NTR: ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా వీరులపాడులో నిర్వహించిన ఉమ్మడి కృష్ణా- ఖమ్మం జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ఘనంగా ముగిశాయి. పోటీల్లో ఖమ్మం సాగర్ జట్టు ప్రథమ స్థానం సాధించి రూ. 20,116 నగదు బహుమతి అందుకుంది. విజయవాడ స్వామి జట్టు ద్వితీయ స్థానం సాధించి రూ.10,116, వీరులపాడు గణేష్ జట్టు తృతీయ స్థానం సాధించి రూ. 7,116 బహుమతులు పొందాయి.
అనకాపల్లి జిల్లా కొత్త రిజిస్ట్రార్‌గా పి. రత్నకుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. విశాఖ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆడిట్ విభాగంలో పనిచేస్తున్న ఆయన పదోన్నతపై అనకాపల్లి జిల్లా రిజిస్ట్రార్‌గా బదిలీ అయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన మన్మధరావు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.
విజయనగరం: కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెం గ్రామం రెల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 21/11,13,15 విస్తీర్ణం 1.50 సెంట్లు భూమిలో మండల తహసీల్దార్ రమాలక్ష్మి ఆదేశాల మేరకు స్థానిక వీఆర్వో సుధీర్, సర్వేయర్ చంద్రశేఖర్‌తో కలిసి ప్రభుత్వ హెచ్చరిక బోర్డును పెట్టారు. మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించబోమని ఆమె తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
ELR: కుక్కునూరు మండలంలో వివాహితను వేధించిన ఘటనలో కానిస్టేబుల్‌పై వేటు పడింది. తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు అరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది.
SKLM: జిల్లాలో ఆదివారం మాంసం ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ ధరలు గతంతో పోలిస్తే కొద్దిగా తగ్గాయి. స్కిన్‌తో కూడిన చికెన్ కేజీ రూ.210, స్కిన్ లెస్ చికెన్ రూ.230కి విక్రయిస్తున్నారు. నాటుకోడి ధర రూ.700 ఉండగా, పొట్టేలు మాంసం కేజీ రూ.1000కు అమ్ముతున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చని వ్యాపారులు తెలిపారు.
అన్నమయ్య: మదనపల్లి మండలంలో, సిద్ధమ్మగారిపల్లెలోని రాముల గుడిలో శనివారం విద్యుత్ దీపాల అలంకరణ పనులు చేస్తున్న అరుణ్ (20) అనే యువకుడు కాలుజారి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకుల కథనం ప్రకారం, బసినికొండకు చెందిన అరుణ్, పూజల నేపథ్యంలో గుడి పైకి ఎక్కి లైట్లు అమర్చుతుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు.
KDP: బద్వేల్ పట్టణం,చుట్టుపక్కల గ్రామాలలో గేదెలు, ఎద్దులు, దున్నపోతులు తదితర పశువుల యజమానులకు CI రామకృష్ణ కీలస సూచన చేశారు. పశువుల మెడకు,కొమ్ములకు రేడియం స్టిక్కర్లు, రిఫ్లెక్టివ్ టేపులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. రాత్రి వేళల్లో జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులపై సంచరించే పశువులు వాహనదారులకు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.
NTR: అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమి సందర్భంగా ఆదివారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. ఈవో వి.కె. శీనానాయక్ దంపతులు ప్రత్యేక పూజల అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేద మంత్రోచ్చారణలు, భజనలు, కోలాట నృత్యాలతో సాగిన ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. మార్గమంతా భక్తులకు కుంకుమ, ప్రసాదాలను అందజేశారు.
CTR: గుడిపాల(మం) రామభద్రాపురం గ్రామంలో అక్కమ్మ జాతరకు స్థానికుల నాయకుల ఆహ్వానం మేరకు చిత్తూరు ఎమ్మెల్యే తండ్రి, గురజాల చెన్నకేశవులు నాయుడు హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పార్టీ శ్రేణులు ఆయనను ఘనంగా సన్మానించి, అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.
విశాఖ: శ్రీనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అని స్థానికులు తెలిపారు. లారీ పంచర్ కావడంతో రోడ్డు పక్కన ఆగి ఉండగా అదుపుతప్పి బస్సు ఆ లారీని ఢీకొట్టిందన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పాసింజర్లు, అసిస్టెంట్ డ్రైవరు మృతి చెందారు. ఏడుగురు గాయపడడంతో వారిని అగనంపూడి కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.
అన్నమయ్య: జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీస్ శాఖ సరికొత్త తనిఖీలు శనివారం ప్రారంభించింది. ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో పీలేరు, పుంగనూరు పరిధిలో అధునాతన ‘డ్రగ్ డిటెక్షన్’ కిట్లతో ముమ్మరంగా పరీక్షలు చేశారు. మొత్తం 13 మంది అనుమానితులకు పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చింది. గంజాయి రాపిడ్ టెస్టులో పాజిటివ్ వస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
మన్యం: ఎన్నికల్లో అబద్ధ హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి స్థానిక సంస్థలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పార్వతీపురం మాజీ MLA అలజంగి జోగారావు అన్నారు. జూన్ 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలను చంద్రబాబు ఎంత కాలం మోసం చేశారని అన్నారు.
NTR: మోసం, బెదిరింపులకు పాల్పడుతున్న ఓ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ మాచినేని కోటేశ్వరరావును పడమట పోలీసులు అరెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ పేరుతో ప్లాట్లు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని పలువురిని మోసం చేసినట్లు తెలిపారు. నిందితుడిపై 10 కేసులు ఉండగా, 50 మందికిపైగా బాధితులు ఉన్నట్లు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదుతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
సత్యసాయి: ధర్మవరం పట్టణం కొత్తపేటలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం పవిత్ర వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వామివారు లక్ష్మీదేవితో కలిసి భక్తులకు దర్శనమిస్తారు. ఆలయంలో నిత్య పూజలతో పాటు శ్రావణ మాసం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాల సమయంలో విశేష ఉత్సవాలు నిర్వహిస్తారు. అనేకమంది భక్తులు కుటుంబ సమేతంగా దర్శించుకుంటారు.
ATP: 2029 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇచ్చినా అనంతపురం నుంచి పోటీ చేయనని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి స్పష్టం చేశారు. శనివారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే నియోజకవర్గాల పునర్విభజనలో సీట్లు పెరిగితే పక్క నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతానన్నారు. ఏదేమైనా రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవ కొనసాగిస్తానని ఆయన వెల్లడించారు.