమైన చర్యలు

PLD: చిలకలూరిపేట మున్సిపాలిటీకి రూ.11 కోట్ల పన్ను ఆదాయం వచ్చిందని ఆర్వో సుబ్బారావు తెలిపారు. ఆదాయ రాబడిలో ఇది రాష్ట్రంలో 35వ స్థానంలో ఉందన్నారు. బకాయిలపై వడ్డీ రాయితీని ఏప్రిల్ ఆఖరు వరకు ప్రభుత్వం పొడిగించిందన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వాడుకోవాలన్నారు. పన్నులు చెల్లించని వారిపై కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

April 7, 2026 / 07:00 PM IST

ఎస్.కొండలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశావర్కర్ల సమావేశం

ప్రకాశం: సింగరాయకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం డాక్టర్ ఆయేషా ఆధ్వర్యంలో ఆశ వర్కర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ భానుమతి మాట్లాడుతూ.. క్షయ వ్యాధి లక్షణాలు లెప్రసీ వ్యాధి లక్షణాలను వాటి నివారణకు అవగాహన కల్పించారు. వేసవిఅధికంగా ఉన్నందునకొబ్బరినీళ్ళు ఉప్పుకలిపిన మజ్జిగ వోఆర్ఎస్ లవణమును తీసుకోవాలని సూచించారు.

April 7, 2026 / 07:00 PM IST

బేటీ బచావో–బేటీ పడావోపై అవగాహన

VZM: కలెక్టరేట్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘బేటీ బచావో-బేటీ పడావో’ పథకంపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణ అనర్థాలపై అధికారులు వివరించారు. అలాగే పోక్సో చట్టం, మానవ అక్రమ రవాణా నివారణపై చర్చించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.

April 7, 2026 / 07:00 PM IST

JNTU సీనియర్ ప్రొఫెసర్‌కు అరుదైన అవార్డు

ATP: అనంతపురం JNTU సివిల్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ వైశాలి ఘోర్పడే ‘బెస్ట్ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్’ అవార్డుకు ఎంపికయ్యారు. ఏప్రిల్ 10న టెక్కలిలో జరిగే ఏపీ ISTE రాష్ట్ర సదస్సులో ఈమె ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు తమ గురువుకు రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

April 7, 2026 / 06:50 PM IST

జిల్లాలో పోలీసుల వాహన తనిఖీలు

సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులపై తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ లేకపోవడం, అతివేగం వంటి నిబంధనల ఉల్లంఘనలపై నిఘా ఉంచారు.

April 7, 2026 / 06:50 PM IST