• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. వృద్ధురాలు ఫిర్యాదు

కోనసీమ: హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో పవన్ కళ్యాణ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై అమలాపురానికి చెందిన 80 ఏళ్ల జనసేన వీర మహిళ ముత్యాల మణెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శలకు హద్దులు ఉండాలని, వ్యక్తిగత దూషణలు సమంజసం కాదని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అమలాపురం పట్టణ పోలీసులను కోరారు.

May 31, 2026 / 04:00 PM IST

రాయచోటిలో ఎస్‌ఐఆర్‌పై వైసీపీ అవగాహన సమావేశం

అన్నమయ్య: రాయచోటిలో వైసీపీ బీఎల్ఏలకు ఎస్‌ఐఆర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు అమరనాథరెడ్డి, పార్లమెంట్ పరిశీలకులు సురేష్ బాబు హాజరయ్యారు. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించకుండా ప్రతి ఓటును కాపాడుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు.

May 31, 2026 / 03:24 PM IST

యాదవుల హక్కుల సాధన మహా ధర్నా

GNTR: మంగళగిరిలో AP యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హక్కుల సాధనకై మహా ధర్నాను నిర్వహించారు. కూటమి ప్రభుత్వం యాదవులను నిర్లక్ష్యం చేస్తోందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు మండిపడ్డారు. యాదవ కార్పొరేషన్‌కు రూ.6 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అమరావతిలో యాదవ భవనానికి 10 ఎకరాల స్థలం, రూ.10 కోట్లు ఇవ్వాలన్నారు. జనాభా ప్రకారం చట్టసభల్లో ప్రాధాన్యం కల్పించాలన్నారు

May 31, 2026 / 03:24 PM IST

తల్లికి వందనం.. ఎస్సీ విద్యార్థులకు ముఖ్య గమనిక

NDL: తల్లికి వందనం పథకం లబ్ధి కోసం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అర్హత కలిగిన ఎస్సీ విద్యార్థులు జూన్ 10లోగా బ్యాంకు ఖాతాలు తెరవాలని డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ బి.రాధిక ఓ ప్రకటనలో తెలిపారు. యూనియన్ బ్యాంకు/పోస్టాఫీసులో విద్యార్థి పేరుతో ఖాతా తెరచి, NPCI లింక్ చేయాలని సూచించారు. ఆధార్‌కు లింక్ అయిన ఫోన్ నంబర్‌తో సచివాలయాలను సంప్రదించాలన్నారు.

May 31, 2026 / 03:22 PM IST

వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన మంత్రి నిమ్మల

W.G: రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు తన స్వగ్రామమైన ఆగర్తిపాలెంలో ఆదివారం వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. పాలకొల్లు నుంచి 7 కి.మీ. సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిన ఆయన, దారిపొడవునా ప్రజలను కలుస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన సొంత రొయ్యల చెరువులో మేత వేసి, ఎదుగుదలను పరిశీలించారు. సొంత పొలంలో కూలీలతో కలిసి ట్రాక్టర్‌పై దుక్కు దున్నారు.

May 31, 2026 / 03:18 PM IST

వైసీపీ ఆరోపణల ఖండించిన తెలుగు యువత

కృష్ణా: విజయవాడ రూరల్ నిడమానూరులో తెలుగు యువత నాయకులు వైసీపీ ఆరోపణలను ఖండించారు. జగన్ హయాంలో నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేసిందన్నారు. మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యారంగంలో సంస్కరణలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

May 31, 2026 / 03:15 PM IST

కార్డాన్ సెర్చ్‌.. వాహనాలు స్వాధీనం..!

BPL: నాటు సారా, గంజాయి వంటి మత్తు పదార్థాల క్రయవిక్రయాలకు పాల్పడితే తీవ్రమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చీరాల డీఎస్పీ ఎం.డి.మోయిన్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ నేతృత్వంలో చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌నగర్‌లో పోలీసు అధికారులు, సిబ్బంది ఆదివారం ఉదయం నుండి కార్డాన్ సెర్చ్ చేశారు.

May 31, 2026 / 03:15 PM IST

జాతీయ స్థాయిలో రొంపిచర్ల బాలిక ప్రతిభ

PLD: ఒడిశాలో జరిగిన సబ్‌జూనియర్ బేస్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో ఏపీ బాలికల, బాలుర జట్లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఫెడరేషన్ ప్రశంసలు అందుకున్నాయి. ప్రత్యేకంగా బాలికల జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. జట్టులో పిచర్‌గా ఉన్న పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన క్రీడాకారిణి పమ్మి చంద్రిక 6 మ్యాచ్‌ల్లో 96% స్ట్రైక్ రేట్ నమోదు చేసి విశేష ప్రతిభ కనబరిచింది.

May 31, 2026 / 03:15 PM IST

చీడిగుంటలో తీవ్ర మంచినీటి సమస్య

ASR: గూడెంకొత్తవీధి మండలం దారకొండ పంచాయతీ పరిధిలోని చీడిగుంట గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న ఏకైక చేతి పంపు మరమ్మతులకు గురికావడంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కిలోమీటరు దూరంలో ఉన్న ఊట నుంచి నీరు తెచ్చుకుని అవసరాలు తీర్చుకుంటున్నామని పేర్కొన్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

May 31, 2026 / 03:13 PM IST

జాయింట్ కలెక్టర్‌కు ఆత్మీయ వీడ్కోలు

మన్యం జిల్లా పరిపాలనలో సమర్థవంతమైన సేవలు అందించి ఇటీవల ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శాఖకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బదిలీ అయిన జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్ మందిరంలో ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి ఉన్నతాధికారులు, రెవెన్యూశాఖ సిబ్బంది పెద్దఎత్తున హాజరై ఆయన సేవలను కొనియాడారు.

May 31, 2026 / 03:07 PM IST

హోంగార్డుపై దాడి దుర‌దృష్ట‌క‌రం: హోంమంత్రి

VSP: షీలా నగర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు కేవీ వెంకటరమణను రాష్ట్ర హోంమంత్రి అనిత పరామర్శించారు. లంకెలపాలెం వద్ద విధి నిర్వహణలో ఉన్న సమయంలో జరిగిన దాడిలో వెంకటరమణ గాయపడిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

May 31, 2026 / 03:06 PM IST

త్రాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

AKP: నర్సీపట్నం మండలం అమలాపురం గ్రామంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు అనిమిరెడ్డి శ్రీను ఆధ్వర్యంలో ఆదివారం బావి శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టారు. బోర్లు ఎండిపోవడంతో నీటి కొరత ఏర్పడటంతో బావిలో పేరుకుపోయిన చెత్త, మురికి, పిచ్చిమొక్కలను తొలగించి వినియోగానికి సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

May 31, 2026 / 03:03 PM IST

15 కిలోల టమోటా బాక్స్ ధర ఎంతంటే..?

CTR: పుంగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం 15 కిలోల టమోటా బాక్స్ ధర రూ.400 పలికింది. దిగుబడి పెరగడంతో టమోటా కాయలు మార్కెట్‌కు ఎక్కువ శాతం వస్తున్నాయి. ఇవాళ 835.50 మెట్రిక్ టన్నులు టమాటాలు వచ్చాయి. మొదటి రకం బాక్స్ రూ. 400, రెండవ రకం బాక్స్ రూ. 300 పలకగా.. మూడో రకం బాక్స్ రూ. 180 వరకు పలికాయి.

May 31, 2026 / 03:03 PM IST

రేపు మదనపల్లి కలెక్టరేట్ వద్ద నిరసన

CTR: మదనపల్లి కలెక్టరేట్ వద్ద రేపు చేపట్టే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని YCP యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మిద్దింటి కిషోర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతూ మోసం చేస్తున్న తీరుపై ఉద్యమిస్తున్నట్లు తెలిపారు. DSC అక్రమాలపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

May 31, 2026 / 03:03 PM IST

ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు

VZM: గజపతినగరం మండలంలోని డోలపాలెం గ్రామంలో దుర్గాదేవి ఆలయ నిర్మాణానికి టీటీడీ రూ. 20 లక్షల మంజూరు చేసినట్లు ఆ గ్రామ మాజీ సర్పంచ్ శీర అప్పలనాయుడు ఆదివారం తెలిపారు. గుడి నిర్మాణానికి నిధులు కావాలని ఇటీవల రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు తనతో పాటు బీబీ ఛానల్ వైస్ ఛైర్మన్ బొత్స సూర్యనారాయణ, స్థలదాత అప్పలనాయుడు కూటమి నేతలు కోరామన్నారు.

May 31, 2026 / 03:01 PM IST