కడప నగరంలోని కోటిరెడ్డి SKR ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సలీంబాషా తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల్లో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న, పూర్తిచేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అన్నమయ్య: తాళ్లపాక అన్న మాచార్యుల జయంతి ఉత్సవాలను మే 2 నుంచి 8వ తేదీ వరకు తితిదే ఆధ్వర్యంలో తాళ్లపాక, బోయనపల్లి అన్నమయ్య విగ్రహం వద్ద నిర్వహిస్తున్నట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ బాలాజీ మంగళవారం తెలిపారు. మే 2న అన్నమాచార్య ప్రాజెక్ట్‌కు కళాకారులచే సప్తగిరి సంకీర్తన గోస్టి గానం, శ్రీవారి కల్యాణం, ఊంజల్ సేవ, సంగీత కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు.
CTR: యుద్ధంతో చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో సుమారు రూ. 1.50 లక్షల ఎకరాల్లో మామిడి సాగులో ఉంది. ఏటా రూ. 2.50 లక్షల మెట్రిక్ టన్నుల గుజ్జును పల్ప్ ఫ్యాక్టరీలు తయారు చేస్తాయి. దీంట్లో అధిక శాతం గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. యుద్ధంతో తాత్కాలికంగా ఆగిన ఆర్డర్లు రాకపోవడంతో ఫ్యాక్టరీలో యజమానులు అయోమయంలో ఉన్నారు.
BPT: సంతమాగులూరు మండలంలోని పాత మాగులూరులో హౌసింగ్ పీడీ శ్రీనివాస్ ప్రసాద్ లే అవుట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడిన ఆయన, కేటాయించిన లే అవుట్లలో త్వరగా ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు.
ప్రకాశం: కనిగిరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా ఆరిఫ్ ఖాన్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అటవీ సంపదను పరిరక్షించడం అత్యంత ముఖ్యమని, అటవీ ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలను అరికట్టడంలో అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలన్నారు.
KRNL: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. జిల్లాలోని 27 మండలాల్లో మంగళవారం 16 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా చిప్పగిరి మండలంలో 42.2 డిగ్రీలు, దేవనకొండ మండలంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ATP: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. ఎస్పీ జగదీష్‌తో కలిసి నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పీఎం రాహత్’ పథకం ద్వారా ప్రమాదాల్లో గాయపడిన వారికి రూ.1.5 లక్షల వరకు చికిత్స అందుతుందని, దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కోరుతూ గోడపత్రికలను ఆవిష్కరించారు.
VSP: జీవీఎంసీ స్వచ్ఛ సర్వేక్షణ్-2026 పోటికి సన్నద్ధమవుతోంది. ఈసారి దేశవ్యాప్తంగా సుమారు 4,600 నగరాలు పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. పారిశుధ్య నిర్వహణతో పాటు ప్రజాభిప్రాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో త్వరలో కేంద్ర బృందం నగరాన్ని సందర్శించే అవకాశం ఉంది. ఇంటింటి చెత్త సేకరణ, తడి-పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పిస్తున్నారు.
SKLM: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ ఖరారుకు సంబంధించి ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ మే 1 న జిల్లాలో పర్యటించ నుందని కలెక్టర్ స్పప్నిల్ దినకర్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం ఉ.10.30 గంటల నుంచి మ. 1 గంట వరకు కుల సంఘాలు, ప్రజాప్రతినిధులు నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారని తెలిపారు.
VZM: పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పరిశుభ్రత కోసం అందిస్తున్న సేవలు ఎనలేనివని చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకటరావు కొనియాడారు. మంగళవారం మెరకముడిదాం మండల కేంద్రంలో స్వచ్చ రధాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాలను, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమైనదని అన్నారు.
PPM: చెక్‌లిస్ట్‌లో ఎఫ్.పి.ఓ ల విధులు నమోదు చేయాలని, నిధులు మంజూరు, ఖర్చులపై నివేదిక సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ సీ. యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహిస్తామని, వచ్చినప్పుడు సమగ్ర సమాచారంతో రావాలని జె. సి.సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎఫ్.డి.ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు.
NDL: టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ సభ్యులు బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి నారా లోకేష్, జాతీయ ప్రధాన కార్యదర్శిగా డా. బైరెడ్డి శబరి బాధ్యతలు చేపట్టనున్నారు. 252 మందితో కొత్త కార్యవర్గాన్ని టీడీపీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఉ. 9 గంటలకు మంగళగిరి పార్టీ హెడ్ ఆఫీసులో కార్యక్రమం జరగనుంది.
WG: జిల్లాలో డీజిల్ కొరత అపోహలు వీడి, సరఫరా సాధారణ స్థితికి చేరుకుందని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి భీమవరం, ఉండి తదితర ప్రాంతాల్లోని బంకులను ఆయన తనిఖీ చేశారు. రైతులు, మత్స్యకారులకు కూపన్ల ద్వారా ఇంధనం అందిస్తున్నామన్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా అవసరమైన మేరకే డీజిల్ కొనుగోలు చేసి సహకరించాలని ఆయన కోరారు.
KDP: రాజుపాలెం మండలంలోని వెల్లాలలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ స్వామి శేషవాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఉదయం నుంచి స్వామి, అమ్మవార్లను ప్రత్యే కంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం పుర వీధుల్లో ఊరేగించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ నారాయణ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
NLR: జిల్లాలో SC, STలకు సోలార్ పథకంపై దృష్టిపెట్టాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ మంగళవారం సాయంత్రం అధికారులకు సూచించారు. నెల్లూరులో అధికారులతో ఆయన సమీక్షించారు. ‘SC, STలకు ఉచితంగా సోలార్ కరెంట్ కల్పించాలి, ఇళ్లపై సౌర ప్యానెల్స్ పెట్టుకుంటే కరెంట్ బిల్లు తగ్గే అవకాశం ఉంటాయనే విషయాన్ని ప్రజలకు చెప్పాలని ఆయన సూచించారు.