• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మర్రిపాలెం అటవీ రేంజ్ అధికారిగా వెంకటరాజు

ASR: కొయ్యూరు మండలం మర్రిపాలెం అటవీ రేంజ్ అధికారిగా వెంకటరాజు ఇవాళ నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. మర్రిపాకలు రేంజ్ అధికారి సింహాచలం చోడవరం బదిలీ అయ్యారు. ఈమేరకు, చింతపల్లి రేంజ్ పరిధిలో డిప్యూటీ రేంజ్ అధికారిగా పనిచేస్తున్న వెంకటరాజు మర్రిపాకలు ఇన్‌ఛార్జ్ రేంజ్ అధికారిగా నియమితులయ్యారు. ఈ సందర్బంగా ఆయనకు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

April 7, 2026 / 11:06 AM IST

రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా బంద్

ATP: గుత్తి పట్టణ శివారులోని సత్యసాయి తాగునీటి పైప్‌ లైన్ లీకేజ్‌కు మున్సిపాలిటీ సిబ్బంది మంగళవారం మరమ్మతు పనులు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మీయ మాట్లాడుతూ.. తాగునీటి పైప్‌ లైన్ లీకేజ్ కారణంగా గుత్తి పట్టణానికి రెండు రోజులపాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. మరమ్మతుల అనంతరం తాగునీటి సరఫరా యథావిధిగా జరుగుతుందన్నారు.

April 7, 2026 / 11:04 AM IST

బొబ్బిలి మున్సిపల్ ఆర్‌వో‌గా ఉమామహేశ్వరరావు

VZM: బొబ్బిలి మున్సిపల్ రెవిన్యూ అధికారిగా ఎల్.ఉమామహేశ్వరరావు నియామకమయ్యారు. యలమంచిలి మున్సిపాలిటీలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఆయనకు ప్రమోషన్ రావడంతో ఆర్‌వో‌గా బాధ్యతలు స్వీకరించారు. పన్నులను సకాలంలో వసూలు చేసి మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

April 7, 2026 / 11:02 AM IST

పిడుగు పడి వ్యక్తి మృతి

SKLM: మెళియాపుట్టి మండలం రట్టిని గ్రామానికి చెందిన వినోద్ (40) మహేంద్రగిరి పర్వతంపై పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. మృతునికి భార్య సంతోషి, ఇద్దరూ పిల్లలు ఉన్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

April 7, 2026 / 11:00 AM IST

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు

VSP: దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, పద్మజ దంపతులు ఇవాళ పోలమాంబ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అంతరాలయంలో చీర, సారె, పసుపు, కుంకుమతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈవో రాజ్ గోపాల్ రెడ్డి ప్రసాదం అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో కోరికలు నెరవేరుతాయని ఎమ్మెల్యే తెలిపారు.

April 7, 2026 / 11:00 AM IST

క్షుద్ర పూజలపై పోలీసులను ఆశ్రయించిన బాధితులు

KRNL: హొళగుంద మండల కేంద్రంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. సాయిబన్న దర్గా వెనుక భాగంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించి, సుమారు 23 మంది రాజకీయ నాయకులు, విలేకరులు, మహిళల ఫోటోలను భూమిలో పాతిపెట్టినట్లు బాధితులు ఇవాళ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై స్థానిక ఎస్సై దిలీప్ కుమార్ స్పందించి, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

April 7, 2026 / 10:49 AM IST

జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో సత్తా చాటిన బుచ్చి వాసి

నెల్లూరులోని మిక్లిమ్స్ క్లబ్‌లో జిల్లాస్థాయి క్యారం బోర్డ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో మొదటి స్థానం బుచ్చిరెడ్డిపాలెం పట్టణానికి చెందిన కోఆప్షన్ నెంబర్ అల్లా బక్షు గెలిచారు. దీంతో నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించి కప్‌ను అందజేశారు. రాష్ట్రస్థాయి పోటీల్లో గెలవాలని వారు ఆకాంక్షించారు. యువత క్రీడలపై ముక్కువ చూపాలన్నారు.

April 7, 2026 / 10:44 AM IST

తిరుమల దర్శన టోకెన్లు దొరకడం లేదు..!

TPT: వేసవి సెలవులు మొదలు కావడంతో తిరుమలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. తిరుపతిలో జారీ చేస్తున్న దర్శన టోకెన్లు గంటల వ్యవధిలో అయిపోతున్నాయి. ఫ్రీ దర్శనం కోసం వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు టోకెన్ల కోసం మరుసటి రోజు కోసం ఆగాల్సివస్తోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాడ్జీల ధరలు ఎక్కువ కావడంతో చెట్ల కిందే నిద్రిస్తున్నారు.

April 7, 2026 / 10:40 AM IST

రైతుల సుదీర్ఘ త్యాగం ఫలించింది: ఎంపీ

ATP: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంపై అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. రాజధాని కల సాకారం చేసినందుకు రాష్ట్రపతి ముర్ముకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రైతుల సుదీర్ఘ త్యాగం, సహనం ఫలించిన చారిత్రాత్మక సందర్భమిదని ఆయన పేర్కొన్నారు.

April 7, 2026 / 10:31 AM IST

‘వేసవిలో నీటి ఎద్దడి నివారణకు పటిష్ఠ చర్యలు అవసరం’

VZM: వేసవిలో నీటి ఎద్దడి నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని డీడీవో కిరణ్ కుమార్ అన్నారు. బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి వేసవిలో తాగునీటికి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. మంచినీటి పథకాల మోటార్లు మరమ్మతులకు గురైతే 24 గంటల్లో బాగు చేయాలని వారికి ఆదేశించారు.

April 7, 2026 / 10:30 AM IST

మిగులు సీట్ల భర్తీకి ధరఖాస్తుల ఆహ్వానం

ASR: కొయ్యూరు మండలం బాలరాం ఏకలవ్య మోడల్ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరంలో మిగులు సీట్ల భర్తీకి ఆసక్తిగల విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ సతీష్ కుమార్ ఇవాళ తెలిపారు. 7వ తరగతిలో 2సీట్లు (1బాలుడు, 1బాలిక), 8వ తరగతిలో 1సీటు (బాలుడు) చొప్పున 3సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలన్నారు.

April 7, 2026 / 10:30 AM IST

ఆర్యవైశ్యుల మధ్య ముదురుతున్న ఎన్నికల వివాదం..!

GNTR: తెనాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సత్రం కమిటీ ఎంపిక వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. నూతన కమిటీ ఎన్నికకు సంబంధించి కొంతకాలంగా ఆర్యవైశ్య సభ్యుల మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది. అనుకోని విధంగా కోర్టు ఆదేశాలతో ఎన్నికకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీంతో పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.

April 7, 2026 / 10:27 AM IST

వాణిజ్య పన్నుల వసూళ్లలో విశాఖ టాప్

విశాఖ వాణిజ్య పన్నుల శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,845.39 కోట్ల వసూళ్లతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందని జాయింట్ కమిషనర్ పీబీ వల్లీ తెలిపారు. గత ఏడాది రూ.1,733.59 కోట్లతో పోలిస్తే ఈసారి రూ.111.8 కోట్ల అధికంగా ఆదాయం నమోదైందన్నారు. బకాయిల వసూళ్లలో పురోగతి సాధించి, 2025 మార్చి నాటికి రూ.150.71 కోట్ల నుంచి 2026 మార్చి నాటికి రూ.158.59 కోట్లకు పెరగిందని వెల్లడించారు.

April 7, 2026 / 10:25 AM IST

పిడుగుపాటు గురైన వ్యక్తికి చికిత్స

ప్రకాశం: పొన్నలూరు సమీపంలోని ఏటి ప్రాంతంలో సోమవారం సాయంత్రం కురిసిన ఆకాల వర్షానికి పిడుగు పడి చుండి శ్యామ్యూల్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడిని మెరుగైన చికిత్స కోసం మంగళవారం ఒంగోలు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. డాక్టర్లు మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వారు పేర్కొన్నారు.

April 7, 2026 / 10:25 AM IST

ఆహార కల్తీపై శాంపిల్స్.. 68 మందికి నోటీసులు..!

కడప జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో అధికారులు 528 ఆహార శాంపిల్స్ సేకరించారు. 50 శాంపిల్స్ రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో 68 మందికి నోటీసులిచ్చారు. ఆహార కల్తీపై 4 క్రిమినల్, 12 పెట్టీ కేసులు నమోదు చేస్తున్నామని జిల్లా ఆహార భద్రతా నియంత్రణ శాఖ అధికారులు రామచంద్ర, హరిత తెలిపారు. దుకాణాల లైసెన్స్, రెన్యువల్, పెనాల్టీల ద్వారా రూ.39,29,900ల ఆదాయం వచ్చిందన్నారు.

April 7, 2026 / 10:25 AM IST